India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సిద్దిపేట జిల్లాలో ఫోక్ <<14917574>>సింగర్ శ్రుతి<<>>(26) నిన్న అనుమానాస్పద రీతిలో సూసైడ్ చేసుకుంది. NZB జిల్లాకు చెందిన శ్రుతి, పీర్లపల్లికి చెందిన దయాకర్ 22 రోజుల క్రితం ప్రేమపెళ్లి చేసుకున్నారు. నిన్న అత్తగారి ఇంట్లో సూసైడ్ చేసుకోగా ఆమె 4నెలల గర్భిణి. అయితే కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకుందని దయాకర్ కుటుంబీకులు చెప్పగా తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని శ్రుతి తల్లిదండ్రులు ఆరోపించారు.

ఉమ్మడి మెదక్ విద్యార్థులకు అలర్ట్. OU పరిధిలోని అన్ని పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ పరీక్షల టెంటేటీవ్(తాత్కాలిక) తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. M.SC, MA, M.COM, MSW, BLIBSC, BCJ, M.LIBISC, MJ&MC, M.COM(IS) అన్ని సెమిస్టర్ల వన్ టైం చాన్స్ బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల 17 నుంచి నిర్వహించనున్నామని చెప్పారు. కాగా, పరీక్ష తేదీలకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన సదాశివపేట మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని నిజాంపూర్ గ్రామంలో విద్యుత్ స్తంభంపై బల్బు అమర్చడానికి స్తంభం ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు షాక్ తగలడంతో విద్యుత్ స్తంభంపైన మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పాస్ అవుతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. దేశంలో జమిలి ఎన్నికలు జరగడం ఖాయమన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు లోక్‌సభ ముందుకు రానుందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను అమలు చేయడమే మోడీ సర్కార్ లక్ష్యమన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై ప్రతిపక్షాలు ఎలా సంధిస్తాయో వేచి చూడాలని ఎంపీ రఘునందన్ అన్నారు.

మెతుకుసీమ చలితో వణుకుతుంది. రోజురోజుకూ ఉమ్మడి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చలి తీవ్రతతో ఆయా మండలాలు, పట్టణ వాసులు ఉదయం వేళల్లో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చలి తీవ్రత తోపాటు పొగమంచు దట్టంగా ఉంటే తెల్లవారు జాము ప్రయాణాలు పెట్టుకోవద్దని, అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే వాహనాలు జాగ్రత్తగా నడుపుకోవాలని సూచిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. సంగారెడ్డి జిల్లాలో 15,218 మందికి 41 పరీక్షా కేంద్రాలు, సిద్దిపేట జిల్లాలో 13,717 మందికి 37, మెదక్ జిల్లాలో 5,855 మందికి 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పలువురు ఆలస్యంగా రావడంతో లోపలికి అనుమతించలేదు. పోలీసుసు పటిష్ఠ బందోబస్తు నిర్వహించగా.. కలెక్టర్, ఎస్పీలు, ఉన్నతాధికాలులు పరీక్ష కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

TGPSC నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల్లో ఉమ్మడి మెదక్ జిల్లాపై ప్రశ్నలు వచ్చాయి. 2004లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆలె నరేంద్ర ఏ లోక్ సభ నియోజకవర్గం స్థానం నుంచి పోటీ చేశారు. వీరులారా వందనం పాట రచయిత ఎవరు, సిద్దిపేట ఉద్యోగుల గర్జన, పశ్చిమ చాళుక్యుల శాసనాల్లో ఉదహరించబడిన “పొట్టలిక నగరం” ఏది. తెలంగాణలోని ఏ రెండు జిల్లాలను ‘అత్యంత ఆకలి’తో అలమటించే జిల్లాలుగా వర్గీకరించారు.? అనే ప్రశ్నలు వచ్చాయి.

విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని హుస్నాబాద్ ఎమ్మెల్యే బీసీ రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పురుగు అన్నం పెడితే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో బలవర్ధకమైన ఆహారం అందిస్తున్నామన్నారు. గురుకులాల్లో నూతన మెనూ అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు నెలలో 2 సార్లు మటన్, 4 సార్లు చికెన్ అందిస్తామని మంత్రి వెల్లడించారు.

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న గ్రూప్-2 పరీక్షా కేంద్రాలను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టీజీపీఎస్సీ నిబంధనలు మేరకు పరీక్షా కేంద్రాలలోకి సెల్ ఫోన్ అనుమతి లేని కారణంగా నిబంధనలు పాటిస్తూ, కలెక్టర్ పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు తీసుకురావద్దన్న నియమాన్ని ఆయన పాటించారు.

మెదక్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. రోజురోజుకు ఉష్ణోగ్రత పడిపోతున్నాయి. ఆదివారం శివంపేటలో 8 డిగ్రీలకు పడిపోయింది. జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత 13.7 డిగ్రీలుగా నమోదు అయింది. జిల్లాలో అనేక చోట్ల సాయంత్రం ఐదు గంటల నుంచి, ఉదయం 9 గంటల వరకు సైతం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. చలి ఎక్కువ కావడంతో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, చిన్నపిల్లలు, అస్తమా ఉన్నవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
Sorry, no posts matched your criteria.