India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం మెదక్‌లో ఇంచార్జి మంత్రి సురేఖతో కలిసి వ్యవసాయం, జిల్లా గ్రామీణ అభివృద్ధి, మార్కెటింగ్ సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. రైతులకు సకాలంలో డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే రోహిత్, కలెక్టర్ రాహుల్ రాజ్ ఉన్నారు.
రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. ఆరోగ్యం మనిషి ప్రాథమిక హక్కు అన్నారు. దౌల్తాబాద్‌లో రూ. 1.56 కోట్లతో నిర్మించిన పీహెచ్సీ ప్రారంభించారు. పిహెచ్సిని ముపై పడకల ఆసుపత్రిగా మార్పు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
మెదక్ పట్టణంలో కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా మంత్రి కొండా సురేఖతో కలిసి గురువారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పలు మెడికల్ కాలేజీలను మంజూరు చేసిందని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందనరావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి ఉన్నారు.
ఆధార్ కార్డు తరహాలోనే ఇక ముందు విద్యార్థులకు అపార్ కార్డు రానుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు వెళ్లిన, ఉపకార వేతనాలు, ఇతర ప్రభుత్వ సదుపాయాలు రావాలన్నా ఈ అపార్ కార్డు ముఖ్యమని, అపార్ కార్డుకు సంబంధించి తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం తీసుకోవాలని, ఇది ఆన్‌లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు.
సైబర్ బాధితుడికి రూ.12.5 లక్షలు రీఫండ్ చేసేలా పోలీసులు చర్యలు తీసుకున్నారని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ తెలిపారు. హత్నూరకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి నవీన్ రెండేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తికి పరిచయమయ్యాడు. అతడిని నమ్మిన నవీన్.. రూ.30 లక్షలు జమచేసి మోసపోయానని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రూ. 12.5 లక్షలను పోలీసులు హోల్డ్ చేసిన ఆ మొత్తాన్ని బాధితుడి ఖాతాలో రీఫండ్ చేసినట్లు చెప్పారు.
తూప్రాన్ పట్టణ శివారులోని టోల్ ప్లాజా వద్ద గల తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలో ఐటీసీ కంపెనీ వారు కట్టిన స్టడీ హాల్ ను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీసీ కంపెనీ వారు రూ.25 లక్షలతో స్వయంగా స్టడీ హాల్ నిర్మించడం సంతోషకరం అన్నారు. పరిశ్రమల సహాయంతో పాఠశాలలో గణనీయ మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఓ పాఠశాల బస్సు ఢీకొని 6 ఏళ్ల చిన్నారి అశ్విని మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం మక్త లక్ష్మాపురం గ్రామంలో జరిగింది. పాఠశాల బస్సు చిన్నారిని దించి వెళ్తుండగా.. అదే బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులు ఆగ్రహంతో పాఠశాల బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. యాజమాన్యం వచ్చేవరకు మృతదేహాన్ని తరలించేది లేదంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు చేపట్టారు.
అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యుడు, TTD మాజీ ఈఓ LV.సుబ్రమణ్యం తెలిపిన విషయం తెలిసిందే. కాగా గతంలో ఈ యాగం NOV 2 నుంచి అని ప్రకటించగా తేదీలను పోస్ట్ పోన్ చేశారు. NOV 18 నుంచి JAN 1 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో నిత్యావసర వస్తువులు, కూరగాయలతోపాటు చికెన్ ధర ఆకాశాన్ని తాకుతోంది. వారం రోజులుగా మెదక్‌లో చికెన్ షాపుల్లో స్కిన్ లెస్ రూ. 230, విత్ స్కిన్ రూ. 205 పలుకుతుంది. ఇక గ్రామాల్లోని చికెన్ సెటర్లల్లో రూ.250 ఉంది. దీంతో మాంసం ప్రియులు వెనక్కి తగ్గుతున్నారు. 1కేజీ తీసుకోవాలనుకున్న వారు అర కేజీతో సరిపెట్టుకుంటున్నారు. కాగా, పెళ్లిళ్ల సీజన్ కావడమే ఇందుకు కారణమని షాపు యజమానులు అంటున్నారు.
మెదక్ జిల్లా హవేలిఘనపూర్ గురుకులానికి చెందిన నలుగురు విద్యార్థినులు విద్యుదాఘాతానికి గురవ్వడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. విద్యార్థినులు కరెంట్ షాక్ తగిలి గాయపడటం దురదృష్టకరమని అన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నదని.. ప్రభుత్వ పట్టింపు లేనితనం పిల్లల ప్రాణాల మీదకు తీసుకొస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.