India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దౌల్తాబాద్ మండలం ముత్యంపేటకు చెందిన ముత్యాల ఆంజనేయులు(34) మరో ఇద్దరు కలిసి ఈత వనంలో కళ్లు దొంగతనం చేశారని ఈనెల 25న గ్రామంలో పంచాయితీ పెట్టారు. ఈక్రమంలో దాడి చేయడంతోపాటు రూ.2 వేల జరిమానా విధించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆంజనేయులు చేయని తప్పును తనపై వేశారని సోమవారం ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతికి కారకులైన 8 మందిని శిక్షించాలని కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహా అన్నారు. బోరంచలో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. బీడు భూములు సస్యశ్యామలం చేస్తామని, గ్రావిటీ ద్వారా మనూరు, రేగోడ్ మండలాల్లో 3400 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ప్రధాన రహదారి వెంట 8KMకు ఒక PHC ఏర్పాటు చేస్తామని, మంజీరా బ్యాక్‌వాటర్ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
సామాజిక, ఆర్థిక సర్వే ద్వారా వివిధ వర్గాల ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నమోదులు చేసేందుకు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆర్థిక సర్వే, ప్రజాభిప్రాయ సేకరణ తదితర అంశాలపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. తూఫ్రాన్ ఆర్డిఓ జయచంద్రారెడ్డి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం ఉమ్మడి జిల్లా బాస్కెట్, త్రో, స్కేటింగ్ బాల్ ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ సెక్రటరీ అముల్యమ్మ సోమవారం తెలిపారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు చెందిన అండర్-14,17 విభాగంలో విద్యార్థులు పాల్గొనవచ్చని ఆమె పేర్కొన్నారు. జరిగే ఈ ఎంపికలకు ఆసక్తి గల విద్యార్థులు ఒరిజినల్ బోనాఫైడ్‌తో హాజరు కావాలని కోరారు.
ఉమ్మడి మెదక్ జిల్లాకు <<14477101>>ఆర్డీవోలు<<>>గా పలువురికి పోస్టింగ్ చేస్తూ నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీచేశారు. విద్యాశాఖ రిజిస్ర్టార్ వివిఎల్ చంద్రకళ గజ్వేల్ ఆర్డీవోగా, హైదరాబాద్ ఆర్డీవో మహిపాల్ నర్సాపూర్ ఆర్డీవోగా, మహబూబ్ నగర్ పీఏ టూ స్పెషల్ కలెక్టర్ రామ్ రెడ్డి జహీరాబాద్ ఆర్డీవోగా, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ శకుంతల జహీరాబాద్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో పలువురు ఆర్డీవోలను బదిలీ చేస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్ కందుకూరు ఆర్డీవోగా, జహీరాబాద్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీందర్ రెడ్డి సంగారెడ్డి ఆర్డీవోగా, ఆర్డివో రాజు మహబూబాబాద్ ఆర్డీవోగా, గజ్వేల్ ఆర్డీవో బన్సీలాల్ కొల్లాపూర్ ఆర్డీవోగా బదిలీ అయ్యారు.
డీఎస్సీ-2024 ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థుల 1:3 మెరిట్ జాబితాను మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకిషన్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. అభ్యర్థుల జాబితాను https://medakdeo.com/ పొందుపర్చామని, ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ పత్రాలతో రేపు జిల్లా విద్యాధికారి కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు.
ఫాం హౌస్ మీద రైడ్ చేయమని సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు చెప్పలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అర్ధరాత్రి అందిన డిస్టర్బెన్స్ ఫిర్యాదు మేరకు రైడ్ జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని, నిజంగా నిర్దోషులైతే చట్టం ద్వారా క్లారిఫికేషన్ తెచ్చుకోవాలన్నారు. రాజకీయ మిత్రులకు లొంగకుండా కేసు విచారణ చేయాలని పోలీసులను కోరుతున్నానని చెప్పారు.
వెల్దుర్తి మండలం మన్నెవారి జలాల్పూర్ గ్రామంలో విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎం. జలాల్పూర్ గ్రామానికి చెందిన కాశ రుక్కమ్మ( 53) నిన్న రాత్రి ఇంట్లో వంట చేస్తుండగా ఎలక్ట్రిక్ కుక్కర్ స్విచ్ ఆన్ చేసింది. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై రుక్కమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.
విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. తోటి విద్యార్థుల వివరాల ప్రకారం.. పాఠశాలలో సమ్మెటీవ్ పరీక్షలు జరుగుతున్నాయి. మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందిన ఓ విద్యార్థి తండ్రి పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవాలని మందలించాడు. ఈక్రమంలో విద్యార్థి తరగతి గదిలోనే ఎలుకల మందు తాగాడు. గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలియజేయగా వారు మెదక్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈఘటనపై మెదక్ కలెక్టర్ రాహుల్ స్పందించారు.
Sorry, no posts matched your criteria.