India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డెంగ్యూతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన బాలుడు చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. హత్నూర మండలం కొన్యాల గ్రామానికి చెందిన ప్రభులింగం కుమరుడు దశ్విక్(45రోజులు) మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.
ఉమ్మడి మెదక్‌లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గతవారం కిలో రూ. 200లకు పైగానే విక్రయించారు. గణేశ్ నవరాత్రులు మొదలుకావడంతో మాంసం విక్రయాలు క్రమంగా తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మంగళవారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. విత్ స్కిన్ కిలో రూ. 161, స్కిన్ లెస్ రూ. 183, ఫాంరేటు రూ. 89, రిటైల్ రూ. 111 చొప్పున విక్రయిస్తున్నారు.
SHARE IT
రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగడం ఖాయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విధానానికి చెంపు పెట్టుతున్నదని పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అనర్హతకు గురికావడం తద్యమన్నారు. ఈ క్రమంలో ఆయా సంబంధిత నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని తెలిపారు.
ఇతర పార్టీల తరహాలో బీజేపీలో కుటుంబ రాజకీయాలు ఉండవని మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జీవో భవన్లో బీజేపీ సభ్యత్వ కార్యక్రమంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. కార్యకర్త స్థాయి నుండి నాయకుని స్థాయికి ఎదిగే పార్టీ బిజెపిలో మాత్రమే సాధ్యమన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బిజెపి కార్యకర్తలు, నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఎంపీ పిలుపునిచ్చారు.
విద్యార్థుల సామర్థ్యాలు పెంచేందుకే కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి శంకర్ తెలిపారు. సదాశివపేట మండలం నందికండి ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ సమావేశం సోమవారం నిర్వహించారు. ఎంఈఓ మాట్లాడుతూ.. పాఠశాలలోని విద్యార్థుల సామర్థ్యాలపై చర్చించినట్లు చెప్పారు. సమావేశంలో నోడల్ అధికారి సుధాకర్, ఆర్పీలు పాల్గొన్నారు.
గణేశ్ మండపం వద్ద విషాదం జరిగింది. విద్యుదాఘాతంతో పంచాయతీ స్వీపర్ మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. రాజుపేట గ్రామానికి చెందిన దాసరి పోచయ్య (70) ఈరోజు ఉదయం మండపం వద్ద శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు విచారణ చేపట్టారు.
RBI 90వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు RBI-90 పేరిట క్విజ్ నిర్వహిస్తోంది. ఈ పోటిలో పాల్గొనేందుకు www.rbi90quiz.in వెబ్‌సైట్ ద్వారా ఈనెల17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 19 నుంచి 21 వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పోటీలు జరగనున్నాయి. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో మొత్తం 71 కళాశాలలు ఉన్నాయి. 15 వేల మందికిపైగా చదువుకుంటున్నారు. వీరంతా పాల్గొనే అవకాశం ఉంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
పటాన్‌చెరు నియోజకవర్గం ఎల్‌ఐజీలోని దత్త పీఠంలో అయోధ్య రాముడికి బహుకరించేందుకు 13కిలోల వెండి, కిలో బంగారంతో తయారు చేసిన ధనస్సు, బాణానికి ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాత చల్లా శ్రీనివాసశాస్త్రీ దీనిని తయారు చేయించారు. ఈ సందర్భంగా దాతను ఎంపీ అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో మరోసారి రామరాజ్య స్థాపనకోసం కృషి జరుగుతోందన్నారు.
కాంగ్రెస్ పాలనలో ఇప్పటివరకు 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందని మండిపడ్డారు. అందరికీ రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పారని, కాని రైతులు రుణమాఫీ కాక తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోకపోవడంతో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
Sorry, no posts matched your criteria.