India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డీఎస్సీ-2024కు ఎంపికైన ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థుల 1:3 జాబితా 2 ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కార్యక్రమం ఈనెల 29, 30 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా విద్యాధికారి కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వెరిఫికేషన్ జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థుల జాబితాను www.deosangareddy.comలో ఉంచినట్లు పేర్కొన్నారు.
పటాన్‌చెరు పరిధిలోని ఓ కాలనీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగికి సెప్టెంబర్ 23 ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు సంబంధించి ఓ మెసేజ్ వచ్చింది. దీంతో అతడు ఆన్‌లైన్లో పెట్టుబడి పెడుతూ వచ్చాడు. పలు దఫాలుగా మొత్తం రూ.20.60 లక్షలు పెట్టుబడి పెట్టాడు. పెట్టిన పెట్టుబడి, వచ్చిన లాభం ఇవ్వాలని అడగ్గా సదరు వ్యక్తి నుంచి స్పందన లేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ధాన్యం కల్లం వద్దకు వెళ్లి వచ్చేలోపే ఇంటిని దోచిన ఘటన చిన్నశంకరంపేట మండలంలో జరిగింది. మిర్జాపల్లి గ్రామానికి చెందిన చెరుకు శ్రీనివాస్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు భోజనం చేసి ఇంటికి తాళం వేసి ధాన్యం ఆరబెట్టిన కల్లం వద్దకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. బీరువా పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దీపావళి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసే టపాసుల దుకాణాలకు దుకాణదారులు సంబంధిత డివిజనల్ స్థాయి పోలీసు అధికారి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. అనుమతి లేకుండా దుకాణాలు నెలకొల్పితే వారిపై ఎక్స్ ప్లోజివ్ యాక్ట్ 1884, రూల్స్ 1993 సవరణ 2008 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కమ్యూనిస్టులు లేకుండా దేశం లేదని, కష్టాలు, కన్నీళ్లు ఉన్నంత కాలం ఎర్రజెండా ఎక్కడికీ పోదని CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర అన్నారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన CPM రాష్ట్ర మహాసభల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే అని తమ్మినేని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
హుస్నాబాద్‌లో వచ్చే నెల 2వ వారంలో నిరుద్యోగ యువత కోసం మెగా విదేశీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ఉద్యోగ మేళాలో పాల్గొనే యువత ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. తన ఛాంబర్‌లో మంత్రి టాంకాం ప్రతినిధులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగ మేళా విషయమై మాట్లాడారు.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని బట్టల షాప్‌లు, పండ్ల, పూల షాప్‌లు, పెండ్లి పత్రికలతో పాటు మటన్, చికెన్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. దీనికి తోడు బంగారం ధర తులం రూ.81 వేలు పలుకుతోంది. చికెన్ కిలో రూ.250, మటన్ కిలో రూ.900 ఉండగా మధ్య తరగతి అమ్మాయిల తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేయాలంటే జంకుతున్నారు.
దూర విద్య ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 5వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుంతో 8వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రవేశ పరీక్ష నవంబర్ 9న జరగనుందని తెలిపారు. వెబ్‌సైట్: www.ouadmissions.com
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమస్యను సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ త్వరగా పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుక్రవారం కోరారు. జీవన్ రెడ్డికి తాను అండగా ఉంటానని చెప్పారు. తామిద్దరం నియోజకవర్గాలను అభివృద్ధి చేసినా ఈ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. జీవన్ రెడ్డి ఆవేదనను పార్టీ నాయకులు అర్థం చేసుకుంటారని వివరించారు.
PIBHyderabad ఆధ్వర్యంలో నేడు మెదక్ పట్టణంలో వార్తలాప్- మీడియా వర్క్‌షాప్ జరిగింది. అతిథిగా మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు, ముఖ్య అతిథిగా జిల్లా పాలనాధికారి రాహుల్ రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. విలేకరులు ప్రజా సమస్యలను, వాస్తవాలను ఎత్తి చూపాల్సిందిగా ఎంపీ రఘునందన్ రావు జర్నలిస్టులను కోరారు. సంచలనాల కోసం వార్తలు రాయకూడదని జర్నలిస్టులకు తెలిపారు.
Sorry, no posts matched your criteria.