Medak

News April 22, 2024

మెదక్: విద్యార్థులు… అభద్రతకు గురికావొద్దు !

image

ఇంటర్‌ పరీక్ష ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికావొద్దని DMHO‌ శ్రీరామ్‌ సూచించారు. పరీక్షలో ఫెయిల్‌ అయితే అభద్రతకు గురికావద్దన్నారు. పట్టుదలతో చదివి సప్లిమెంటరీలో పాస్‌ కావాలన్నారు. అంతే తప్ప విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైతే కౌన్సెలింగ్‌ కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 14416కు ఫోన్‌ చేసి వైద్యుల సలహాలు పొందవచ్చన్నారు.

News April 22, 2024

ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ రోడ్ షో : వెంకట్రామిరెడ్డి

image

మెదక్ పార్లమెంట్ పరిధిలో మే 7, 8, 10 తేదీల్లో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఆదివారం తెలిపారు. 7న రాత్రి 7 గంటలకు మెదక్, 8న సాయంత్రం 5 గంటలకు నర్సాపూర్, 7 గంటలకు పటాన్‌చెరు, 10న సాయంత్రం 6 గంటలకు సిద్దిపేటలో కేసీఆర్‌తో రోడ్ షో ఉంటుందని చెప్పారు. పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

News April 22, 2024

కొండపాక: రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్, లారీ ఢీ

image

కొండపాక మండలం రవీంద్రనగర్‌లో రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్, లారీ ఢీ కొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. కరీంనగర్ డిపో 1కు చెందిన రాజధాని బస్సు హైదరాబాద్ JBS నుంచి కరీంనగర్ వెళ్తుంది. కొండపాక గేట్ వద్దకు రాగానే కొండపాక గ్రామం లోపలి నుంచి లారీ ఒక్కసారిగా రోడ్డు మీదకు రావడంతో బస్, లారీ ఢీకొన్నాయి. దీంతో బస్ డ్రైవర్ లక్ష్మయ్య, ప్రయాణికులకు మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 22, 2024

నేడు సంగారెడ్డి రానున్న కేంద్ర మంత్రి

image

జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి బి.బి.పాటిల్ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ హాజరవుతారని పార్టీ నాయకులు తెలిపారు. సంగారెడ్డిలోని గణేష్ గడ్డ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారన్నారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News April 22, 2024

వాహన తనిఖీలకు సహకరించాలి: సిద్దిపేట CP

image

వాహనాల తనిఖీ నిర్వహించేటప్పుడు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. వాహనదారులు కూడా పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు. ఓటర్లను ప్రభావితం చేయకుండా డబ్బులు, ఇతర గిఫ్ట్ ఆర్టికల్స్, లిక్కర్ అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈరోజు వరకు వాహన తనిఖీల్లో రూ. 66,10,840 లక్షలు సీజ్ చేసినట్లు చెప్పారు.

News April 21, 2024

శ్రీరాముడి వారసుడు రాహుల్ గాంధీ: జగ్గారెడ్డి

image

శ్రీరాముడి పాలన కావాలంటే రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ గాంధీభవన్లో మాట్లాడుతూ.. ‘శ్రీ రాముడి వారసుడు రాహుల్ గాంధీ. మోదీ పవర్ కోసం వచ్చిన లీడర్. రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాడే ఫైటర్’ అని అన్నారు. సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేస్తూ ఎదిగిన వ్యక్తి మోదీ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 14 ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

News April 21, 2024

సంగారెడ్డి: ‘రాజకీయ హత్య కాదు.. కంకర విషయంలో గొడవ’

image

సిర్గాపూర్ మండలం సింగర్ బొగ్డ తండాలో వాడిత్య శ్రీను నాయక్ హత్య రాజకీయ కోణంలో జరగలేదని నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి వివరించారు. తండాలో పథకంలో భాగంగా సీసీ రోడ్డు నిర్మించారు. మిగిలిన కంకరను కాంట్రాక్టర్ జాదవ్ రాజు అమ్మి వేశారు. కొనుగోలుదారు తీసుకెళ్తుండగా శ్రీను నాయక్ అడ్డుకున్నారు. దీంతో 20న తండాలో పంచాయతీ జరగగా జాదవ్ రాజు, అతని సోదరులు శ్రీనుపై దాడి చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

News April 21, 2024

రేపు నామినేషన్ వేయనున్న బీబీ పాటిల్

image

జహీరాబాద్ ఎంపీ స్థానానికి బీజేపీ తరఫున రేపు బీబీ పాటిల్ నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి జయప్రదం చేయాలని పాటిల్ కోరారు. ఉదయం 8 గంటలకు రుద్రారం గణేష్ గడ్డ ఆలయంలో పూజలు జరిపి ఉదయం 11 గంటలకు సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ సమర్పించనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత పట్టణంలోని PSR గార్డెన్‌లో కార్యకర్తల సమావేశం ఉంటుందన్నారు.

News April 21, 2024

చేగుంట: ఆన్‌లైన్ గేమ్స్‌తో అప్పులు.. రైలు కిందపడి సూసైడ్

image

చేగుంట మండలం వడియారం, మాసాయిపేట్ రైల్వే స్టేషన్‌లో మధ్య కౌడి నరేష్( 33) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై తావునాయక్ తెలిపారు. పోలీసుల వివరాలు.. వడియారం గ్రామానికి చెందిన నరేష్ ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడి అప్పులు చేశాడు. అప్పుల ఇబ్బందులు పెరగడంతో వేగంగా వెళ్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.

News April 21, 2024

చేగుంటలో వివాహిత ఆత్మహత్య

image

మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన వంగ మాధవి అనే వివాహిత ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఓ ఉపాధ్యాయుడి మిస్సింగ్ కేసులో ఆమె భర్త సత్యనారాయణను పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం మాధవి ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.