India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అల్లాదుర్గం మండల కేంద్రంలో ఇంజిన్ ఆఫ్ చేయకుండా ఉన్న ట్రాక్టర్ పైకి కోతి ఎక్కి స్టీరింగ్ పట్టుకోవడంతో ప్రజలు హడలెత్తారు. కోతి విచిత్ర గంతులు వేయడం, విన్యాసాలు చేయడం చూశాము కానీ.. డ్రైవర్ సీట్లో కూర్చొని డ్రైవర్ అవతారం ఎత్తింది. అల్లాదుర్గంలో రైతు ట్రాక్టర్ ఆఫ్ చేయకుండా దిగి పని నిమిత్తం పక్కకు వెళ్ళాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన కోతి ట్రాక్టర్ ఎక్కి స్టీరింగ్ పట్టుకొని అటూ ఇటూ తిప్పింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో సోమవారం మీ సేవ కేంద్రాలు స్వచ్ఛందంగా బంద్ చేపట్టినట్లు మీ సేవ నిర్వాహకులు తెలిపారు. మీ సేవలు ప్రారంభించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం ఆర్టీసీ కళా భవన్‌లో 14వ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. జిల్లాలోని మీ సేవ నిర్వాహకులందరూ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ఈ రోజు బంద్ ప్రకటించారు. మంగళవారం యథావిధిగా కార్యాలయాలు కొనసాగుతాయన్నారు.
పటాన్‌చెరు బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ పరిధి లైఫ్ స్టైల్ డ్రీమ్ హోమ్స్ కాలనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ నందారపు శరత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. సరదాగా సినిమాకు వెళ్లి వచ్చేలోగా ఇంట్లోని 25 తులాల బంగారం ఆభరణాలు, పది తులాల వెండి ఆభరణాలు, రూ. 5వేల నగదు, మూడు ఖరీదైన వాచ్‌లు చోరీ జరిగాయి. భానూర్ పోలీసులు కేసు విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని అడిషనల్ ఎస్పీ సంజీవరావు పరిశీలించారు.
ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల అమలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలతో పాటు దేశాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉద్యోగ నియామకాల అంశంలో సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత సాధించిన ప్రగతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ట్యాగ్ చేస్తూ సీఎం రేవంత్ శనివారం ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా సదాశివపేటకి చెందిన నవాబు రాజిరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాచిరెడ్డి మాట్లాడుతూ.. తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి సంగారెడ్డి డిపో నుంచి నాలుగు సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసినట్లు సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ ఆదివారం తెలిపారు. ఈ బస్సులు ఉదయం 4.10, 5.50 నిమిషాలకు, మధ్యాహ్నం 1, 2 గంటలకు బయలు దేరుతాయని పేర్కొన్నారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం వెళ్ళే భక్తులు ఈ బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఆదివారం సిద్దిపేట విపంచి కళానిలయంలో ఉపాధ్యాయుడు, టీపీటీఎఫ్ నాయకులు పొన్నమల్ల రాములు పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అన్ని ఉద్యోగాలకు విరమణ ఉంటుంది కానీ ఉపాధ్యాయ వృత్తికి విరమణ ఉండదన్నారు. రాములు ఉద్యోగానికి మాత్రమే పదవీ విరమణ పొందారు. సామాజిక బాధ్యతకు కాదన్నారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ఉమ్మడి జిల్లా హాకీ పోటీల ఎంపికలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ అమూల్య తెలిపారు. సంగారెడ్డిలోని అంబేడ్కర్ స్టేడియంలో అండర్ 17 బాలుర హాకీ ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఉ.9 గంటలకు హాజరు కావాలని సూచించారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంజనేయులు (45), లావణ్య (30), సహస్ర (9), శాన్వి (7)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. లావణ్య తన ఇద్దరు కూతుర్లయిన సహస్ర, శాన్వితో బంధువుల ఇంటికి వెళ్తుంది. లావణ్య భర్త కుమార్ సోదరుడు ఆంజనేయులు బస్ స్టాప్ వద్ద దించేందుకు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం విధితమే. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీ కొట్టడంతో బైక్‌పై వెళ్తున్న ఆంజనేయులు, ఆయన మరదలు లత, ఆమె ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
Sorry, no posts matched your criteria.