India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్లమెంట్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన నాయకులు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఈసారి ఓటరు నాడి తెలియకపోవడంతో మెదక్ ఎంపీగా ఎవరు గెలుస్తారో అంచనా వేయలేని పరిస్థితి. ఎవరికి వారుగా గెలుపు పై ధీమాతో ఉన్నప్పటికీ లోలోపల రిజల్ట్‌పై ఆందోళనలో ఉన్నారు. పోటాపోటీగా ప్రచారం చేసినా గెలుపుపై అభ్యర్థులు, నాయకులతోపాటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే తుది ఫలితాల కోసం జూన్ 4వ వరకు వేచి చూడాల్సిందే.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శేరిల్లా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కావుడే శ్రీను, యాదమ్మ దంపతుల 3వ కుమార్తె పావని బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే పావని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్ ఓయూ పరిపాలన భవనంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో నెలకొని ఉన్న సమస్యలను విద్యార్థి నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
HYD ఉస్మానియా యూనివర్సిటీ 25వ వీసీగా ఉన్న ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ పదవీ కాలం మే 21న ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక వీడ్కోలు సమావేశం నిర్వహించి, ప్రొఫెసర్, డాక్టర్ రవీందర్ దంపతులను ఘనంగా సన్మానించిన యూనివర్సిటీ బృందం ఘన వీడ్కోలు పలికింది. కాగా నూతన వీసీగా దాన కిషోర్ IASని ప్రభుత్వం నియమించగా ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
మెదక్ జిల్లా నర్సాపూర్ శివారులోని రామారావు చెరువు సమీపంలో జంట హత్య సంచలనం సృష్టించింది. గుర్తుతెలియని ఆడ, మగ వ్యక్తులను హత్య చేసిన గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి దహనం చేశారు. మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పెట్రోల్ పోసి దహనం చేసినట్టు అనుమానిస్తున్నారు.
HYD ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఇన్ని రోజులు కొనసాగిన ప్రొఫెసర్ రవీందర్ పదవీకాలం మంగళవారంతో ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం దాన కిషోర్‌ను వీసీగా నియమించింది. ఈ మేరకు ఓయూ చేరుకున్న ఆయన వీసీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి SI నాగరాజు తనకు తెలియకుండా రెండో వివాహం చేసుకున్నాడని, అతడి మొదటి భార్య మానస కొమురవెల్లి పీఎస్ ఎదుట తల్లి, బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది. కరీంనగర్ జిల్లా గోపాలపురానికి చెందిన మానసకు ఎస్‌ఐ నాగరాజుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని మంగళవారం PS ఎదుట కూర్చుని నిరసన తెలిపారు.
భార్యను <<13285941>>హత్య <<>>చేసిన ఘటన HYDలోని ఉప్పల్ PS పరిధిలో జరిగింది. CI కథనం ప్రకారం.. జనగామకు చెందిన రమేశ్‌కు సిద్దిపేటకు చెందిన కమలతో వివాహమైంది. వీరు బ్యాంకు కాలనీలో ఉంటున్నారు. రమేశ్‌కు వివాహేతర సంబంధం ఉందనే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి కమలపై రమేశ్ దాడి చేసే క్రమంలో ఆమె కింద పడిపోయింది. దీంతో ఆమె గొంతుపై కాలుతో తొక్కి చంపేశాడు. అనంతరం ఉప్పల్ PSలో లొంగిపోయాడు.
ఎన్నికల హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్.. రైతుల పాలిట శనిలా దాపురించిందని ఎఫ్‌డీసీ మాజీ ఛైర్మన్, BRS సీనియర్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మైలారంలో రైతులు, పార్టీ నాయకులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను భేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న మహిళ ఆరోగ్య కార్యకర్తలకు ఆరోగ్య కార్యక్రమాలపై జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్ సమీక్ష సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో ప్రజలకు సమయానుకూలంగా సేవలు అందించాలని ముఖ్యంగా గర్భిణి నమోదు, గర్భిణీ పరీక్షలు, ప్రమాదకర లక్షణాల గుర్తించి వారికి ప్రత్యేక సేవలు నిర్వహించాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.