Medak

News April 20, 2024

మూడోసారి అదృష్టం పరీక్షించుకోనున్న బీబీ పాటిల్

image

జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడిగా మూడోసారి విజయం సాధించేందుకు బీబీ పాటిల్ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈసారి విజయం సాధించి హ్యాట్రిక్ విజయం ఖాతాలో వేసుకోవడానికి కృషి చేస్తున్నారు. 2014లో 5,08,661 ఓట్లతో మొదటిసారి విజయం సాధించగా.. 2019లో 4,34,244 ఓట్లతో రెండోసారి విజయం సాధించారు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ తరఫున విజయం సాధించగా.. ఈసారి బీజేపీ నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

News April 20, 2024

నేడు మెదక్ జిల్లాకి సీఎం రేవంత్

image

నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్నారు. కాగా ఈరోజు ఉదయం 11 గంటలకు మెదక్ చేరుకోనున్నారు. రాందాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించనున్నారు.

News April 20, 2024

జహీరాబాద్ లోక్‌సభ స్థానంపై సీఎం ప్రత్యేక దృష్టి!

image

జహీరాబాద్ లోక్‌సభ స్థానంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చర్చ నడుస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి, జుక్కల్, ఆందోల్, నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందడంలో దృష్టి పెడితే గెలుపు ఖాతాలో వేసుకోవచ్చని సీఎం కాంగ్రెస్ నాయకుల సమావేశంలో అన్నట్లు తెలిసింది. దీనిలో భాగంగా ఈనెల 24న జహీరాబాద్ కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం.

News April 20, 2024

మెదక్: తప్పుడు పత్రాలతో ఫ్లాట్ రిజిస్ట్రేషన్.. మరో ఇద్దరు అరెస్టు

image

మనోహరాబాద్ మండలం కూచారం శివారులో తప్పుడు ధ్రువపత్రాలతో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసిన కూకట్‌పల్లికి చెందిన వీరపనేని మధుసూదన్ రావు(50), హైదరాబాద్ కు చెందిన వెంకటేశ్వర్లు(48)ను అరెస్టు చేసినట్లు ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 13న సత్యనారాయణమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. ఈనెల 7న ఇదే కేసులో కందవల్లి రాజేష్(34)ను అరెస్టు చేసినట్లు ఎస్సై చెప్పారు.

News April 20, 2024

సిద్దిపేట: ‘అభ్యర్థుల ఎన్నికల వ్యయాలను పగడ్బందీగా లెక్కించాలి’

image

లోకసభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయాలను పగడ్బందీగా లెక్కించాలని మెదక్ పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు సునీల్ కుమార్ రాజ్వన్సీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం లోక్సభ ఎన్నికల వ్యయ పరిశీలకులు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం సందర్శించి ఎక్సైజ్ , ఇన్కమ్ టాక్స్ అధికారులు ఎన్నికల అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లతో సమావేశం నిర్వహించారు.

News April 20, 2024

24న జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్

image

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఈనెల 24న నామినేషన్ వేస్తున్నట్లు శుక్రవారం తెలిపారు. కావున జహీరాబాద్, నారాయణఖేడ్, జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

News April 19, 2024

మెదక్ లోక్ సభ.. 4 సార్లు MPగా బాగారెడ్డి !

image

మెదక్ లోక్ సభ 1952లో ఏర్పడగా.. కాంగ్రెస్ పార్టీ అత్యధిక సార్లు గెలుపొందింది. ఇక్కడ 18సార్లు ఎన్నికలు జరగ్గా.. PDF, TPS, BJP, TDPలకు ఒకే ఒకసారి అవకాశం దక్కింది. కాంగ్రెస్ అభ్యర్థులు 9 సార్లు ఎంపీగా గెలుపొందారు. వీరిలో బాగారెడ్డి అత్యధిక సార్లు ఎన్నికవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి చెందిన బాగారెడ్డి 1989లో గెలుపొంది వరుసగా 4 సార్లు విజయం సాధించారు. 2004 నుంచి BRS వరుసగా గెలిచింది.

News April 19, 2024

రాజకీయ కుట్రదారులకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు: వెంకట్రామారెడ్డి

image

సిద్దిపేట జిల్లాలోని 106 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడం శుభ పరిణామమని మెదక్ BRS ఎంపీ అభ్యర్థి వెంకట్రామారెడ్డి అన్నారు. రాజకీయ కుట్రదారులకు హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చిందని అన్నారు.వాస్తవాలు ఎప్పటికైనా తెలుస్తాయని, స్వార్థ బుద్ధితో 106 కుటుంబాల్లో దుఃఖం నింపినప్పటికీ ధర్మమే గెలిచిందని అభిప్రాయపడ్డారు.

News April 19, 2024

MDK: బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

image

మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని ఒక గ్రామంలో బాల్య వివాహాన్ని పోలీసులు అధికారులు అడ్డుకున్నారు. ఒక గ్రామంలో బాలికకు వివాహం చేస్తున్నారంటూ టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం వచ్చింది. వెంటనే గ్రామానికి చేరుకున్న ఎస్సై మహమ్మద్ గౌస్.. బాలికను పోలీస్ స్టేషన్ తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. బాలికకు వివాహం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 19, 2024

మెదక్‌లో సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి సురేఖ

image

మెదక్ పట్టణంలో ఈనెల 20న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి కొండా సురేఖ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. సీఎస్ఐ గ్రౌండ్ లో హెలిపాడ్ పరిశీలించారు. గ్రౌండ్ నుండి కలెక్టరేట్ అక్కడి నుండి రాందాస్ చౌరస్తా వరకు నిర్వహించే రోడ్ షో, మీటింగ్ గురించి స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు. వెంట మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సుప్రభాతారావు, రమేశ్ రెడ్డి, జీవన్ రావు ఉన్నారు.