India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఎన్నెన్నో మార్పులు సంతరించుకుంటాయి. ఇది వరకు ఓటరు స్లిప్ పై ఓటరు ఫోటోతో పాటు వివరాలు ఉండేవి. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి అందులో మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తోంది. ఓటరు స్లిప్ పై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దాన్ని ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే ఓటరు పూర్తి వివరాలు కనిపిస్తాయి.
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తిలో కొడుకు నరసింహులు దాడిలో గాయపడిన తల్లి భారతమ్మ(55) మృతి చెందింది. మద్యానికి బానిసైన నర్సింలు ఈనెల 27న తల్లితో గొడవపడి దాడి చేశాడు. చికిత్స పొందుతూ ఆమె నిన్న చనిపోయింది. కాగా 9ఏళ్ల క్రితం తండ్రి బాలమల్లుతో గొడవపడి దాడి చేయగా మృతి చెందాడు. కూతురు సరస్వతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పదోతరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా సత్తాచాటింది. 98.64 ఉత్తీర్ణత శాతంలో రాష్ట్రంలోనే సిద్దిపేట 2వ స్థానంలో నిలిచింది. ఇందులో బాలురు 6920, బాలికలు 6868 మంది ఉత్తీర్ణులయ్యారు. 97.86 శాతంతో సంగారెడ్డి జిల్లా 5వ స్థానంలో నిలవగా.. 10852 బాలురు, 10688 బాలికలు పాసయ్యారు. 92.96 శాతంలో మెదక్ జిల్లా18వ స్థానం సాధించగా.. అబ్బాయిలు 4608, అమ్మాయిలు 4945 మంది పాసయ్యారు.
రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే మెదక్ లోక్‌సభ ఎన్నికలు ప్రత్యేకంగా మారాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 44 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇంత మంది ఇక్కడి నుంచి పోటీ చేస్తుండడం ఇదే మొదటిసారి. ఇక ఈ ఎన్నిక ఖర్చు కూడా అధికంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. సాధారణంగా ఒక్కో నియోజకవర్గానికి సుమారు రూ.15 కోట్లు ఖర్చు అవుతుండగా, మెదక్ ఎన్నికలకు అదనంగా మరో రూ.10 కోట్లు ఖర్చయ్యే అవకాశాలున్నాయి.
కంగ్టి మండలం చాప్టా(కే) శివారులో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు కంగ్టి CI చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతుడు ముర్కుంజాల్‌కు చెందిన వడ్డే సంజుగా గుర్తించారు. శరీరంపై ఉన్న గాయల ప్రకారం దారుణంగా హత్యకు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇంట్లో గొడవతో భార్య 2నెలల క్రితం పుట్టింటింటికి వెళ్లింది. సంజు తల్లిదండ్రులు చనిపోగా సోదరులు HYD వలస వెళ్లారు.
మెదక్ పార్లమెంటు స్థానంలో అత్యధికంగా 44 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఒక్కో పోలింగ్ కేంద్రానికి మూడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు అవసరం కానున్నాయి. ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల వివరాలు ఉండనుండగా, 44 మంది పోటీలో ఉండడంతో మూడు ఈవీఎంలో అవసరము కానున్నాయి. 2,124 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 6,372 ఈవీఎంలు అవసరం కానున్నాయి.
పదోతరగతి ఫలితాలు ఇవాళ ఉదయం 11గంటలకు వెలువడనున్నాయి. కాగా మెదక్ జిల్లాలో 10,389, సంగారెడ్డి జిల్లాలో 22,069, సిద్దిపేట జిల్లాలో 13,987 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగాయి. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను Way2News యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.
మెదక్ జిల్లాలో నేడు జరగనున్న ఎన్నికల ప్రచార సభకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల మధ్యలో ఉన్న అల్లాదుర్గంలో నేడు నిర్వహించనున్న బీజేపీ ‘విశాల్ జనసభ’లో ఆయన ప్రసంగించనున్నారు. ఈ సభ కోసం ఐబీ చౌరస్తా వద్ద 30 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. ప్రధాని, ఇతర ముఖ్య నేతల కోసం భారీ వేదిక ఏర్పాటు చేశారు.
మాసాయిపేట మండలం రామంతపూర్ వద్ద 44వ జాతీయ రహదారిపై రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల సమాచారం.. హైవేపై ద్విచక్ర వాహనం మీద దంపతులు ఇద్దరు వెళ్తుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామస్థులుగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మెదక్ లోక్ సభ బరిలో 44 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 54 మంది నామినేషన్లు వేయగా స్ర్కూటీనిలో ఒకటి రిజెక్ట్ అయింది. సోమవారం వరకు 9 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో గుర్తింపు పొందిన BRS, కాంగ్రెస్, BRS, బీఎస్పీ నుంచి నలుగురితోపాటు 11 మంది రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు, 29 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. మెదక్‌లో ముక్కోణపు పోటీ జరగనుంది. అటు <<13147815>>జహీరాబాద్ బరిలో<<>> 19 మంది నిలిచారు.
Sorry, no posts matched your criteria.