India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జహీరాబాద్ లోక్‌సభ స్థానంలో ఓటర్ల సంఖ్య పెరిగింది. 2019 నుంచి 2024 వరకు ఈ స్థానంలో 1,45,912 మంది కొత్త ఓటర్లు చేరారు. ఈ పార్లమెంటు పరిధిలో మొత్తం 16,40,755 మంది ఓటర్లు ఉన్నారు. ఈ లోక్‌సభ స్థానానికి 2009లో 74.67 శాతం, 2014లో 77.28 శాతం, 2019లో 69.70 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం పెరిగిన ఓటర్ల సంఖ్యతో ఈసారి పోలింగ్ శాతం పెరగనుందని పలువురు భావిస్తున్నారు.
మెదక్ లోక్‌సభ స్థానంపై స్థానికేతరులు దృష్టి సారించారు. ఈ స్థానానికి 54 మంది అభ్యర్థులు నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఇందులో ఓ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. మిగిలిన 53 మంది అభ్యర్థుల్లో 8 మంది అభ్యర్థులు స్థానికేతరులు ఇక్కడ నామినేషన్ వేయడం గమనార్హం. ఇందులో ఖమ్మం, హైదరాబాద్, ఆదిలాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి, వరంగల్‌కు చెందిన వారు నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది.
ఈవీఎంల పనితీరుపై ఏఆర్వోలు, నోడల్ అధికారులకు అవగాహన ఉండాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డిలోని ఫంక్షన్ హాల్ లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధికారులకు అవగాహన సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పోలింగ్ రోజున ఎన్నికల సిబ్బంది ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి పాల్గొన్నారు.
ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దని,
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని
ఎన్నికల పరిశీలకుడు సమీర్ మాధవ్ కుర్కోటి సూచించారు. ఎన్నికల నియమావళిపై అదివారం మెదక్ కలెక్టరేట్లో వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్షి, జిల్లా పోలీస్ పరిశీలకుడు రామేశ్వర్ సింగ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్, SP బాలస్వామితో కలిసి జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు, పోలీస్ అధికారులతో సమీక్షించారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. వెంకట్రావుపేట్ జాతీయ రహదారిపై లారీ ఢీకొని బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. బంధువులు తెలిపిన వివరాలు.. వెంకట్రావుపేట్‌కు చెందిన దొంతుల స్వప్న- రాము దంపతుల ఏకైక కుమారుడు ప్రణయ్(4) రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా లారీ ఢీకొని స్పాట్‌లోనే చనిపోయాడు. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రణయ్ పుట్టు వెంట్రుకలు నేడే తునికి నల్ల పోచమ్మ వద్ద తీశారు.
బీడీ కార్మికులకు కూడా బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ విధించిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. పుర్రె గుర్తు పెట్టీ కాంగ్రెస్ పార్టీ బీడి కార్మికులను ముంచింది. బీడీ కార్మికులను అందుకున్నది కేవలం కేసిఆర్ మాత్రమే అన్నారు. చిన్న శంకరంపేట్ మండల కేంద్రంలో ప్రచారంలో పాల్గొన్నారు. మెదక్ ఎంపీగా బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
చేగుంట మండలం చిన్న శివునూరు చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చేగుంటకు చెందిన బాలరాజు(45) మృతి చెందాడు. చేగుంట మండలం కర్నాల్ పల్లి ఎల్లమ్మ ఆలయానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై చేగుంటకు తిరుగు ప్రయాణమయ్యాడు. చిన్న శివునూరు చౌరస్తా వద్ద కారు తగలడంతో బాలరాజు కిందపడ్డారు. ఈ క్రమంలో ఆయనపై నుంచి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చేగుంట పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్నికల సంఘం సాంకేతికతలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటుంది. ఐదేళ్లకోసారి జరిగే ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తుతోంది. ప్రజలు ఎక్కువగా వాడే వాట్సప్‌ను వినియోగించుకోవాలని జిల్లా అధికారులు అంటున్నారు. దీంతో వివిధ రకాల సమాచారాలను ఓటర్లకు చేరవేస్తున్నారు.
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీలపై సర్జికల్ స్ట్రైక్ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజులుగా ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారని మెదక్ బీజేపీ అభ్యర్థి ఎం. రఘునందన్ రావు పేర్కొన్నారు. బీఆర్ అంబేడ్కర్ తిరిగి పుట్టినా రాజ్యాంగ సవరణ తప్ప మారదనే విషయాన్ని పీఎం మోదీ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు అవిభక్త కవలలని ద్వజమెత్తారు.
మెదక్ జిల్లా శివంపేట మండలం గుండ్లపల్లికి చెందిన డప్పు కుమార్(30) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం.. తరచూ మద్యం తాగి వస్తుండటంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 4 రోజుల క్రితం గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న కుమార్ శనివారం రాత్రి ఉరివేసుకున్నాడు. ఈ మేరకు శివంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.