India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
MP ఎన్నికల ప్రచారానికి గడువు మరో వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. తీవ్ర ఎండలోనూ నాయకులు పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలువురు అగ్రనేతలు పర్యటించి క్యాడర్‌లో జోష్ నింపారు. అటూ ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగులతో హోరెత్తిస్తున్నాయి. బలమైన వర్గాలే లక్ష్యంగా హామీలు గుప్పిస్తున్నారు. దీంతో MDK, ZHB పార్లమెంట్లో రాజకీయం వేడెక్కింది.
సిద్దిపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు BRS నాయకులు, కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారంటీల హామీ విఫలమైందన్నారు. ఆరు గ్యారంటీల అమలు చేయనందుకు గానూ రాహుల్ గాంధీ తక్షణమే క్షమాపణ చెప్పాలని అన్నారు. క్షమాపణ చెప్పిన తర్వాతే తెలంగాణ ప్రజలను ఓట్లు అడగాలని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో BRS నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అవసరాలు తీర్చేందుకే ప్రాధాన్యం ఇస్తుందన్నారు. బీజేపీతో పేదలకు ఒరిగిందేమీ లేదని, వారు అధికారంలోకి వస్తే దేశాన్ని అమ్మడం ఖాయమని విమర్శించారు.
ఎంపీ ఎన్నికల నేపథ్యంలో షోషల్ మీడియాపై సిద్దిపేట కమిషనరేట్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. సిద్దిపేటలో హోం మంత్రి అమిత్ షా, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై ఫేక్ ప్రచారం నేపథ్యంలో ప్రత్యేక దృష్టిసారించారు. ఈ టీం పార్టీల నేతలు, కార్యకర్తలు చేసే వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, X,యూట్యూబ్, రీల్స్ వీడియోలు, పోస్టులను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఫిర్యాదు చేస్తే చర్యలకు సన్నద్ధమవుతున్నారు.
45 రోజుల ఆడశిశువు మృతి చెందింది. పటాన్‌చెరు SI వెంకట్ వివరాలు.. మహరాష్ట్రకు చెందిన జ్ఞానేశ్వర్, స్వప్న దంపతులు ఉపాధి కోసం ఇస్నాపూర్ వచ్చారు. పనిమీద జ్ఞానేశ్వర్ సొంతూరు వెళ్లాడు. శనివారం రాత్రి పాలు తాగి పడుకున్న పాప తెల్లారేసరికే చలనం లేకుండా పడిఉంది. పాపను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. తండ్రి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.
మెతుకు సీమ భగ భగమంటోంది. రోజురోజుకు భానుడు తాపానికి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో జనం జలు హడలిపోతున్నారు. రేగోడ్‌లో శనివారం రికార్డు స్థాయిలో 45.1 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే 4 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 10 రోజులుగా ఎండ పెరుగుతూ వచ్చింది. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిన్న వడదెబ్బతో ఒకరు చనిపోయిన విషయం తెలిసిందే.
గజ్వేల్ పట్టణంలో బైక్ మెకానిక్ షాపు ముందున్న చెట్టు వద్ద మంట పెట్టడంతో చెట్టు మొదలు కాలి పడిపోయింది. దీంతో సదరు వ్యక్తికి మున్సిపల్ సిబ్బంది రూ.10000 జరిమానా విధించారు. చెట్టు పోయిన చోటనే వేరే మొక్కను పెట్టించారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లును కొట్టివేస్తే వారిపై చర్యలు తీసుకోబడునని కమిషనర్ గోల్కొండ నర్సయ్య హెచ్చరించారు.
పార్లమెంటు ఎన్నికల్లో తటస్థ ఓటర్లు కీలకంగా మారారు. దీంతో వీరి ఓట్లను చేజిక్కించుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తూ ఓటర్లకు గాలం వేసే పనిలో ఉన్నారు. గ్రామాల్లో ఏ పార్టీ వారు ఎంతమంది ఉన్నారు? తటస్తులు ఎంతమంది? అన్న కోణంలో ప్రధాన పార్టీలు ప్రత్యేక బృందాలతో సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా మెదక్ పార్లమెంట్ పరిధిలోని పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న వారిపై దృష్టిసారించారు.
మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీజేపీలను ఎంపీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. అక్బర్ పేట భూంపల్లిలో జరిగిన కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో నాడు ప్రామిసరీ నోట్లు రాసిచ్చి.. నేడు గాడ్ ప్రామిస్‌లు చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిరూరు గ్రామ శివారులోని రైల్వే బ్రిడ్జి వద్ద నీటి కుంటలో వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. సుమారు 35 ఏళ్ల వయసు గల వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు బ్లాక్ కలర్ ప్యాంట్, వైట్ కలర్ షర్ట్ ధరించారని, మృతుడిని ఎవరైనా గుర్తిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.
Sorry, no posts matched your criteria.