Medak

News May 14, 2024

సంగారెడ్డి: కాంగ్రెస్‌లోకి BRS, BJP ఎమ్మెల్యేలు: జగ్గారెడ్డి

image

కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు BRS నుంచి 25 మంది ఎమ్మెల్యేలు, BJP నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని, త్వరలో వారు చేరనున్నారని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ MLA జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్‌కు ఆగస్టులో సంక్షోభం తప్పదని BJP ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు జగ్గారెడ్డి ఈరోజు కౌంటర్ ఇచ్చారు. HYD గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. BJPపై మండిపడ్డారు.

News May 14, 2024

మెదక్: EVMలలో అభ్యర్థుల భవిష్యత్తు !

image

నెల రోజులుగా కొనసాగిన పార్లమెంట్ ఎన్నికల ప్రహసనం సోమవారం పోలింగ్ ప్రక్రియతో ముగిసింది. ఇక పోలింగ్ అయిపోయిన వెంటనే అభ్యర్థులు తమ కార్యకర్తలతో సమావేశమై కూడికలు తీసివేతలతో విజయావకాశాలకు బేరీజు వేసుకుంటున్నారు. EVMలలో నిక్షిప్తమై ఉన్న వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఓటింగ్ సరళిని పరిశీలిస్తూ అంచనాలకు వస్తున్నారు. మెదక్‌లో 74.38%, జహీరీబాద్‌లో 74.54% ఓటింగ్‌ జరగ్గా.. అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

News May 14, 2024

జహీరాబాద్: క్రాస్ ఓటింగ్ ఎవరికి కలిసొస్తుందో..?

image

జహీరాబాద్ లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు క్రాస్ వోటింగ్ భయం పట్టుకుంది. ఈ పార్లమెంట్ పరిధిలో బీజేపీకి కామారెడ్డి అసెంబ్లీ సీటు దక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరిగిన పార్లమెంట్ ఎన్నికలు దేశానికి సంబంధించినవి అనుకొని ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీకి ఎక్కువగా క్రాస్ ఓటింగ్ జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి జరిగిన క్రాస్ ఓటింగ్ జహీరాబాద్లో ఎవరికి కలిసొచ్చేనో చూడాలి.

News May 14, 2024

సిద్దిపేట కేంద్రీయ విద్యాలయంలో శత శాతం ఉత్తీర్ణత

image

సిద్దిపేటలోని కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి (సీబీఎస్ఈ) ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. 2018లో ప్రారంభమైన ఈ పాఠశాలలో ఈ ఏడాది పదవ తరగతి మొదటి బ్యాచ్‌కు చెందిన 29 మంది విద్యార్థులు పరీక్ష రాసి శత శాతం(100%) ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, ఫలితాల సాధన కృషి చేసిన ఉపాధ్యాయులను పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి అభినందించారు.

News May 14, 2024

మెదక్: అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్!

image

మెతుకు సీమ తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మెదక్ పార్లమెంట్ బరిలో 44 మంది, జహీరాబాద్ లోక్ సభ నుంచి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ సమయంలో‌ ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో‌ టెన్షన్‌ పెంచింది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.

News May 14, 2024

ఎంపీ ఎన్నికలు.. నర్సాపూర్‌లో రెండు చోట్ల కౌంటింగ్

image

మెదక్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ఓట్ల లెక్కింపు నర్సాపూర్‌లోని రెండు చోట్ల నిర్వహిస్తున్నట్టు ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. బీవిఆర్ ఐటి కళాశాలలో నర్సాపూర్, గజ్వేల్, దుబ్బాక, మెదక్, సిద్దిపేటకు సంబంధించిన ఓట్లు, గిరిజన సంక్షేమ బాలుర గురుకులంలో సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూంల్లో భద్రపరిచినట్లు పేర్కొన్నారు.

News May 14, 2024

సిద్దిపేట కేంద్రీయ విద్యాలయంలో శత శాతం ఉత్తీర్ణత

image

సిద్దిపేటలోని కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి (సీబీఎస్ఈ) ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. 2018లో ప్రారంభమైన ఈ పాఠశాలలో ఈ ఏడాది పదవ తరగతి మొదటి బ్యాచ్‌కు చెందిన 29 మంది విద్యార్థులు పరీక్ష రాసి శతశాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, ఫలితాల సాధన కృషి చేసిన ఉపాధ్యాయులను పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి అభినందించారు.

News May 14, 2024

మెదక్ లోక్‌సభ పరిధిలో 74.38 % పోలింగ్

image

మెదక్ లోక్ సభ పరిధిలో సాయంత్రం 6 గంటల వరకు మొత్తం74.38% పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా వివరాలు ఇలా..
సిద్దిపేట- 73.15 %
దుబ్బాక- 80.22 %
మెదక్- 79.61 %
నర్సాపూర్- 83.73 %
పటాన్ చెరువు -62.32 %
గజ్వేల్-79.70 %
సంగారెడ్డి -71.83%
అర్ధరాత్రి రెండు గంటలకు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రకటించారు.

News May 14, 2024

మెదక్: ఓటు వేస్తూ సెల్ఫీలు.. ఇద్దరిపై కేసు నమోదు

image

ఓటు వేస్తూ సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పెట్టిన ఇద్దరిపై కేసు నమోదైంది. SI పుష్పరాజ్‌ వివరాలు.. నర్సాపూర్‌ మం. బ్రాహ్మణపల్లికి చెందిన గణేష్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేస్తూ ఫోన్‌లో సెల్ఫీ తీసి సోషల్ మీడియా గ్రూపులో పెట్టిన వీడియో వైరల్‌ కాగా కేసు నమోదు చేశారు. అలాగే చిలప్‌చెడ్‌ మం. రహీంగూడా తండాలో ఓ యువకుడు ఓటూ వేస్తూ సెల్ఫీ దిగాడు. ఈ రెండు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

News May 14, 2024

నారాయణఖేడ్: ఓటు హక్కు వినియోగించుకున్న శతాధిక వృద్ధుడు

image

నారాయణఖేడ్ పట్టణంలో శతాధిక వృద్ధుడు వీల్ చైర్ పై వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. నారాయణఖేడ్ పట్టణానికి చెందిన మొహమ్మద్ ఖాదర్ సాబ్ (101) గర్ల్స్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 169 లో వీల్ చైర్ పై వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.