India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటికి నీరు పడుతున్న క్రమంలో కరెంట్ షాక్‌తో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన దుబ్బాక మండలం పెద్దచీకోడ్ గ్రామంలో జరిగింది. దుబ్బాక ఎస్సై గంగరాజు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన రాములు కొత్త ఇళ్లు కట్టుకుంటున్నారు. ఈ క్రమంలో గోడలకు నీళ్లు కొడుతుండగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోదీని గద్దె దింపుదామని మాజీ ఐఏఎస్ అధికారి, జాగో తెలంగాణ కన్వీనర్ ఆకునూరి మురళీ అన్నారు. ఓటర్ల చైతన్య బస్సు యాత్ర బుధవారం గజ్వేల్ పట్టణానికి చేరుకుంది. ప్రజా సంక్షేమాన్ని, సుస్థిర అభివృద్ధిని గాలికి వదిలి అధికారం కొరకు విద్వేషాలు రెచ్చగొడుతూ, సమాజాన్ని విచ్చిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్న మోదీని ఓడించాలన్నారు.
ఆసుపత్రికి వెళుతున్నానని చెప్పి ఓ వివాహిత ఇద్దరు పిల్లలతో అదృశ్యమైన ఘటన BDL పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బిహార్‌కు చెందిన వివాహిత, భర్త, మూడేళ్ల కుమారుడు, ఏడాది వయసున్న కుమార్తెతో కలిసి పటాన్ చెరు మండలం పాటి గ్రామంలో ఉంటున్నారు. ఈనెల 2న ఆసుపత్రికి అని ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది.
వెంకట్రామిరెడ్డికి మద్దతుగా మెదక్‌లో KCR రోడ్‌షో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపింది. మెదక్ జిల్లా, ప్రభుత్వ వైద్యకళాశాల, రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటును గుర్తుచేసిన KCR.. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త హామీలు ఇవ్వకపోగా BRS మంజూరు చేసిన వాటిని రద్దు చేస్తోందని విమర్శించారు. ‘BJP అభ్యర్థి రఘునందన్ మాట్లాడేవన్ని అబద్ధాలే. దుబ్బాకలో చెల్లని నోటు మెదక్‌లో చెల్లుతదా’ అని ప్రశ్నించారు.
పిడుగు పడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆందోల్ మండలం ఎర్రారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్థుల సమాచారం.. గ్రామానికి చెందిన బోయిని పాపయ్య(50) గ్రామ శివారులో పశువులను మేపుతున్నారు. సాయంత్రం తిరిగి వస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలో పిడుగు పడటంతో పాపయయ్ అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.
రానున్న 3 రోజుల అకాల వర్షాలు ఉన్నాయన్న నేపథ్యంలో రైతులు ధాన్యం రాశులు తడవకుండా భద్రపరచాలని మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా రైతులు టార్ఫాలిన్లతో కప్పి ఉంచాలన్నారు. అనంతరం పీపీసీ కేంద్రాల ఇన్‌ఛార్జ్‌లకు, రైతులకు ధాన్యం తడవకుండా చేపట్టాల్సిన చర్యలపై పలుసూచనలు చేశారు.
పార్లమెంటు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన అప్పటినుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,557 కేసులు నమోదు చేసి, 683 మందిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ తెలిపారు. రూ. 8.89 కోట్ల విలువైన అక్రమ మద్యం, కల్లు, నాటుసారా, గంజాయి తదితర పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈమధ్య పటాన్ చెరులో రూ. 9.23 కోట్ల విలువచేసే ఎంఎంసీ మత్తు పదార్థం సీజ్ చేశామన్నారు
పిడుగుపాటుకు యువకుడు మృతిచెందిన సంఘటన కుకునూర్‌పల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. కుకునూర్‌పల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా.. కుకునూర్‌పల్లికి చెందిన కుమ్మరి మల్లేశం(33) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం పనుల నిమిత్తం వ్యవసాయం బావి దగ్గరకి వెళ్లాడు. అప్పుడే ఉరుములు, మెరుపులతో వాన కురిసింది. ఈ క్రమంలో అతనిపై పిడుగుపడింది. దీంతో మల్లేశం అక్కడికక్కడే మృతిచెందాడు.
శివంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామానికి చెందిన కలకుంట లక్ష్మీ (45) వడదెబ్బతో మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మంగళవారం ఉపాధిహామీ పథకం కింద నిర్వహిస్తున్న పనుల వద్దకు పనులు చేసేందుకు వెళ్లింది. కూలీలతో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయింది. గ్రామంలోని వైద్యుడికి చూపించగా మృతిచెందినట్లు తెలిపారు.
మనోహరాబాద్ మండల కేంద్రానికి చెందిన ఆటోడ్రైవర్ మహమ్మద్ సాహెల్ (24) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు. సాహెల్ మూడు సంవత్సరాల నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ప్రేమను అంగీకరించకపోగా.. వేరే సంబంధం చూసి పెళ్లికి నిశ్చయించారు. దాంతో మనస్తాపానికి గురైన సాహెల్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Sorry, no posts matched your criteria.