Medak

News May 16, 2024

సంగారెడ్డి, మెదక్ జిల్లాలో సాగుకు సమాయత్తం

image

వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌ పంటల సాగు ప్రణాళికను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. ఏ పంట ఎంత మేరకు సాగు కానున్నది. ఇందుకు అనుగుణంగా ఏ రకం విత్తనాలు ఎంత మేరకు అవసరం అవుతాయని అంచనాలను రూపొందించారు. గత సీజన్‌ కంటే ఈసారి వరి, పత్తి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశమున్నట్లు అంచనా వేశారు. సంగారెడ్డి జిల్లాలో 7,24,405 ఎకరాల్లో అన్ని రకాల పంటలు, మెదక్‌ జిల్లాలో 3,73,509 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు అంచనా వేశారు.

News May 16, 2024

సంగారెడ్డి: ఓట్ల పండుగ.. ఆదాయం దండిగా

image

లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఓటర్లు తమ స్వస్థలాలకు పయనం కావడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. మెదక్‌ రీజియన్‌ పరిధిలోని ఎనిమిది డిపోల నుంచి ఎన్నికల నిమిత్తం 323 బస్సు సర్వీసులు అదనంగా నడిపారు. మరో 17బస్సులను ఏపీకి తిప్పారు. సుమారు 10, 36, 200 మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేశారు. దీంతో మెదక్‌ రీజియన్‌కు రూ.4.30 కోట్ల ఆదాయం సమకూరింది.

News May 16, 2024

మెదక్ జిల్లాలో కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి

image

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంటి వద్ద బట్టలు ఆరేస్తున్న దండెం తీగకు కరెంట్ సరఫరా కావడంతో షాక్‌కు గురై ఇద్దరు మృతిచెందగా ఒకరికి గాయాలయ్యాయి. మృతులు నీరుడి మణెమ్మ(45)ను కరెంట్ షాక్‌ నుంచి రక్షించడానికి వెళ్లిన మరిది కుమారుడు భాను ప్రసాద్(19) మరణించారు. వారిని కాపాడటానికి వెళ్లిన కూతురు శ్రీలతకు గాయాలకు గాయాలు కాగా తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News May 16, 2024

సిద్దిపేట: బైక్‌ను ఈడ్చుకెళ్లిన కారు.. భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం

image

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా ములుగుకు చెందిన మహిపాల్ రెడ్డి(39) మృతిచెందగా, భార్య నవిత తీవ్రంగా గాయపడింది. బైక్‌పై తుర్కపల్లికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనాన్ని కారు కొంత దూరం ఈడ్చుకెళ్లగా మంటలు చెలరేగి ద్విచక్రవాహనం కాలిపోయింది. దీంతో మహిపాల్ అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News May 16, 2024

సిద్దిపేట: ‘నేల చల్లబడ్డాక సాగు చేయాలి’

image

రెండు మూడు వర్షాలు పడి నేల చల్లబడ్డాక సాగుకు ఉపక్రమించాలని తొలకరి చినుకులకే విత్తనాలు నాటి నష్టపోవద్దని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఉపసంచాలకులు(ఏడీఆర్‌) డా. మల్లారెడ్డి రైతులకు సూచించారు. వానకాలం సాగులో మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సమతుల్య సాగు అవసరమని తెలిపారు. నీటి సాంకేతికతకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు తీసుకోవాలని చెప్పారు.

News May 16, 2024

జహీరాబాద్‌లో పెరిగిన పోలింగ్.. గెలువు ఎవరిదో..?

image

జహీరాబాద్‌ పార్లమెంట్ పరిధిలో 2019 ఎన్నికలతో పోల్చితే ఈ సారి 4.93 శాతం పోలింగ్ పెరిగింది. 2019లో 69.01 శాతం నమోదు కాగా 2024లో 74.63 శాతం నమోదైంది. మొత్తం 16.41 లక్షలకు 12.25లక్షల మంది ఓటేశారు. ఇక్కడ 2019లో బీబీపాటిల్(BRS) 6,229 మెజార్టీతో మదన్ మోహన్ రావు(INC)పై గెలుపొందారు. కాగా ఈ ఎన్నికలో సురేశ్ షెట్కార్(INC), గాలి అనిల్ కుమార్(BRS), బీబీ పాటిల్,(BJP) బరిలో ఉన్నారు. గెలుపెవరిదో కామెంట్ చేయండి.

News May 16, 2024

సిద్దిపేట: 22 మందికి రూ. 25,500 జరిమానా

image

సిద్దిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీబాబు, ఎస్ఐలు సిబ్బందితో కలిసి గత నెల రోజుల క్రితం సిద్దిపేట పట్టణం, పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా 22 మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్‌తో చెక్ చేయగా మద్యం సేవించినట్లు రిపోర్టు వచ్చింది. వారిని బుధవారం సిద్దిపేట న్యాయమూర్తి శ్రావణి ముందు హాజరుపరచగా విచారణ చేసి 22 మందికి రూ.25,500 జరిమానా విధించారు.

News May 15, 2024

మెదక్ పార్లమెంట్‌పై జోరుగా బెట్టింగులు..!

image

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో మెదక్ ఎంపీ ఫలితాలపై జిల్లావ్యాప్తంగా బెట్టింగులు ఓ రేంజ్‌లో జరుగుతున్నట్లు సమాచారం. BRS అభ్యర్థి గెలుస్తాడని ఆ పార్టీ నేతలు అంటుంటే, తమ అభ్యర్థికే భారీ మెజారిటీతో గెలుస్తాడని కాంగ్రెస్, BJP నాయకులు బెట్టింగ్‌కు సై అంటున్నారు. దీనికి తెర పడాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.

News May 15, 2024

ములుగు: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన వ్యక్తి

image

సైబర్ వలలో పడి ఓ వ్యక్తి నగదు పోగొట్టుకున్న ఘటన ములుగు పరిధిలో చోటుచేసుకుంది. సైబర్ నేరగాళ్లు బాధితుడి ఫోన్‌కు ఓ లింక్ పంపి అందులో పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో లాభం పొందవచ్చని నమ్మబలికాడు. అది నమ్మిన బాధితుడు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా రూ. 1,98,000 పంపించాడు. తదుపరి ఆ లింకును ఓపెన్ చేసి చూడగా బ్లాక్ చేసి ఉంది. మొసపోయానని గ్రహించి ఆ వ్యక్తి వెంటనే సైబర్ సెల్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేశాడు.

News May 15, 2024

గోవాలో గుండెపోటుతో మెదక్ జిల్లా వాసి మృతి

image

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన మస్కూరి కృష్ణ(45) గుండెపోటుతో మృతి చెందాడు. ఈనెల 13న స్నేహితులతో కలిసి గోవాకు వెళ్లాడు. గోవాలో ఉండగా ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మస్కూరి కృష్ణ ప్రస్తుతం తూప్రాన్ పట్టణంలో గ్రానైట్ షాపు నిర్వహిస్తున్నారు. కృష్ణ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.