India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వికారాబాద్ జిల్లా <<14585618>>లగచర్ల<<>>లో 300 మంది పోలీసులు మోహరించి స్థానికులను అరెస్టు చేయడం దారుణమని సిద్దిపేట MLA హరీశ్ రావు మండిపడ్డారు. ‘ఫార్మా భూసేకరణకు నిరాకరించిన గ్రామస్థులపై అర్ధరాత్రి పోలీసులతో దమనకాండ సరికాదు. ప్రజాభిప్రాయం తీసుకోకుండా భూసేకరణ చేపట్టడం వెనుక ఉన్న రేవంత్ రెడ్డి ఉద్దేశం తెలియాలి. వెంటనే ఈ భూసేకరణ ఆపాలి. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి’ అని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. చిన్న శంకరంపేట మండలంలో గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. స్థానికుల వివరాలు.. కామారం తండాలో కోళ్ల ఫాం నిర్మిస్తుండగా అకస్మాత్తుగా గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతులు ఝార్ఖండ్‌కు చెందిన రఖీవాల, అసిక్కుల్ షేక్‌గా గుర్తించారు. మృతదేహాలను రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
బోధన, భోజనం కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై హరీశ్ రావు ఫైర్ అయ్యారు. బోధన లేదు, భోజనం లేదంటూ బీబీపేట కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులలో కలిసి చేసిన ఆందోళనపై ఎక్స్ వేదికగా స్పందించారు. నాణ్యమైన భోజనం, మౌలిక వసతుల కల్పన కోసం విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుండటం శోచనీయం అన్నారు.
స్వాతంత్ర సమరయోధులు, తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని మెదక్ సమీకృత కలెక్టరేట్లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ఎల్లయ్య, శ్రీనివాసరావు, మాధవి, నాగరాజు గౌడ్ తదితరులున్నారు.
బోరబండ ప్రాజెక్టులో చేపల పంచాయితీ ఒకరి ప్రాణం తీసింది. జగదేవపూర్ మండలం ధర్మారం, మర్కుక్ మండలం వరదరాజపూర్ గ్రామాలు చేపలు పట్టడంపై గొడవ జరుగుతోంది. శనివారం వరదరాజపూర్ గ్రామస్థులు చేపలు పట్టేందుకు రాగా ధర్మారం గ్రామస్థుల రాకతో పారిపోయారు. ఈ క్రమంలో వరదరాజపూర్ ముచ్చపతి సత్తయ్య(55) ప్రాజెక్టులో పడిపోయాడు. గ్రామస్థులు గుర్తించకపోగా అదివారం గాలించేందుకు రాగా ఉద్రిక్తత నెలకొంది. శవాన్ని బయటకు తీశారు.
డిజిటల్ వినియోగం పెరిగిపోయిన నేపథ్యంలో దహన సంస్కారాల సమయంలో అడుక్కోవడానికి స్కానర్ ఉపయోగించడం ఆశ్చర్యానికి గురిచేసింది. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్ పల్లి గ్రామానికి చెందిన బాలమణి నిన్న మృతిచెందగా ఈరోజు దహన సంస్కారం నిర్వహించారు. దహన సంస్కారాల వద్ద అడుక్కోవడానికి వచ్చిన కాటిపాపల మహేశ్ ఏకంగా షర్టుకు ఫోన్ పే స్కానర్ తగిలించి అడుక్కోవడం వింతగా చూశారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో ఈనెల 12న కొల్లూరులోని గార్డియన్ స్కూల్లో ఉమ్మడి జిల్లా జిమ్నాస్టిక్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అమూల్యమ్మ ఆదివారం తెలిపారు. అండర్ 14, 17 బాలుర, బాలికలు ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఒరిజినల్ బోనాఫైడ్ సర్టిఫికేట్‌తో ఉదయం 9 గంటల వరకు హాజరు కావాలని కోరారు.
సిద్దిపేట చింతలచెరువులో తండ్రి తన ఇద్దరు పిల్లలతో దూకి <<14574531>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. తేలు సత్యం రెండో భార్య శిరీషతో గొడవ కారణంగా కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడు. దీంతో మనస్తాపం చెందిన సత్యం తన ఇద్దరి పిల్లలు కొడుకు అన్వేశ్(7) కూతురు త్రివేణి(5) కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
చేగుంట మండలం రుక్మాపూర్‌కు చెందిన బసిక ప్రశాంత్ రెడ్డి, అనితారెడ్డి దంపతుల కూతుర్లు అనీశ, ప్రనీశ భరతనాట్యంలో ప్రతిభ కనపరుస్తున్నారు. దీపావళి పురస్కరించుకొని శనివారం సింగపూర్ కమ్యూనిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన దీపావళి ఉత్సవాల్లో చిన్నకూతురు భరతనాట్యం చేసి అందరిని అబ్బరుపరిచారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ భారతీయుల సంస్కృతిక ప్రదర్శనలను అభినందించారు.
మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణలో భాగంగా అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వే కొరకు జారీ చేసిన పుస్తకంలో మొత్తం 56 అంశాలున్నాయని ఎలాంటి అనుమానాలు, సందేహాలకు తావు లేకుండా ప్రజల నుంచి ఖచ్చితమైన సమాచారం సేకరణతో నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.