Medak

News May 12, 2024

కల్హేర్: దూడను చంపిన చిరుత

image

నాగధర్- సంజీవర్‌రావుపేట్ శివారులో పోలంలో దూడను చిరుత చంపేసింది. రైతు గోపాల్‌రెడ్డి వివరాలిలా.. గోపాల్‌రెడ్డి పొలంలో పశువులను మేపుతున్నారు. భోజనానికి ఇంటికి వెళ్లగా.. చిరుత దాడిచేసి దూడను చంపినట్లు తెలిపారు. ఈ విషయాన్ని అటవీశాఖ, పశువైద్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని నాగదర్ FBO శ్రీకాంత్ సందర్శించి, పంచనామా నిర్వహించారు.

News May 12, 2024

సిద్దిపేట: ‘ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి’

image

లోక్ సభ ఎన్నికల్లో జిల్లాలోని ఓటర్లందరూ తప్పకుండా ఓటు వేసి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 13వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు లోక్ సభ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు.

News May 11, 2024

MDK: ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. చెన్నయిపల్లి గ్రామానికి చెందిన చిన్నోళ్ల శ్రీశైలం(23) ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన శ్రీశైలం గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన  ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 11, 2024

MDK: ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులు తాళలేక యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజాంపేట మండల పరిధిలోని నగరం తాండ గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నగరం తండా గ్రామానికి చెందిన కేతావత్ స్వామి అనే వ్యక్తికి ఒక సంవత్సరం క్రితం వివాహం జరిగింది. అతని తాత ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో ఖర్చులు, అతని పెళ్లి ఖర్చులతో అప్పు కావడంతో మనస్తాపం చెంది ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

News May 11, 2024

MDK: ముగిసిన ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్, జహీరాబాద్ లోక్ సభ ఎన్నికల ప్రచారం కొన్ని గంటల్లో తెరపడనుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం బంద్ చేయాలని ఆయా పార్టీలను ఎలక్షన్ కమిషనర్ ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అటు ప్రధాన పార్టీల అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

News May 11, 2024

MDK: రిజర్వేషన్ల రద్దుకు BJP కుట్ర: CM రేవంత్‌రెడ్డి

image

దేశం సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనే లక్ష్యంతో బీజేపీ ఈ ఎన్నికల్లో ముందుకెళ్తోందని ఆరోపించారు. రిజర్వేషన్ల రద్దు ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. శనివారం HYD పటాన్‌చెరులో కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. 50 వేల మెజారిటీతో నీలం మధును గెలిపించాలని కోరారు.

News May 11, 2024

MDK: కాసేపట్లో లోక్ సభ ఎన్నికల ప్రచారానికి తెర..!

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్, జహీరాబాద్ లోక్ సభ ఎన్నికల ప్రచారం కొన్ని గంటల్లో తెరపడనుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం బంద్ చేయాలని ఆయా పార్టీలను ఎలక్షన్ కమిషనర్ ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అటు ప్రధాన పార్టీల అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

News May 11, 2024

మెదక్: జిల్లాలో 144 సెక్షన్ అమలు

image

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా సా.6 గంటల నుండి 14న 6 గంటల వరకు జిల్లాలో 144 CrPC సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి పేర్కొన్నారు. జిల్లాలో ఎవరు కూడా నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపులు గుంపులుగా తిరగవద్దని, జిల్లాలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధం ఉంటుందని పేర్కొన్నారు.

News May 11, 2024

MDK: RTC బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి

image

నారాయణఖేడ్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న RTC బస్సులో ఓ వ్యక్తి గుండె పోటుతో మృతి చెందాడు. నాగధర్ గ్రామానికి చెందిన వడ్ల అంజయ్య సికింద్రాబాద్ బస్సు ఎక్కగా.. పెద్ద శంకరంపేట మండల పరిధిలోని కోలపల్లి శివారులో గుండెపోటు రాగా బస్సు సీటులోనే మృతి చెందాడు. డ్రైవర్ బస్సును నిలిపివేసి అధికారులకు సమాచారం ఇచ్చారు.

News May 11, 2024

మెదక్: మరికొన్ని గంటల్లో మూగబోనున్న మైకులు

image

సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఇవాళ సా.6 గం.కు మైకులు మూగబోనున్నాయి. మరో 48 గంటల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. గత 57 రోజుల నుండి ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ప్రధాన పార్టీలైన BRS, కాంగ్రెస్, బిజెపి పార్టీల ముఖ్య నేతలు మెదక్ గడ్డపై తమ పార్టీ జెండా ఎగర వెయ్యాలని ప్రచారం నిర్వహించారు. మరోవైపు సాయంత్రం ప్రచారం ముగియనుండడంతో ప్రలోభాల పర్వం మొదలయ్యే అవకాశం ఉంది.