Medak

News April 6, 2024

సంగారెడ్డి: 15 నుంచి వార్షిక పరీక్షలు

image

జిల్లాలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈనెల 15 నుంచి 22వ తేదీ వరకు వార్షిక పరీక్షలు జరుగుతాయని డీఈవో వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. విద్యార్థులు రాసిన జవాబు పత్రాలు వెంటనే మూల్యాంకనం చేయాలని చెప్పారు. 23వ తేదీన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిచి ప్రోగ్రెస్ కార్డులు అందజేయాలని సూచించారు.

News April 6, 2024

సిద్దిపేట: విద్యార్థినితో అసభ్య ప్రవర్తన.. టీచర్ సస్పెన్షన్

image

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ పదవ తరగతి పరీక్షా కేంద్రంలో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి ఇ.శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన అనంతరం విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయం నిజమేనని తేలడంతో సస్పెండ్ చేసినట్లు కొండపాక ఎంఈవో పేర్కొన్నారు.

News April 5, 2024

బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం: రాజనర్సింహ

image

అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన మహనీయుడు భారత దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆయన జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఆయన విగ్రహానికి పులమాల వేసి ఘన నివాళి అర్పించారు. అయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు.

News April 5, 2024

సిద్దిపేట: 46 మందిపై ఈ-పెట్టి కేసులు

image

గత నెలలో 46 మంది ఈవ్ టీజర్స్‌పై ఈ-పెట్టి కేసులు పెట్టి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ తెలిపారు. మహిళలు మౌనం వీడి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ర్యాగింగ్, ఇవ్ టీజింగ్, ఏదైనా అవమానానికి గురైనట్లయితే వెంటనే జిల్లా షీటీమ్ వాట్సాప్ నంబర్ 8712667434 కి సమాచారం ఇవ్వాలని సూచించారు.

News April 5, 2024

వెల్దుర్తి: చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి సూసైడ్

image

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగల్ పర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మంగలి భీమయ్య(46) తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. బంధువుల ఫిర్యాదులతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

News April 5, 2024

మనూర్: రూ. 6లక్షల నగదు స్వాధీనం

image

ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.6 లక్షల నగదును పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. జహీరాబాద్ నుంచి బాదల్ గావ్ చౌరస్తా వద్ద ఎస్ఐ తనిఖీలు చేస్తుండగా ఓ వాహనంలో ఈ నగదు లభ్యమైంది. సంగారెడ్డి‌లోని గ్రీవెన్స్‌లో డిపాజిట్ చేస్తామని ఎస్ఐ తెలిపారు. సరైన పత్రాలు లేకుండా నగదు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 5, 2024

సంగారెడ్డి: లోన్ యాప్ వేధింపులకు యువకుడి ఆత్మహత్య

image

సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం ఓ గ్రామంలో లోన్ యాప్ వేధింపులతో మనస్తాపానికి గురై యువకుడు శ్రీకాంత్(21) ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ ద్వారా రూ.30 వేల రుణం తీసుకోగా, నాలుగు నెలల వ్యవధిలో రూ.1,30,000 చెల్లించాడు. మరో రూ.80వేలు చెల్లించాలని వేధించారు. అశ్లీల పోస్టులు చేయడంతో మనస్తాపానికి గురై గత నెల 30న పురుగు మందు తాగాడు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు.

News April 5, 2024

ఏడుపాయలలో నీట మునిగి వ్యక్తి మృతి

image

ఏడుపాయల వన దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన భక్తుడు నీట మునిగి మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాపన్నపేట ఎస్ఐ నరేశ్ వివరాల ప్రకారం.. HYD సంజీవరెడ్డి నగర్‌కు చెందిన వెంకటేశ్(28) బంధువులతో కలసి ఏడుపాయలకు వచ్చాడు. స్నానం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మంజీర పాయల్లో మునిగి మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

News April 5, 2024

నేడు సిద్దిపేట జిల్లాలో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటన

image

నేడు సిద్దిపేట జిల్లాలో పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్మెంట్ మరియు RES శాఖ ప్రిన్సిపల్ సెక్రేటరీ సందీప్ కుమార్ సుల్తానియా పర్యటించనున్నారు. గజ్వేల్ మండలం అక్కారంలో 40 ఎంఎల్ సంప్ హౌజ్, కుకునూరుపల్లి మండలం తిప్పారం వద్ద మల్లన్నసాగర్ తాగునీటి పంప్ హౌజ్, మంగోల్ లోని 540 డబ్ల్యూటీపీని సందర్శించనున్నారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షలో నిర్వహించి, కొండపాక HMWSS సంప్ హౌజ్ ను సందర్శించనున్నారు.

News April 5, 2024

సంగారెడ్డి: రియాక్టర్ పేలుడుపై దర్యాప్తు ముమ్మరం: ఐజీ

image

హత్నూర మండలంలో ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని మల్టీజోన్ ఐజీ సుధీర్ బాబు అన్నారు. నేడు సంగారెడ్డిలో ఎస్పీ రూపేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా పటాన్‌చెరు డీఎస్పీని నియమించామని, నివేదిక వచ్చాక దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అటు పరిశ్రమలో బుధవారం జరిగిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి చేరింది.