Medak

News October 19, 2024

కూతురును హత్య చేసిన తల్లి, ప్రియుడికి జీవిత ఖైదు

image

కూతురిని హత్య చేసిన తల్లి, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర శుక్రవారం తీర్పు ఇచ్చారు. వడపావ్‌కు చెందిన రాజుతో కల్పన వివాహేతర సంబంధం పెట్టుకుని సదాశివపేటలో నివాసముంటుంది. కాగా కల్పన పెద్ద కుమార్తె భవ్య(3) రాజును నాన్న అని పిలవకపోవడంతో తలను గోడకేసి కొట్టడంతో మృతిచెందింది. ఈ కేసులో నేరం రుజువు కావడంతో వీరిద్దరికీ కోర్టు శిక్ష విధించింది.

News October 19, 2024

MDK: ఈ టీచర్ ది గొప్ప మనసు..

image

మెదక్ జిల్లా చేగుంట మండలంలోని వడియారంలో ప్రాథమిక పాఠశాలలో “మన ఊరు మన బడి” పథకంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేసేందుకు పాఠశాల ఉపాధ్యాయురాలు వసంత తన వంతు సహాయంగా రూ. లక్ష విరాళం ప్రకటించారు. ఈరోజు పనులు పూర్తి చేసేందుకు రూ. 25000 చెక్కును HM సిద్దిరాములుకు అందజేశారు. దీంతో వసంతను హెచ్ఎం, ఉపాధ్యాయులు సంతోషిమాత, అమరేశ్వరి తదితరులు అభినందించారు.

News October 19, 2024

సంగారెడ్డి: ‘రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి’

image

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు, అధికారులు కలిసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో రోడ్డు భద్రత సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ముఖ్యంగా లకడారం, కంది, నోవా పాన్, ముత్తంగి స్వీట్ హార్ట్ కార్నర్, రుద్రారం గీతం రోడ్, కవలం పేట్ మామిడిపల్లి ఎక్స్ రోడ్ వంటి ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.

News October 18, 2024

MDK: వేచి చూడాలి మరి అదృష్టం ఎవరిని వరిస్తుందో..?

image

ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటికే గ్రామ సర్పంచులు, ఎంపీపీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీ కాలం ముగిసింది. త్వరలో మున్సిపాలిటీల పదవీ కాలం కూడా ముగియనున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా ఇన్‌ఛార్జిలతో నేనంటే నేను ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ పదవికి పోటీ చేస్తానని చెప్పుకుంటున్నారు. వేచి చూడాలి మరి అదృష్టం ఎవరిని వరిస్తుందో..?

News October 18, 2024

సంగారెడ్డి: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై మంత్రి సమీక్ష

image

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో వారి ధాన్యం కొనుగోలు, రుణమాఫీపై అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని చెప్పారు. ఇంకా ఎవరికైనా రూ. రెండు లక్షల లోపు రుణమాఫీ కాకుంటే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో వల్లూరు క్రాంతి, అధికారులు పాల్గొన్నారు.

News October 18, 2024

సంగారెడ్డి: ‘ఇందిరమ్మ కమిటీల్లో మార్గదర్శకాలు పాటించాలి’

image

ఇందిరమ్మ కమిటీలో మార్గదర్శకాలు పాటించాలని కోరుతూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు కలెక్టర్ కార్యాలయంలో గురువారం వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలతో చర్చించి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కొండల్‌రెడ్డి, విజయేందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.

News October 18, 2024

సంగారెడ్డి: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

సంగారెడ్డిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో టూవీలర్ ఉచిత శిక్షణ కోసం అర్హులైన యువకులు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ గురువారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత పురుషులు అర్హులని చెప్పారు. 18 నుంచి 35 సంవత్సరంలోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

News October 18, 2024

సంగారెడ్డి: 19న ఉమ్మడి మెదక్ క్రికెట్ ఎంపికలు

image

స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ బాలికలు అండర్- 17 ఎంపికలు ఈనెల 19న సంగారెడ్డిలోని MS అకాడమీలో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఎంపికలో పాల్గొనే బాలికలు ఉదయం 9 గంటలకు ఒరిజినల్ బోనఫైడ్ తో హాజరుకావాలని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లా జట్టును ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.

News October 18, 2024

పెండింగ్‌లో ఉన్న 5 డీఏలు వెంటనే విడుదల చేయాలి: హరీశ్ రావు

image

ప్రభుత్వ ఉద్యోగులకు హామీలు ఇచ్చి మాట తప్పిందని, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈనెల 23న నిర్వహించే క్యాబినెట్‌లో చర్చించి, వెంటనే ప్రకటించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులందరికి ఆనాటికి పెండింగ్‌లో ఉన్న 3 డీఏలను అధికారంలోకి రాగానే తక్షణమే చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు.

News October 17, 2024

సిద్దిపేట: పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ విధానంలో మార్పు

image

2024-25 విద్యా సంవత్సరానికి గాను సిద్దిపేట జిల్లాలో అర్హులైన ఎస్సీ విద్యార్థుల పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్ నమోదుకు నూతన విధివిధానాన్ని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈపాస్ వెబ్సైట్ నందు మార్పులు చేసినట్లు సిద్దిపేట జిల్లా ఎస్సీడబ్ల్యూఓ కవిత తెలిపారు. ప్రతి విద్యార్థి పేరు ఎస్ఎస్సీ మెమోలో ఉన్న విధంగానే ఆధార్ కార్డులోనూ ఉండాలని, ఆదాయ పరిమితి రూ.2లక్షల నుంచి రెండున్నర లక్షలకు పెంచారన్నారు.