India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంగారెడ్డి జిల్లాలోని 3, 6, 9 తరగతుల విద్యార్థులకు ఈనెల 10న న్యాస్ సన్నాహక పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు ఇప్పటికే పాఠశాలలకు పంపించినట్లు చెప్పారు. విద్యార్థులకు న్యాస్ పరీక్ష నిర్వహించి జవాబు పత్రాలు మళ్లీ మండల విద్యాధికారి కార్యాలయానికి పంపించాలని సూచించారు.
మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. టేక్మాల్‌లో ఇల్లు కూలడంతో నిద్రిస్తున్న మహిళ చనిపోయింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దత్తయ్య, శంకరమ్మ(60) దంపతులు శనివారం ఇంట్లో పడుకున్నారు. ఇటీవల వర్షాలతో నానిన వారి ఇల్లు కూలడంతో శంకరమ్మ నిద్రలోనే మృతిచెందింది. భర్త దత్తయ్య మరో గదిలో పడుకోవడంతో ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలలో ఆదివారం నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతుందని ఐఎండి హెచ్చరించింది.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. సిద్దిపేట మెదక్ రహదారి పక్కన అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. తిమ్మాపూర్ గ్రామ శివారులోని గోదాంల వద్ద చెత్తకుప్పలో పడవేశారు. అటుగా వెళ్తున్న స్థానికులు చూసి వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వగా.. ఆస్పత్రికి తరలించారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన అశోక్ మృతదేహం బయటపడింది. శుక్రవారం చేపల వేటకు వెళ్లిన అశోక్ చెరువులో గల్లంతయ్యారు. నర్సాపూర్ ఫైర్ సిబ్బంది కే ప్రశాంత్, నాగరాజు, మధు, రమేశ్, వెంకటేశ్‌లు చెరువులో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం తరలించారు.
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను, ఈద్ – మిలాద్- ఉన్ -నబీ, ఇతర పండగలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. వినాయక చవితి మండపాల నిర్వాహకులకు, పీస్ కమిటి సభ్యులకు సూచనలు చేస్తూ ఒక మతాన్ని ఇంకో మతం వారు ఆదరించుకుంటూ పండుగలు జరుపుకునే సంస్కృతి మెదక్ జిల్లాలో ఉన్నదన్నారు.
తూప్రాన్ పట్టణంలోని సెయింట్ ఆర్నాల్డ్ హైస్కూల్‌లో 9న ఉమ్మడి మెదక్ జిల్లా సబ్ జూనియర్ ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ మహేందర్ రావు, పోచప్ప, నాగరాజు తెలిపారు. 13 నుంచి 15 వరకు ఖమ్మం జిల్లా కల్లూరు మినీ స్టేడియంలో 34 సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనే బాల బాలికల మెదక్ జిల్లా జట్ల ఎంపికలు చేపడుతున్నట్లు వివరించారు. వివరాలకు 98665 46563 సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని.. కలిసి పోరాటం చేద్దాం అని రాష్ట్ర రైతులకు హరీశ్ రావు పిలుపునిచ్చారు. రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న రైతు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రిలో సందర్శించారు. రుణమాఫీ కాలేదన్న కారణంతో మేడ్చల్‌కు చెందిన రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర రైతాంగం పక్షాన రాజీలేని పోరాటం చేస్తాం అని స్పష్టం చేశారు.
మేడ్చల్‌లో ఆత్మహత్య చేసుకున్న దుబ్బాక రైతు సురేందర్ రెడ్డి మృతదేహానికి ఈరోజు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎమ్మెల్యేలు హరీశ్‌రావు,సబితా ఇంద్రారెడ్డి, తలసాని, సునీతాలక్ష్మారెడ్డి, ముఠాగోపాల్, మల్లారెడ్డి నివాళులర్పించారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు.కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని,ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరారు.రుణమాఫీ కాలేదన్న కారణంతో రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.
హైదరాబాద్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘మట్టి విగ్రహం మహా విగ్రహం మట్టి వినాయక పంపిణీ’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అందరి జీవితాల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా శుభం కలిగేలా ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం ఉండాలని అన్నారు. మట్టి విగ్రహాలు వాడడం వల్ల కుల వృత్తులు బాగుపడతాయని అన్నారు.
Sorry, no posts matched your criteria.