India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓయూ పరిధిలో మే 16 నుంచి డిగ్రీ వన్ టైమ్ ఛాన్స్ పరీక్షలు ప్రారంభంకానున్నట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, ఇతర డిగ్రీ కోర్సులు చదివి ఫెయిలైన పూర్వ విద్యార్థులకు పరీక్ష రాసుకునేందుకు ఒక్క అవకాశం ఇచ్చిన విషయం విదితమే. వన్ టైమ్ ఛాన్స్ పరీక్షకు 15 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. వచ్చే వారం నుంచి హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు కంట్రోలర్ చెప్పారు. SHARE IT
వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన మౌనిక (21) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. వేలూరు గ్రామానికి చెందిన మల్లేశం కూతురు మౌనిక టైలరింగ్ చేస్తుంది. గత నెల 27న మౌనికకు పెళ్లి చూపులు నిర్వహించారు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పురుగుల మందు సేవించింది. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఓ యువకుడు ఆన్‌లైన్ ద్వారా యువతిని మోసం చేసి జైలు పాలయ్యాడు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి గ్రామానికి చెందిన అరవింద్ సిద్దిపేటకు చెందిన ఓ యువతిని ఉద్యోగం పేరుతో మోసం చేశాడు. ఆమె నుంచి రూ.16,75,750ల నగదును ఆన్‌లైన్ ద్వారా తీసుకున్నాడు. అనంతరం ఫోను ఆఫ్ చేయడంతో మోసపోయానని గ్రహించిన యువతి సిద్దిపేట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు విచారణ చేపట్టి అరవింద్‌ను అరెస్ట్ చేశారు.
తూప్రాన్ పట్టణంలో నివాసముండే కిష్టాపూర్‌కు చెందిన వడ్ల పవన్ భార్య అర్చన (27), ముగ్గురు పిల్లలు కార్తీక్(10), ఈశ్వర్(4), అక్షయ(6) అదృశ్యమైనట్లు ఎస్ఐ శివానందం తెలిపారు. 13ఏళ్ల క్రితం యాదాద్రి జిల్లాకు చెందిన అర్చనను పవన్ ప్రేమ వివాహం చేసుకోగా.. తూప్రాన్‌లో ఉంటున్నారు. కిష్టాపూర్‌లో తల్లిదండ్రుల వద్ద గల మరో ఇంట్లో ఉండేందుకు నిర్ణయించడంతో గొడవ చేసింది. నిన్న ఇంట్లోంచి వెళ్లి కనిపించకుండా పోయింది.
జగదేవ్పూర్ మండలం తీగుల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కందుకూరి వెంకటేశం(45) పెళ్లిరోజు మృతి చెందాడు. తీగుల్‌కు చెందిన వెంకటేశం పెళ్లిరోజు కావడంతో భార్య, పిల్లలతో ఆలయంలో పూజలు చేశారు. అనంతరం అతను పనిచేసే ప్రజ్ఞాపూర్ రెస్టారెంట్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామ శివారులో ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొనడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.
సిద్దిపేటకు చెందిన ఓ మహిళ సైబర్ నేరగాడి చేతిలో మోసపోయింది. సీపీ తెలిపిన వివరాలు.. ఓ వ్యక్తి ఫోన్ చేసి ఓ ప్రముఖ కంపెనీలో బ్యాక్ డోర్ జాబ్స్ ఉన్నాయని చెప్పగానే నమ్మిన మహిళ నిందితుడు చెప్పిన విధంగా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా విడతలుగా రూ.16,75,750 పంపించింది. అనంతరం ఆ నంబర్ స్విచ్ ఆఫ్ కావడంతో మోసపోయానని గ్రహించిన ఆమె వెంటనే 1930కి ఫిర్యాదు చేసినట్లు సీపీ తెలిపారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ లచ్చపేట వార్డుకు చెందిన వ్యాపారవేత్త కాచం నాగార్జున(57) గ్రామంలోని మహేశ్వర రైస్ మిల్లులో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. స్థానికుల సమాచారం.. నాగార్జున గత కొన్ని సంవత్సరాలుగా ఆ రైస్ మిల్లు నడుపుతున్నారు. ఇదే క్రమంలో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
కాంగ్రెస్, బీజెపీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని బీఆర్ఎస్‌ను లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలో చెరో 8 ఎంపీ స్థానాలను పంచుకొని బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. BJP పదేళ్ల పాలన, కాంగ్రెస్ 5 నెలల పాలనపై మాట్లాడకుండా మతం, రిజర్వేషన్ల పేరిట సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
మనోహరాబాద్ మండలం పాలాట వద్ద రాత్రి వడ్ల కుప్పని ఢీకొని సుంచు సత్యనారాయణ(45) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు. పోతారం గ్రామానికి చెందిన సత్యనారాయణ రాత్రి ద్విచక్రవాహనంపై పాలాట మీదుగా లింగారెడ్డిపేటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పాలాట వద్ద రోడ్డుపై పోసిన వడ్ల కుప్పను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. తూప్రాన్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు ఎస్సై తెలిపారు.
సిద్దిపేటలోని ఓ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స చేశారు. జీర్ణాశయంలో ఏర్పడిన కంతి క్యాన్సర్‌ను వైద్యులు తొలగించారు. వైద్యులు తెలిపిన వివరాలు.. తొగుట మండలంలోని పల్లెపహాడ్‌కు చెందిన రహమాన్ అనే వ్యక్తికి కడుపులోని జీర్ణాశయంలో కంతి క్యాన్సర్ ఏర్పడింది. దీంతో ఆమెకు అరుదైన శాస్త్ర చికిత్స చేసి ఆ కంతిని తొలగించినట్లు వైద్యులు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.