India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సంగారెడ్డి జిల్లాలో 101 పాఠశాలలో బుధవారం NAS పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పరీక్ష నిర్వహించడానికి 101 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లను నియమించామని, ప్రతి పాఠశాలకు ఒక అబ్జర్వర్ ఉంటారని పేర్కొన్నారు. పాఠశాల హెచ్ఎంలు పరీక్ష ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని కోరారు.

సంగారెడ్డిలో బుధవారం ఏక సభ్య కమిషన్ చైర్మన్ శమీమ్ అత్తర్ సభ్యులు సంగారెడ్డికి వస్తున్నారని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎస్సీ కుల సంఘాల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తారని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన దళిత సంఘాల నాయకులు తమ వినతి పత్రాలను సమర్పించాలని చెప్పారు.

సంగారెడ్డి మండలంలోని 11 గ్రామ పంచాయతీలో ఈ నెల 6 నుంచి నిర్వహించిన కులగణన సర్వేకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం పూర్తయ్యిందని సంగారెడ్డి మండల పరిషత్తు అభివృద్ధి అధికారి యాదగిరి రెడ్డి మంగళవారం తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికలను జిల్లా కార్యాలయానికి పంపించడం జరిగిందని పేర్కొన్నారు.

ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని సిద్దిపేట మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో తెలంగాణ ఆటో, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ యూనియన్ ఐక్య కార్యాచరణ సమితి నాయకులు మంగళవారం మంత్రిని కలిశారు. ఆటో కార్మికుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

మహా సహస్ర అవధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా.గరికపాటి నరసింహ రావు ఈనెల 8న మెదక్ పట్టణానికి రానున్నారు. శ్రీ సాయి బాలాజీ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ప్రవచన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా శ్రీ ఫ్యాక్టరీ హనుమాన్ దేవాలయంలో ఉదయం నుంచి చందన నిర్మాల్య విసర్జన తదుపరి పునః శ్రీ చందనోత్సవం, మహాకుంభాభిషేకం ఉన్నట్లు ఆలయ పూజారి కరణం ప్రభాకర్ శర్మ తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు.

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మక్తక్యాసారంలో సోమవారం భర్తను భార్య హత్య చేసింది. సీఐ వివరాల ప్రకారం.. శంషాబాద్‌కు చెందిన సంపత్(39) మక్తక్యాసారంకి చెందిన మంజుల దంపతులు. సంపత్ ప్రతిరోజు మద్యంతాగి గొడవపడే వాడు. సోమవారం మద్యం తాగి రావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి సంపత్ తలపై కట్టెతో కొట్టి వరండాలోకి పడేయంతో అతడి తలకి గచ్చుబండ తాకింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదైంది.

ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని బీసీ రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనేక సంస్కరణలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆరోగ్యశ్రీని 5 లక్షలకు ఉన్న పరిమితి 10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఎంత ఖర్చైనా వెనకాడమన్నారు.

హైదరాబాదులోని ఎన్టీఆర్ మార్గ్‌లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం విక్రమార్కతో కలిసి మంత్రి దామోదర్ రాజనర్సింహ అంబులెన్స్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. ఆరోగ్య సబ్ సెంటర్లు, PHC, ఏరియా హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు రూ.500 కోట్ల విడుదల చేసిన చరిత్ర కాంగ్రెస్‌దే అని ఆయన అన్నారు. పేదవాని వైద్యం, విద్య మా బాధ్యతగా భావించేది కాంగ్రెస్ అని తెలిపారు.

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని మంత్రి రాజనర్సింహ అన్నారు. పాలనకు ఏడాది పూర్తవుతున్న వేళ ఆరోగ్య ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. వైద్యం వ్యాపార పరం కావొద్దని, ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తున్నామన్నారు. ఎక్కడా మందుల కొరత లేకుండా చేశామని తెలిపారు. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ములుగు మండలంలోని బండ తిమ్మాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన హిందుస్తాన్ కోకకోలా బేవరేజెస్ పరిశ్రమకు చెందిన కోకకోలా ఫ్యాక్టరీని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఛైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.