India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లాలో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద రెండవ దేవాలయంగా పేరొందని సీఎస్ఐ మెదక్ చర్చిలో వచ్చే నెల సెప్టెంబర్లో శతాబ్ది ఉత్సవాల నిర్వహణకు సిద్దమైంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న స్త్రీల మైత్రి ఉత్సవాలు చర్చి వార్షికోత్సవం పేరుతో ఉత్సవాలు నిర్వహించేవారు. గత 3 ఏళ్లుగా కరోనా కారణంగా చర్చి ఉత్సవాలు జరుగలేదు. ఈసారి పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపడానికి చర్చి పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది.
అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై అందరికీ ఒకే రూల్ ఉండాలని MLA హరీశ్ రావు అన్నారు. HYDలోని HYDRA ఆఫీస్ బుద్ధ భవన్ నాలా కింద ఉందని,కమిషనర్ రంగనాథ్ ముందు దానిని కూలగొట్టాలని అన్నారు.నెక్లెస్ రోడ్డులోని ప్రైవేట్, కమర్షియల్ షాపులు, తదితర వాణిజ్య భవనాలు హుస్సేన్ సాగర్ FTLపరిధిలో ఉన్నాయని వాటిని కూలగొడతారా అని ప్రశ్నించారు. కొందరివి డైరెక్ట్‌గా కూలగొట్టి, మరికొందరికి నోటీసులిచ్చి టైం ఇస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అభివృద్ది కాంక్షను పక్కనబెట్టి, రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్హనీయమని విమర్శించారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (SDF) కింద 33 జిల్లాల్లో మంజూరైన సుమారు రూ.10 వేల కోట్ల విలువ చేసే 34,511 పనులను రద్దు చేయడమే దీనికి నిదర్శనమన్నారు.
సంగారెడ్డి స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో మగ్గం వర్క్ ఉచిత శిక్షణ కోసం సెప్టెంబర్ 3లోగా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత మహిళలు 18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు శిక్షణ కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.
సైబర్ బాధితులకు న్యాయం జరిగేందుకు బ్యాంకర్ల పాత్ర కీలకమని ఎస్పీ రూపేష్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంకు సమాచారం ఇవ్వవద్దని చెప్పారు. సైబర్ నేరాల దర్యాప్తులో పోలీసు అధికారులకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే https://www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.
HYDలోని వినాయక మండపాల నిర్వాహకులకు పోలీసులు కీలక సూచన చేశారు.
➤పర్మిషన్ కోసం ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
➤మీ సేవలో చలాన్ కట్టాలి. (రూ. 145+100)
➤ఐదుగురు ఆర్గనైజర్ల ‘ఆధార్’ అవసరం.
➤మండపం చుట్టుపక్కల ఓనర్ల నుంచి NOC జతచేసి సంబంధిత PSలో సమర్పిస్తే అనుమతి పొందవచ్చు.
➤పర్మిషన్ తీసుకుంటే కరెంట్ FREE అని CM రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. అక్రమంగా కనెక్షన్ తీసుకుంటే చర్యలు తప్పవన్నారు.
SHARE IT
జిల్లాలో ఎయిడ్స్ కేసులు రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయని ఆ శాఖ జిల్లా అధికారి డేనియల్ అన్నారు. సంగారెడ్డిని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేసులు ఎక్కువగా 18 నుంచి 28 సంవత్సరంలోపు వారే ఉన్నారని చెప్పారు. యువత జాగ్రత్తగా ఉండాలన్నారు. జిల్లాలోని వివిధ కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులు నమూనాలను ప్రదర్శించారు.
క్రీడలు శారీరక, మానసిక దృఢత్వానికి ఎంతో తోడ్పాటు అందిస్తాయని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మెదక్ స్టేడియంలో జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉద్యోగులకు చేపట్టిన వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. జిల్లాలో క్రీడలు అభివృద్ధి చేయాలన్నారు. ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు
బహుమతుల ప్రధాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
అంగన్వాడి కేంద్రాల్లో కుళ్లిన గుడ్లు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హెచ్చరించారు. సంక్షేమ శాఖ కమిషనర్ కరుణతో కలిసి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ గురువారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల్లో లబ్ధిదారులకు గ్యారెంటీ సరుకులను మాత్రమే సరఫరా చేయాలని చెప్పారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి, సిడిపివోలు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చెరువుల, నాలాల ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైడ్రాను ప్రతి జిల్లాలో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. ఎంత వారినైనా ఉపేక్షించకుండా ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. గంజాయి సరఫరా చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.
Sorry, no posts matched your criteria.