Medak

News April 29, 2024

ఉమ్మడి జిల్లాలో తగ్గని ఉష్ణోగ్రతలు.. జాగ్రత్త

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు.. సిద్దిపేట 44.3, సదాశివపేట 43.6, కొండాపూర్ 43.5, నిజాంపేట 43.4, తుక్కాపూర్ 43.2, దూల్మిట్ట, వట్ పల్లి లలో 43.1, చేగుంట, కౌడిపల్లి, శనిగరం లలో 42.9, బెజ్జంకి 42.8, బీహెచ్ఈఎల్ 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.

News April 29, 2024

జహీరాబాద్ ఎంపీ బరిలో 19 మంది అభ్యర్థులు

image

జహీరాబాద్ ఎంపీ బరిలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 19 మంది నిలిచారు. ఇక్కడ మొత్తం 44 మంది నామినేషన్ దాఖలు చేయగా.. 18 నామినేషన్లు తిరస్కరించారు. సోమవారం వరకు 7 నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. రికగ్నైజ్డ్ జాతీయ, రాష్ట్ర పార్టీల తరఫున ముగ్గురు, రిజిస్టర్డ్ పార్టీల తరఫున ఆరుగురు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే ఇక్కడ పోటీ నెలకొని ఉంది.

News April 29, 2024

గజ్వేల్, సిద్దిపేటపై కాంగ్రెస్, BJP ఫోకస్..!

image

MP ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్, BJP.. హరీశ్ రావు, కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ 2 నియోజకవర్గాల్లో BRSకు మంచి ఓటు బ్యాంకు ఉండటంతో దాన్ని తమ పార్టీలవైపు మలుపుకోవాలని చూస్తున్నాయి. దీంతో తమ అభ్యర్థుల గెలుపు అవకాశాలు మరింత మెరుగవుతాయని ఆయా పార్టీల నేతలు వ్యూహాలకు పదునుపెడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

News April 29, 2024

సభాస్థలిని పరిశీలించిన ఎంపీ బీబీ పాటిల్

image

అల్లాదుర్గంలో రేపు మధ్యాహ్నం నిర్వహించ తలపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ స్థలిని సోమవారం మధ్యాహ్నం బిజెపి ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ స్వయంగా సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ మేరకు సంబంధిత సభా వేదిక ఏర్పాట్ల నిర్వాహకులతో చర్చించారు. ఇక్కడ ఎలాంటి లోటుపాట్లు జరగకుండా సభా ప్రాంగణాన్ని సిద్ధం చేయాలని బీబీ పాటిల్ సూచించారు.

News April 29, 2024

మెదక్: ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విత్ డ్రా

image

మెదక్ లోక్ సభ స్థానానికి నామినేషన్ వేసిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు సోమవారం విత్ డ్రా చేసుకున్నారు. సదాశివపేటకు చెందిన తుమ్మలపల్లి పృథ్వీరాజ్(తెలంగాణ మంజీరా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు), సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్ల మాచనూర్ గ్రామానికి చెందిన కపిల్ భద్రేశ్ విత్ డ్రా చేసుకున్న వారిలో ఉన్నారు. మొత్తం 53 మంది అభ్యర్థులు నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.

News April 29, 2024

మెదక్: ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విత్ డ్రా

image

మెదక్ లోక్ సభ స్థానానికి నామినేషన్ వేసిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు సోమవారం విత్ డ్రా చేసుకున్నారు. సదాశివపేటకు చెందిన తుమ్మలపల్లి పృథ్వీరాజ్(తెలంగాణ మంజీరా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు), సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్ల మాచనూర్ గ్రామానికి చెందిన కపిల్ భద్రేశ్ విత్ డ్రా చేసుకున్న వారిలో ఉన్నారు. మొత్తం 53 మంది అభ్యర్థులు నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.

News April 29, 2024

హైదరాబాద్‌: ఓయూలో నెల రోజులు బంద్

image

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని హాస్టళ్లు, మెస్‌లకు వచ్చే నెల 1వ తేదీ నుంచి వేసవి సెలవులను ప్రకటించారు. ఈ మేరకు చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్ ప్రకటన జారీ చేశారు. వేసవి నేపథ్యంలో <<13137079>>మంచినీరు, విద్యుత్ కొరత <<>>ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే మే 1 నుంచి 31 వరకు సెలవులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విద్యార్థులందరూ సహకరించాలని కోరారు. SHARE IT

News April 29, 2024

రేపు మెదక్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన

image

మెదక్ పార్లమెంట్ పరిధిలో రేపు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం శివారులోని చిల్వేర్ వద్ద నిర్వహించే సభలో ఆయన పాల్గొనున్నారు. మెదక్ స్థానం నుంచి ఈ ఎన్నికలో
బీజేపీ తరఫున రఘునందన్, జహీరాబాద్ నుంచి బీబీపాటిల్ పోటీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది.

News April 29, 2024

మెదక్: నాన్న చేయి వదిలి.. చనిపోయాడు!

image

కౌడిపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<13142095>>చిన్నారి<<>> మృతిచెందిన సంగతి తెలిసిందే. ప్రణయ్ (2), మరో అమ్మాయి ఇంటి ఎదుట ఆడుకుంటూ 765డి జాతీయ రహదారి పైకి వచ్చి రోడ్డు దాటారు. ఇది గమనించిన బాలుడి తండ్రి రాములు పిల్లల్ని తీసుకుని రోడ్డు దాటాడు. ఈ క్రమంలో చిన్నారి ప్రణయ్ తండ్రి చేయిని వదిలి ఒక్కసారిగా ముందుకొచ్చాడు. అదే సమయంలో వేగంగా వస్తున్న లారీ చిన్నారిని ఢీకొంది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

News April 29, 2024

శివంపేట: భార్య, కొడుకుతో గొడవపడి ఆత్మహత్య

image

మెదక్ జిల్లా శివంపేట మండలం లింగోజిగూడ తాండాకు చెందిన మాలోత్ విట్టల్ (48) ఈరోజు ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో భార్య, కొడుకుతో ఇంట్లో విషయమై గొడవపడ్డాడు. మనస్తాపానికి గురైన విఠల్ పొలం వద్దకు వెళ్లి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. శివంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.