Medak

News October 31, 2024

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

image

తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి పండుగ మనకు అందిస్తుందని కేసీఆర్ తెలిపారు. దీపావళి పర్వదినానికి హిందూ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని దీపావళి సందర్భంగా కేసీఆర్ ప్రార్థించారు.

News October 30, 2024

సంగారెడ్డి: టెన్త్ ప్రత్యేక తరగతుల సమయంలో మార్పులు

image

పదో తరగతి ప్రత్యేక తరగతుల సమయంలో మార్పులు చేస్తూ సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ.. సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు అన్ని ప్రభుత్వ, కేజీబీవీ పాఠశాలలు పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు.

News October 30, 2024

మెదక్: మోత మోగుతున్న ‘టపాసుల’ ధరలు !

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో టపాసుల ధరలు మోత మోగుతున్నాయి. షాపుల అనుమతి, ఇతరత్రాకు సంబంధించి మామూళ్లు చెల్లించిన వ్యాపారులు ఆ భారమంతా వినియోగదారులపై మోపుతున్నారు. భారీగా పెరిగిన టపాసుల ధరలతో ఈ ఏడాది సాధారణ, మధ్యతరగతి వారు టపాసులు కొనాలంటేనే జంకుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కాకర పుల్ల నుంచి 1000 వాలా వరకు టపాసుల ధరలు 30% పెరిగాయి. వ్యాపారులు వారి నోటికి ఎంత వస్తే అంతే చెప్పి ధరలు పిండుకుంటున్నారు.

News October 30, 2024

టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి: మంత్రి పొన్నం

image

దీపావళి ఒక పెద్ద వేడుక అని, ఈ పండగ సందర్భంగా జరిగే అగ్ని ప్రమాదాలు నివారించడానికి టపాసులు కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎక్కడైన నివాస సముదాయాల్లో టపాసులు అమ్ముతుంటే సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రమాదాలు నివారించడానికి అందరు సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.

News October 30, 2024

మెదక్: దీపావళి సెలవులకు ఇంటికొస్తూ దుర్మరణం

image

నిజాంపేట మండలంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో <<14484249>>బాలుడు మృతి<<>> చెందగా తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. జెడ్ చెరువు తండాకు చెందిన శత్రు, శిరీష దంపతుల కొడుకు అర్జున్(13) కామారెడ్డి జిల్లా గాందారిలోని ST హాస్టల్‌లో 6వ తరగతి చదువుతున్నాడు. దీపావళి సెలవులు ఇవ్వడంతో హాస్టల్ నుంచి బైక్‌పై తండ్రితో కలిసి ఇంటికొస్తుండగా నందిగామ శివారులో కారు ఢీకొట్టింది. దీంతో గ్రామంలో పండగపూట తీవ్ర విషాదం నెలకొంది.

News October 30, 2024

దుబ్బాక: పేరుకే పెద్ద గుడి.. అభివృద్ధి శూన్యం !

image

దుబ్బాక మండలం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో రేకులకుంట గ్రామంలో అతి పురాతనమైన దేవతనం శ్రీమల్లికార్జున స్వామి దేవస్థానం ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొమురవెల్లి, తర్వాత ప్రసిద్ధి గాంచింది. రేకులకుంట దేవస్థానం అయినప్పటికీ ఇక్కడ అభివృద్ధి మాత్రం శూన్యం. ఈ గుడిలో దాదాపు 70 మంది ఒగ్గుపూజారులు నిరంతరం పూజలు చేస్తుంటారు. భక్తులు ఇచ్చే కానుకలతో గుడిని అభివృద్ధి చేయొచ్చని పలువురు సూచిస్తున్నారు.

News October 29, 2024

సిద్దిపేట: మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

image

సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హుస్నాబాద్‌‌లో ఇంటిముందు ఆడుకుంటున్న మైనర్‌ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 2 రోజుల కిందట జరిగిన ఈ ఘటన గురించి బాలిక సోమవారం రాత్రి తన తల్లికి వివరించింది. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీను తెలిపారు. అత్యాచారం చేసిన ముగ్గురు యువకులు బాలిక ఉంటున్న కాలనీకి చెందినవారుగా గుర్తించినట్లు చెప్పారు.

News October 29, 2024

సంగారెడ్డి: కార్గో సేవలను సద్వినియోగం చేసుకోండి

image

ఆర్టీసీ కార్గో సేవలను ఇంటింటికీ అందిస్తున్నట్లు మెదక్ రీజినల్ కార్గో మేనేజర్ ఇసాక్ మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు ఆర్టీసీ డిపోలోని కార్గో సెంటర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

News October 29, 2024

సిద్దిపేట: మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం

image

జగదేవ్పూర్ మండలంలో మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేసినట్లు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. జనగామ జిల్లాకు చెందిన 30ఏళ్ల మహిళ బతుకుదెరువు కోసం హైదరాబాదులో నివాసం ఉంటుంది. స్వగ్రామానికి వెళ్లేందుకు మండలంలోని వట్టిపల్లి వద్ద బస్సు దిగి కాలినడకన స్వగ్రామానికి వెళుతుంది. ఈ క్రమంలో సాల్వాపూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ నర్సింహులు తానూ గ్రామానికి వెళుతున్నట్లుగా తీసుకెళ్లి మార్గమధ్యలో అత్యాచారం చేసినట్లు వివరించారు.

News October 29, 2024

మెదక్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) నోటిఫికేషన్ జారీ

image

మెదక్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) ఏర్పాటు కానుంది. ఈమేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు(UDA) ప్రధాన నగరాలు, పట్టణాల చుట్టూ చక్కటి సమగ్రమైన, ప్రణాళికాబద్ధమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్లాన్ చేయడానికి, నిర్ధారించడానికి ఏర్పాటు చేయబడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.