India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2023-24 సంవత్సరం కేజీబీవీ అభ్యర్థుల 1:3 మెరిట్ జాబితాను www.deosangareddy.in వెబ్ సైట్ లో ఉంచినట్లు డీఈవో వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. జాబితాలో పేర్లు ఉన్నవారు 13వ తేదీన కలెక్టరేట్లోని సమగ్ర శిక్ష కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని చెప్పారు. ఆ తర్వాత 1:1 మెరిట్ జాబితాను విడుదల చేస్తామని పేర్కొన్నారు. అభ్యంతరాలు ఉంటే 18వ తేదీలోపు సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలన్నారు.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ బిఎల్వోలు ఇంటింటికి తిరిగి యాప్ ద్వారా ఓటర్ల వివరాలను సరి చేస్తున్నారని చెప్పారు. వీరికి పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో 17 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 547 ఎస్ఐ పోస్టులు ఉండగా, ఆ పోస్టులకు సంబంధించిన శిక్షణ నేటితో పూర్తయింది. తెలంగాణ పోలీసు అకాడమీలో ఇవాళ పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మనషులపై దాడులకు పాల్పడుతూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి. వరుసగా కుక్కల దాడులు జరుగుతున్నప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. కుక్కల దాడుల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కుటుంబ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కెరీర్‌లో ఎత్తు పల్లాలు, లవ్ ఫెయిల్యూర్ ఇలా వివిధ కారణాలతో కొందరు తనువు చాలిస్తున్నారు. ఎంతో విలువైన జీవితానికి ముగింపు పలుకుతున్నారు. ఫలితంగా కుటుంబ సభ్యులకు వేదన మిగుల్చుతున్నారు. జిల్లాలో బలవన్మరణానికి పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది 640 ఆత్మహత్యలు నమోదయ్యాయంటే.. ఆ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. జిల్లాలో ఎక్కడో ఒకచోట అత్యాచారాలు, లైంగిక వేధింపు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు అధికారలు చర్యలు చేపట్టారు. అత్యవసర సమయాల్లో రక్షణకు టోల్‌ఫ్రీ నంబర్లను, యాప్‌లను తీసుకొచ్చారు. చైల్డ్ హెల్పులైన్-198, షీ టీం-8712657963, భరోసా-08457293098, మహిళా హెల్ప్‌లైన్-181, మిషన్ పరివర్తన-14446, పోక్సో ఈ బాక్స్, 112 యాప్‌లు ఉన్నాయి. SHARE IT
దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో ఆస్తి పంపకాల విషయంలో తండ్రితో గొడవపడి కొడుకు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఆరు ఎకరాల వ్యవసాయ భూమి పంపకం చేయాలని తండ్రి వెంకయ్యతో కొడుకు గంట బాలయ్య(39) 3న గొడవపడ్డాడు. పెద్దల సమక్షంలో రిజిస్ట్రేషన్ చేయిస్తానని తండ్రి చెప్పడంతో ఇంట్లోకి వెళ్లి గడ్డి మందు గుళికలు మింగాడు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు.
సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లోని పురాతన ఆలయంలో మహాగణపతి నిత్య పూజలు అందుకుంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్న దేవాలయం. ప్రజ్ఞాపూర్ లో మహా గణపతి విగ్రహం స్వయంభుగా కొలువైన ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉందని స్థానికులు తెలుపుతున్నారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా ప్రతిరోజు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
లక్ష్మీబాయి రక్ష ప్రశిక్షణ పేరుతో పాఠశాలలో అమలు చేయనున్న కరాటే శిక్షణ కోసం ఈనెల 16 వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఎంపికైన వారు పాఠశాలల్లో బాలికలకు కరాటే శిక్షణ నేర్పించాల్సి ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాలకు సంగారెడ్డి కలెక్టరేట్ లోని సమగ్ర శిక్ష కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.
గల్ఫ్‌లో మరో మెదక్ జిల్లా వాసి మృతి చెందాడు. హవేలీఘనపూర్ మండలం సుల్తాన్ పూర్ తండాకు చెందిన రామావత్ వస్రాం(40) మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన ఏజెంట్ ద్వారా గత నెల10న కూలి పని కోసం దుబాయ్ వెళ్ళాడు. నిన్న మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కాగా మెదక్ మండలం తిమ్మక్కపల్లి తండాకు చెందిన రాట్ల సూర్య కూడా ఈనెల 1న అబుదాబిలో మరణించగా మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు.
Sorry, no posts matched your criteria.