Medak

News April 25, 2024

మాసాయిపేట: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

మెదక్ జిల్లా మాసాయిపేటలోని చెట్ల తిమ్మాయపల్లి చౌరస్తా వద్ద రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ రాజ బొల్లారానికి చెందిన బిక్ని(36) మృతి చెందింది. మాసాయిపేట 44వ జాతీయ రహదారిపై చెట్ల తిమ్మాయపల్లి చౌరస్తా వద్ద రోడ్డు దాటుతున్న బిక్నిని హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

News April 25, 2024

పుస్తకావిష్కరణ చేసిన ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి

image

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో రిజర్వ్‌ బ్యాంకు మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు తన ఉద్యోగానుభవాలతో రాసిన పుస్తకాన్ని కౌటిల్య విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించారు. పటాన్‌చెరు మండలం రుద్రారంలో గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం, కౌటిల్య స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీలో డా. దువ్వూరి సుబ్బారావు జస్ట్‌ ఏ మెర్సెనరీ.? నోట్స్‌ ఫ్రమ్‌ మై లైఫ్‌ అండ్‌ కెరీర్‌ పేరుతో ప్రచురించిన ఆంగ్ల పుస్తకావిష్కరణ నిర్వహించారు.

News April 25, 2024

సిద్దిపేట: డిప్లొమాలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

టెక్స్ టైల్స్ డిప్లమా కోర్సుల్లో శిక్షణ పొందడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకుడు సతీష్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రానికి 9 సీట్లు కేటాయించగా అందులో ఒక్క స్థానం ఈ డబ్ల్యూ ఎస్ కేటగిరి వారికి రిజర్వ్ చేశారన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్ లోని జిల్లా చేనేత, జౌళి శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

News April 25, 2024

మెదక్: ‘మచ్చ లేకుండా కలెక్టర్‌గా పనిచేశా.. గెలిస్తే అభివృద్ధి చేస్తా’

image

మచ్చ లేకుండా ఉత్తమ కలెక్టర్‌గా పనిచేశానని BRS MP అభ్యర్థి వెంకటరామిరెడ్డి అన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. 2 సెట్ల నామినేషన్ వేశానని, రేపు మాజీ మంత్రి హరీష్ రావు, BRS అభిమానుల మధ్య రేపు మరో 2 సెట్లు దాఖలు చేస్తానని తెలిపారు. మంచి కలెక్టర్‌గా పని చేసిన నేను మరింత సేవ చేయడానికి ఎంపీగా పోటీ చేస్తున్నానని తనను ప్రజలు ఆశీర్వదించాలన్నారు.

News April 25, 2024

కంగ్టి: ఇంటర్ ఫలితాల్లో మండల టాపర్లు వీరే

image

ఇంటర్ ఫలితాల్లో కంగ్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నలుగురు బాలికలు టాపర్‌గా నిలిచారని ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఇందులో సెకండియర్‌కు చెందిన జ్యోతి (BPC)-919/1000, దీపిక (BPC)-876/1000 మార్కులు సాధించారని తెలిపారు. అదేవిధంగా ఫస్టీయర్‌లో ప్రియదర్శిని (BPC) 366/440, సువర్ణ (BPC) 301/440 మార్కులు సాధించినట్లు తెలిపారు. వీరిని ప్రిన్సిపల్ అభినందించారు.

News April 25, 2024

నేడు 12 మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలు

image

పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పక్రియలో భాగంగా బుధవారం 12 మంది అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్థులు పి.వెంకట్రామ్ రెడ్డి, ఎ.లక్ష్మణ్, ఊరెళ్ళి ఎల్లయ్య, కమ్మరి లక్ష్మీనారాయణ, చిక్కులపల్లి నవీన్, ఉట్ల రమేష్ , నీలం మధు, జి.ప్రదీప్ కుమార్, ఎటి ఆంజనేయులు, ధర్మారం నరహరి, అనిల్ మొగిలి, దాసరి భాను చందర్‌‌లు నామినేషన్ వేశారని రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు.

News April 25, 2024

మెదక్ ఎంపీ అభ్యర్థిగా దుబ్బాక కౌన్సిలర్ నామినేషన్

image

మెదక్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా దుబ్బాక మున్సిపాలిటీ కౌన్సిలర్ కూరపాటి బంగారయ్య నామినేషన్ దాఖలు చేశారు. దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికలల్లో ఏఐఎఫ్‌బీ పార్టీ తరుపున పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలుపొందారు. గెలిచిన కొన్ని రోజులకే బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ మెదక్ ఎంపీగా నామినేషన్ వేయడం పట్ల పార్టీలో చర్చనీయాంశమైంది.

News April 25, 2024

మెదక్: నామినేషన్ దాఖలు చేసిన వెంకటరామిరెడ్డి

image

మెదక్ లోక్ సభ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి నామినేషన్ మెదక్ కలెక్టరేట్‌లో బుధవారం దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, బట్టి జగపతి, నగేష్ పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News April 25, 2024

ఇంటర్ ఫలితాలు.. మెదక్ విద్యార్థికి 470కి 468 మార్కులు

image

మెదక్ జిల్లా కౌడిపల్లి గ్రామానికి చెందిన గౌడిచర్ల ప్రియాన్ష్ కుమార్ రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాడు. తాజాగా విడుదల చేసిన ఇంటర్మీడియట్ ప్రథమ పరీక్ష ఫలితాల్లో ప్రియాన్ష్ ఎంపీసీలో 470కి గానూ 468 మార్కులు సాధించాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువుల నుంచి అభినందనలు తెలిపారు.

News April 25, 2024

సంగారెడ్డి: రేపటి నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

image

సంగారెడ్డి జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియేట్ పరీక్షలు ఈనెల 25 నుంచి మే 2 వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేయగా, జిల్లావ్యాప్తంగా 6685 మంది హాజరుకానున్నారు. టెన్త్ పరీక్ష కేంద్రాల్లో, ఇంటర్మీడియేట్ 15 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. పదవ తరగతి 2388, ఇంటర్ 4297 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.