Medak

News April 24, 2024

జహీరాబాద్: బీబీ పాటిల్ ఆస్తులు ఇవే..!

image

జహీరాబాద్ BJP అభ్యర్థి బీబీ పాటిల్‌ తన కుటుంబ ఆస్తులు రూ.151.69 కోట్లగా ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో చూపించారు. వివిధ సంస్థల్లో రూ.1.88 కోట్ల విలువైన షేర్లు, పాటిల్‌ దంపతులిద్దరూ రూ.4.51 కోట్ల అప్పులు, అడ్వాన్సులు ఇచ్చారు. 18 వాహనాలు, 19 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 129.4 తులాల బంగారం, 1.93కిలోల వెండి ఉంది. 61.10 ఎకరాల వ్యవసాయ, 65.8 ఎకరాల వ్యవసాయేతర భూమి, 2 వాణిజ్య భవనాలు, 3.52కోట్ల అప్పులు ఉన్నాయి.

News April 24, 2024

పురపాలికల్లో పట్టు కోసం పార్టీల కసరత్తు..

image

సంగారెడ్డి మున్సిపాలిటీ, సదాశివపేట, జోగిపేట, నారాయణఖేడ్, జిన్నారం, మెదక్, జహీరాబాద్ లోక్ సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ప్రధానంగా పట్టణ ఓటర్లను తమ వైపు తిప్పుకుంటే సులువుగా విజయం సాధించవచ్చని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పురపాలికల అధ్యక్షులు, కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు కూడగడుతున్నారు. పురపాలికల అసంతృప్త కౌన్సిలర్లతో చర్చలు జరుపుతున్నారు.

News April 24, 2024

సంగారెడ్డి: పిడుగుపాటుతో మహిళ మృతి

image

పిడుగుపాటులో మహిళ మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మాసాన్‌పల్లిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కర్వ రేణుక(32) ఊరి శివారులో మేకలు మేపుతుంది. సాయంత్రం ఉరుములు,మెరుపులతో వర్షం పడటంతో రేణుక మరో ఇద్దరు ఓ చెట్టుకుందికి వెళ్లారు. ఈ క్రమంలో పిడుగుపాటు పడి రేణుక అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి గాయాల్యయి. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News April 24, 2024

మెతుకు సీమలో నెగ్గేదెవరో..?

image

ఓవైపు నామినేషన్ల, మరోవైపు ప్రచార పర్వం ఊపందుకోవడంతో మెదక్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రముఖుల రాకతో క్యాడర్‌లో జోష్‌ నింపింది. ప్రత్యేక రాష్ట్రంలో 2014, 19 ఎన్నికల్లో గెలిచిన BRS హ్యాట్రిక్ పై కన్నేసింది. పవర్‌లో ఉన్న కాంగ్రెస్ గెలుపు వ్యూహాలతో ముందుకెళ్తూ సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి పెట్టాగా అటూ మోదీ నాయకత్వంపై నమ్మకంతో ప్రజలు తమకే మద్దతిస్తారని ధీమాలో BJP ఉంది. గెలుపు ఎవరిదో చూడాలి.

News April 24, 2024

సంగారెడ్డి : ‘జర్నలిస్టులు బ్యాలెట్ ఓటుకు దరఖాస్తు చేసుకోవాలి’

image

పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వహించే జర్నలిస్టులు బ్యాలెట్ ఓటుకోసం ఈనెల 23వ తేదీ లోపు DPRO కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి సోమవారం తెలిపారు. అక్రిడేషన్‌కార్డు, ఫారం 12డీ, ఓటర్‌కార్డు జిరాక్స్ ప్రతులను DPRO కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

News April 24, 2024

దౌల్తాబాద్: పోక్సో కేసులో పదేళ్ల జైలు

image

బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సిద్దిపేట 2వ సెషన్స్ జడ్జీ తీర్పును ఇచ్చారని సీపీ అనురాధ తెలిపారు. దౌల్తాబాద్ మండలం సూరంపల్లికి చెందిన టి.శ్రీకాంత్(20) అక్టోబర్ 19, 2021న ఓ పౌల్ట్రీఫాంలో పనిచేస్తున్న బాలిక(15)ను కిడ్నాప్ చేసి మానభంగానికి పాల్పడ్డారు. ఈ విషయమై విచారణ జరిపిన జడ్జీ నిందితుడికి జైలుశిక్ష విధించారు.

News April 24, 2024

మెదక్: బీఆర్ఎస్ డబుల్‌ హ్యాట్రిక్ కొట్టేనా?

image

రెండు దశాబ్దాలుగా మెదక్‌ ఎంపీ‌ స్థానం బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా మారింది. గులాబీ పార్టీ ప్రారంభించిన నాటి నుంచి వరుస విజయాలతో ఇక్కడ బీఆర్‌ఎస్‌ దూసుకుపోతూ ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంగా బీఆర్‌ఎస్‌ ముందుంది. బీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం వచ్చిన 2004 ఎన్నికల నుంచి 2019 వరకు వరుసగా ఐదుసార్లు మెదక్‌ పార్లమెంట్‌ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని BRS ఉవ్విళ్లూరుతోంది.

News April 24, 2024

నర్సాపూర్: ఇంటి ఎదుట పార్క్ చేసిన బైక్ వీల్స్ చోరీ

image

ఓ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ రెండు వీల్స్ తెల్లారేసరికి మాయమైన ఘటన నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. బాధితుడి వివరాలు.. స్థానిక శివాలయం వీధికి చెందిన శ్రీ పాల్ అనే యువకుడు తన బైక్‌ను రాత్రి ఇంటి ముందు పార్కు చేశాడు. ఉదయం లేచి చూడగా అవెంజర్ బైక్ చక్రాలు చోరీకి గురికావడం చూసి అవాక్కయ్యాడు. ఇటీవల పట్టణంలో బైక్‌లు చోరీలకు గురవుతున్నాయి. తాజాగా ఈ ఘటనలో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు.

News April 24, 2024

జగదేవపూర్: చికెన్ సెంటర్‌లో దారుణ హత్య

image

జగదేవపూర్‌లోని రాంరెడ్డి చికెన్ సెంటర్ యజమాని అనుమానాస్పదంగా మృతిచెందాడు. చికెన్ సెంటర్‌లో పనిచేసే కలకతకు చెందిన యువకులు చికెన్ సెంటర్ యజమాని, తూప్రాన్ మండలం వెంకటాపూర్‌కు చెందిన బి.మహిపాల్ రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గజ్వేల్ రూరల్ CI మహేందర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కాగా చికెన్ సెంటర్లోని సీసీ కెమెరాలు ధ్వంసం చేసినట్లు తెలిసింది.

News April 24, 2024

మెదక్: ఇటు నామినేషన్లు… అటు కార్నర్ మీటింగ్స్

image

ఓ వైపు నామినేషన్ల ఘట్టం.. మరోవైపు ప్రచార పర్వం ఊపందుకోవడంతో మెదక్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రముఖుల రాకతో క్యాడర్‌లో జోష్‌ పెరిగింది. ఇప్పటికే BJP, కాంగ్రెస్‌లు కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించగా.. BJP మీటింగ్‌కు గోవా CMతో పాటు కిషన్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ మీటింగ్‌కు CM రేవంత్ రాగా, వచ్చేనెల 7న BRS‌ అధినేత KCR‌ బస్సుయాత్రలో భాగంగా మెదక్‌ రానున్నట్లు శ్రేణులు చెబుతున్నారు.