India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ. 20,18,600 నగదు పట్టుబడ్డాయి. సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ. 14,62,000 నగదు లభించింది. బేగంపేటలో రూ.2 లక్షలు, గజ్వేల్‌లో 1,22,500 లు, టేక్మాల్‌లో రూ. 1,21,700 లు, చిన్నకోడూరు రూ. 1,11,400 లు నగదు పట్టుబడ్డాయి. పట్టుబడ్డ నగదును సీజ్ చేశారు.
మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ప్రచారం నిర్వహించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సాపూర్‌కు వస్తున్నారని నియోజకవర్గ ఇన్చార్జ్ రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ నర్సాపూర్ పర్యటన రద్దయిందని వారు తెలిపారు.
ఎన్నికల నిర్వహణ కోసం అదరపు పోలింగ్ సిబ్బందికి ఈనెల 7, 8 తేదీల్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం తెలిపారు. శిక్షణలో పోలింగ్ సిబ్బంది సందేహాలను నివృత్తి చేసుకోవాలని చెప్పారు. శిక్షణను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు.. దిగ్వాల్ 45.9, నాగపూర్ 45.5, సిద్దిపేట 45.4, రేగోడు, చిట్యాల 45.2, పోడ్చన్ పల్లి 45.1, రేబర్తి, లకుడారం 45.0, ఆరంజ్ అలర్ట్ దూల్మిట్ట 44.9, తుక్కాపూర్, కిష్టారెడ్డిపేట 44.8, రాఘవాపూర్, మెదక్, కొల్చారం 44.6, కల్హేర్, బెజ్జంకి 44.5, పాతూరు, దామరంచ, హుస్నాబాద్, ప్రగతి ధర్మారం 44.2 సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం రాత్రి మెదక్ పట్టణంలో నిర్వహించే ర్యాలీ, స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, మెదక్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు యం.పద్మదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, శశిధర్ రెడ్డిలు పాల్గొంటారు.
సిద్దిపేట వన్ టౌన్ సిఐ లక్ష్మీబాబు తన సిబ్బందితో కలిసి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆకస్మిక వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టణానికి చెందిన యం.రమేష్ తన మోటార్ సైకిల్‌లో ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకొని వెళుతున్న రూ.8,62,000/- సీజ్ చేశారు. చౌడారం గ్రామానికి చెందిన రాములు తన వాహనంలో ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.6 లక్షలు తీసుకువెళ్తుండగా వాటిని సీజ్ చేసినట్లు సీఐ లక్ష్మీబాబు తెలిపారు.
మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి గ్రామశివారులోని మంజీరానది నీటికుంటలో పడి సోమవారం బాలుడు మృతిచెందారు. కోడిపల్లి మండలం సదాశివపల్లి గ్రామానికి చెందిన ఒక కుటుంబం నీటికుంటలో స్నానం చేసేందుకు దిగారు. ఈ క్రమంలో దుర్గేష్ (16) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయాడు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికలు ఈనెల 13న జరగనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని వినూత్నంగా ప్రచారం చేపట్టారు. ఇన్విటేషన్ రూపంలో ముద్రించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇన్విటేషన్ పేరుతో ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ పేరుతో ముద్రించారు. ప్రస్తుతం ఆకర్షణగా మారి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు జన జాతర సభ నిర్వహించనున్నారు. ఈ జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. రేపు నర్సాపూర్‌లో జరగనున్న ఏఐసీసీ నేత ప్రియాంక గాంధీ పర్యటన రద్దయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి జన జాతర సభను నిర్వహించనున్నారు. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరలు అన్ని విపరీతంగా పెరిగిపోయాయని, సిద్దిపేట ఎమ్మెల్యే మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డితో కలిసి మిరుదొడ్డిలో రోడ్ షో నిర్వహించి కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ తులం బంగారం హామీ ఇవ్వడం ఏమో కానీ తూలం బంగారంకు రూ.20 వేల ధర పెరిగిందని ఎద్దేవా చేశారు. నిత్యావస ధరలు పెరిగాయి అన్నారు.
Sorry, no posts matched your criteria.