Medak

News June 8, 2024

సిద్దిపేట: సన్నాల సాగు అంతంతే..!

image

ఉమ్మడి జిల్లాలో వరి సాగుపై రైతులు అయోమయంలో పడిపోయారు. గతంలో 80% దొడ్డు వడ్లు, 20% సన్న రకాలు సాగుచేసే వారుగా ప్రస్తుతం బోనస్ ప్రకటనతో అయోమయంలో పడ్డారు. సిద్దిపేట జిల్లాలో గత వానకాలంలో 3,32, 006 ఎకరాలు, యాసంగిలో 3,48,009 ఎకరాల్లో సాగైంది. మెదక్‌ జిల్లాలో గత వానకాలంలో 3,00,967, యాసంగిలో 1,85,295 ఎకరాల్లో, సంగారెడ్డి జిల్లాలో గత వానకాలంలో 1,04,000 ఎకరాలు, యాసంగిలో 1,03,000 ఎకరాల్లో వరి సాగు చేశారు.

News June 8, 2024

మెదక్: సోమవారం నుంచి యథావిధిగా ప్రజావాణి

image

మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నిక నేపథ్యంలో నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమం వచ్చే సోమవారం ( ఈ నెల 10) నుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఇకపై ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజలు నేరుగా వచ్చి తమ తమసమస్యలను వినిపించవచ్చున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు.

News June 7, 2024

మెదక్: పిడుగుపడి వ్యక్తి మృతి.. మరో ఇద్దరికి అస్వస్థత

image

పిడుగుపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా రాజ్ పల్లిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మార్గం సిద్దిరాములు(55) కుటుంబ సభ్యులతో కలిసి పొలం పనులు చేయడానికి వెళ్లారు. సాయంత్రం ఆకాశం మేఘావృతమై వర్షంతోపాటు పిడుగు పడింది. సిద్దిరాములు మృతిచెందగా భార్య రాధమ్మ, మరో మహిళా మౌనిక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు.

News June 7, 2024

మెదక్: అగ్నిపథ్ పోస్టర్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్

image

మెదక్‌లోని జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ వైమానిక దళ అధికారులతో కలిసి అగ్నిపథ్ పోస్టర్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంలో భాగంగా భారత వైమానిక దళం వారు అగ్నివీర్ వాయు అనే పేరుతో నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. యువతీ, యువకులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయాశాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News June 7, 2024

మెదక్: పిడుగుపాటుకు గురై మహిళా రైతు మృతి

image

చిలిపిచేడ్ మండలం చిట్కుల్‌లో పిడుగుపాటుకు ఒక మహిళ రైతు మృతిచెందింది. గ్రామానికి చెందిన బోయిని నర్సమ్మ (50) తమ వ్యవసాయ పొలం వద్ద పనులు పూర్తిచేసుకుని తిరిగి వస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గ్రామశివారులోకి రాగానే పిడుగుపాటుకు గురై నర్సమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.

News June 7, 2024

సిద్దిపేట: గ్రూప్-1 సెంటర్‌ల వద్ద 144 సెక్షన్

image

ఈనెల 9న జరిగే గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాల వద్ద CRPC 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ పేర్కొన్నారు. అభ్యర్థులు ఉదయం 8 గంటల గంటల్లోగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని,10 గంటల కే గేట్లు మూసివేస్తారని తెలిపారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్నారు. అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారన్నారు. హాల్ టికెట్, పెన్ మాత్రమే తీసుకొని రావాలని సూచించారు.

News June 7, 2024

మెదక్: 6 ఏళ్లలో 498 మంది మృతి

image

జిల్లా వ్యాప్తంగా 2019-24 ఏప్రిల్‌ వరకు 877 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 498 మంది మరణించారు. 828 మంది గాయపడ్డారు. ఇటీవల మక్తల్‌ శివారులో కర్ణాటక బస్సు, బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు జాగ్రత్తలపై ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

News June 7, 2024

మెదక్: పెళ్లికి అడ్డుచెప్పారని సూసైడ్

image

ప్రేమజంట <<13393123>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. వివరాలిలా.. మృతుడి సోదరులు ఒకే ఇంటి నుంచి అక్కాచెల్లెళ్లను వివాహం చేసుకున్నారు. వదిన చెల్లెలిని ప్రేమించిన సదానందం.. ఆ యువతినే పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని ఇరు కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఒకే కుటుంబం నుంచి ఒకే ఇంటికి ముగ్గురు కోడళ్లుగా వెళ్లడం మంచిది కాదని భావించి పెళ్లికి నిరాకరించారు. దీంతో వారిద్దరు నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.

News June 7, 2024

మెదక్: పగడ్బందీగా గ్రూప్-1 ఫిలిమ్స్ పరీక్ష

image

ఈనెల 9న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ డా.బాలస్వామి తెలిపారు. బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతిష్ట బందోబస్తు ఉంటుందన్నారు. వీలైనంత త్వరగా అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

News June 6, 2024

న్యాల్కల్: మంజీరా నదిలో ప్రేమ జంట ఆత్మహత్య

image

పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం న్యాల్కల్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. కాకి జనవాడకు చెందిన బావ, మరదలు సదానందం(24), ఉమ(20) ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఫుల్ కుర్తి వద్ద మంజీర నదిలో ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, ఘటనా స్థలంలో మృతుల బైకు, సెల్ ఫోన్లను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేశారు.