Medak

News November 5, 2024

పటాన్‌చెరు: ఇంటర్ విద్యార్థిని సూసైడ్ UPDATE

image

పటాన్‌చెరులోని ఐడీఏ బొల్లారం PS పరిధిలో <<14531325>>ఇంటర్ విద్యార్థిని<<>> ఉరివేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. వరంగల్ జిల్లా ఐనవోలుకు చెందిన విద్యార్థిని(16) బొల్లారంలోని నారాయణ కాలేజీలో ఫస్టియర్ చేస్తుంది. సోమవారం స్టడీ హవర్‌కు రాలేదని వెళ్లి చూడగా సెకండ్‌ఫ్లోర్‌లోని హాస్టల్‌లో ఉరేసుకొని కనిపించింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయిందని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

News November 5, 2024

దుబ్బాక: చెట్టుకు ఢీకొన్న స్కూల్ పిల్లల ఆటో

image

దుబ్బాక మండలం పెద్ద చీకొడు గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. కమ్మర్‌పల్లి గ్రామానికి చెందిన పిల్లలతో దుబ్బాకకు వెళ్తున్న ఆటో చికోడు వద్ద చెట్టుకు ఢీ కొట్టింది. ప్రమాదంలో పది మంది విద్యార్థులకు గాయాలు కాగా దుబ్బాక ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని సిద్దిపేట ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది.

News November 5, 2024

GREAT.. మన గజ్వేల్ బిడ్డ పైలట్‌గా ఎంపిక

image

సిద్దిపేట జిల్లాకు చెందిన వేముల యశస్విని కమర్షియల్ పైలట్‌గా ఎంపికైంది. గజ్వేల్ మండలం దాచారం గ్రామానికి చెందిన వేముల మురళీ-వసుంధర దంపతుల కుమార్తె యశస్విని ఇటీవల మహారాష్ట్రలోని పూణేలో శిక్షణను పూర్తి చేసుకుంది. అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఇండిగో ఎయిర్ లైన్స్‌లో పైలెట్‌గా ఎంపికైంది. దీంతో కుటుంబీకులు, గ్రామస్థులు ఆమెను అభిందించారు.

News November 5, 2024

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: మంత్రి రాజనర్సింహా

image

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. రైస్ మిల్లర్స్ అండర్ టేకింగ్ త్వరితగతిన అందజేయాలని సూచించారు. కొనుగోలు సమస్యలతో రైతులు రోడ్లమీదకు రావద్దన్నారు. సోమవారం మెదక్‌లో ధాన్యం కొనుగోలు, మిల్లర్స్ అండర్ టేకింగ్, డిఫాల్ట్ మిల్లుల సమస్యలపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

News November 4, 2024

పటాన్‌చెరు: హాస్టల్ గదిలో విద్యార్థిని సూసైడ్

image

పటాన్‌చెరు పరిధిలోని ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని వైష్ణవి హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెప్పారు. దీంతో కళాశాల యాజమాన్యం అప్రమత్తమై విద్యార్థిని మృతదేహాన్ని బాచుపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 4, 2024

మాజీ సర్పంచ్‌ల అరెస్ట్‌లను ఖండించిన హరీశ్ రావు

image

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మాజీ సర్పంచ్‌ల అరెస్టులను, అక్రమ నిర్బంధాలను మాజీ మంత్రి హరీ‌శ్ రావు తీవ్రంగా ఖండించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్‌లను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని హైదరాబాద్‌కు వస్తే వారిని అడ్డుకోవడం, అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామికమని అన్నారు.

News November 4, 2024

డ్రైవర్ సీటులో కూర్చొని హడలెత్తించిన కోతి

image

అల్లాదుర్గం మండల కేంద్రంలో ఇంజిన్ ఆఫ్ చేయకుండా ఉన్న ట్రాక్టర్ పైకి కోతి ఎక్కి స్టీరింగ్ పట్టుకోవడంతో ప్రజలు హడలెత్తారు. కోతి విచిత్ర గంతులు వేయడం, విన్యాసాలు చేయడం చూశాము కానీ.. డ్రైవర్ సీట్లో కూర్చొని డ్రైవర్ అవతారం ఎత్తింది. అల్లాదుర్గంలో రైతు ట్రాక్టర్ ఆఫ్ చేయకుండా దిగి పని నిమిత్తం పక్కకు వెళ్ళాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన కోతి ట్రాక్టర్ ఎక్కి స్టీరింగ్ పట్టుకొని అటూ ఇటూ తిప్పింది.

News November 4, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో మీ సేవలు బంద్..!

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో సోమవారం మీ సేవ కేంద్రాలు స్వచ్ఛందంగా బంద్ చేపట్టినట్లు మీ సేవ నిర్వాహకులు తెలిపారు. మీ సేవలు ప్రారంభించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం ఆర్టీసీ కళా భవన్‌లో 14వ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. జిల్లాలోని మీ సేవ నిర్వాహకులందరూ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ఈ రోజు బంద్ ప్రకటించారు. మంగళవారం యథావిధిగా కార్యాలయాలు కొనసాగుతాయన్నారు.

News November 4, 2024

పటాన్‌చెరు: సినిమాకు వెళ్లి వచ్చేసరికే ఇల్లు గుళ్ల

image

పటాన్‌చెరు బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ పరిధి లైఫ్ స్టైల్ డ్రీమ్ హోమ్స్ కాలనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ నందారపు శరత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. సరదాగా సినిమాకు వెళ్లి వచ్చేలోగా ఇంట్లోని 25 తులాల బంగారం ఆభరణాలు, పది తులాల వెండి ఆభరణాలు, రూ. 5వేల నగదు, మూడు ఖరీదైన వాచ్‌లు చోరీ జరిగాయి. భానూర్ పోలీసులు కేసు విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని అడిషనల్ ఎస్పీ సంజీవరావు పరిశీలించారు.

News November 4, 2024

100 రోజులన్నారు.. 300 రోజులైంది: హరీశ్ రావు

image

ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల అమలు విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలతో పాటు దేశాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉద్యోగ నియామకాల అంశంలో సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన తర్వాత సాధించిన ప్రగతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ట్యాగ్‌ చేస్తూ సీఎం రేవంత్‌ శనివారం ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు.