Medak

News June 5, 2024

మెదక్: బీఆర్ఎస్ ఖాతా నుంచి బీజేపీ ఖాతాలోకి..

image

మెదక్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ ఖాతా నుంచి BRS ఖాతాలోకి చేరిపోయింది. 2004 నుంచి 2019 వరకు రెండు దశాబ్దాలు మెదక్ బీఆర్ఎస్ MP అభ్యర్థులు దక్కించుకున్నారు. రాష్ట్రంలో మారిన అనూహ్య పరిణామాలతో బీఆర్ఎస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి తగ్గిపోయింది. కంచుకోటగా భావించిన సిద్దిపేటలోనూ బీఆర్ఎస్‌కు భారీ దెబ్బ తగిలింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ ఖాతా నుంచి బీజేపీలోకి వెళ్లింది.

News June 5, 2024

జహీరాబాద్‌లో డిపాజిట్ కోల్పోయిన BRS

image

MP ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌ను జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలు ఆదరించలేదు. ఎన్నికల ముందు ఇక్కడ BRSVsBJP అని‌ ఆ పార్టీ శ్రేణులు‌ భావించాయి. కానీ నిన్నటి ఫలితాల్లో ఆయన డిపాజిట్ కోల్పోయారు. మెజార్టీ రౌండ్లలో BRS చివరి స్థానంలో నిలిచింది. ఫలితంగా 1,72,078(13.92%) ఓట్లకే పరిమితం కావడం గమనార్హం. కాంగ్రెస్ నుంచి BRSలో చేరిన గాలి MPగా పోటీ చేసిన ఘోర పరాజయాన్ని మూటగట్టుకొన్నారు.

News June 5, 2024

నిజాంపేట: 8న చేప ప్రసాదం పంపిణీ

image

నిజాంపేట మండల కేంద్రంలో ఈ నెల 8న మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు పంపిణీదారులు తడకంటి పర్వగౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, శంకర్ గౌడ్, లింగాగౌడ్ తెలిపారు. ఉబ్బసం, దగ్గు, దమ్ము వ్యాధితో బాధపడుతున్న వారికి చేప ప్రసాదం అందజేయడం జరుగుతుందని వివరించారు. పూర్వీకుల నుంచి చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నందున పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సైతం పెద్ద సంఖ్యలో వస్తారన్నారు.

News June 5, 2024

జహీరాబాద్‌: కాంగ్రెస్‌ 2వ సారి విజయకేతనం 

image

ఎంపీ ఎన్నికల్లో జహీరాబాద్‌ను కాంగ్రెస్‌, మెదక్‌ను బీజేపీ కైవసం చేసుకున్నాయి. జహీరాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌ 47,896 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2009లో గెలిచిన షెట్కార్‌ తాజాగా మరోసారి విజయకేతనం ఎగురవేశారు.BRS ఎంపీగా ఉన్న బీబీపాటిల్‌ BJPలో చేరి పోటీ చేయగా, కాంగ్రెస్‌ నుంచి BRSలో చేరిన గాలి అనిల్‌కుమార్‌ బరిలో నిలిచి ఓటమిచెందారు. దీంతో BRS సిట్టింగ్‌ స్థానాన్ని కొల్పోయింది. 

News June 5, 2024

నైతిక విజయం కాంగ్రెస్ దే: నీలం మధు

image

మెదక్ పార్లమెంటు ఎన్నికలలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందినా నైతిక విజయం కాంగ్రెస్ దేనని ఆ పార్టీ అభ్యర్థి నీలం మధు అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందంలో భాగంగా ఒక్కటై బీసీ బిడ్డను ఓడించడానికి కుట్ర చేశాయని ఆరోపించారు. రెండు పార్టీలు అంతర్గతంగా ఒప్పందంతో బీజేపీ అభ్యర్థిని గెలిపించారన్నారు. కాంగ్రెస్ బీసీ బిడ్డకు అవకాశం కల్పిస్తే ఓర్వలేక కుట్రలు పన్నాయని అన్నారు.

News June 4, 2024

మెదక్: పిడుగుపాటుతో యువకుడి మృతి

image

పెద్దశంకరంపేట మండలం బూరుగుపల్లి గ్రామ పరిధిలోని చందా నాయక్ తండాలో తీవ్ర విషాదం నెలకొంది. పిడుగుపాటుకు గురై ఓ యువకుడితోపాటు జీవాలు చనిపోయాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. తండాకు చెందిన జైపాల్(25) గ్రామ శివారులో ఇవాళ మేకలు కాస్తుండగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగుపాటుతో జైపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే మూడు మేకలు మృత్యువాత పడ్డాయి.

News June 4, 2024

మెదక్‌లో BJP, జహీరాబాద్‌లో INC

image

ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం మెదక్‌లో బీజేపీ, జహీరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. మెదక్‌లో బీజేపీ 16,576 ఓట్ల ఆధిక్యంలో, జహీరాబాద్‌లో 21వ రౌండ్‌లో కాంగ్రెస్ 18,239 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నాయి.

News June 4, 2024

గజ్వేల్ సెగ్మెంట్‌లో బీజేపీ ఆధిక్యం

image

గజ్వేల్ అసెంబ్లీ సిగ్మెంట్‌లో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. మొదటి రౌండ్‌లో బీజేపీకి 3728 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 2749 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్‌కు 2543 ఓట్లు పోలైనట్లు అధికారులు ప్రకటించారు. సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి పై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 979 ఓట్ల ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ మూడవ స్థానానికి పడిపోయింది.

News June 4, 2024

MDK: నేటితో ఉత్కంఠకు తెర

image

పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ నేడు వీడనుంది. ఎన్నికల ఫలితాలపై అన్ని పార్టీల నేతలు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లోని రెండు కళాశాలల్లో ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగనున్నది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 103 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 147 రౌండ్లలో ఫలితం తేలనుంది. కాగా మెదక్‌ పార్లమెంట్‌ బరిలో 44 మంది అభ్యర్థులు నిలిచిన విషయం తెలిసిందే.

News June 4, 2024

హుస్నాబాద్: అమరుల కుటుంబాలకు పెన్షన్: మంత్రి పొన్నం

image

తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తి మేరకే తెలంగాణ ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఆయన మాట్లాడారు. తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నానని అన్నారు. 12వ ఆవిర్భావ దినోత్సవంలోపు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అమరవీరుల కుటుంబాలకు రూ.25 వేల పెన్షన్, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం అందజేస్తామని అన్నారు.