India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి జిల్లాలోని మెదక్,సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో రెండు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.మెదక్,సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.వాతావరణం మబ్బు పట్టి ఉంటుందని,కొన్నిచోట్ల మోస్తారు వర్షం మరి కొన్నిచోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.

సిద్దిపేట పట్టణం శివాజీ నగర్‌లో ఓ ఇంట్లో వ్యభిచార నడిపిస్తున్నారని సమాచారంతో సిద్దిపేట టాస్క్ ఫోర్స్, వన్ టౌన్ పోలీసుల దాడి చేశారు. ఈ దాడిలో నలుగురి విటులు, ఓ మహిళను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2 వేల నగదు, 6 సెల్ ఫోన్స్, ఓ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు.

మెదక్ జిల్లాలో ప్రస్తుతం గ్రంథాలయ సంస్థ ఛైర్మన్, దేవాదాయ శాఖ, మార్కెట్ కమిటీ, ఆత్మ కమిటీ పాలక మండళ్లు ఖాళీగా ఉన్నాయి. మెదక్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, మంత్రి దామోదర్ రాజనరసింహ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై ఉమ్మడి మెదక్ జిల్లాలో నామినేటెడ్ పదవులు భర్తీ గురించి చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంతో జిల్లాలోని ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఉమ్మడి మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా కూరగాయల రేట్లు కొండెకాయి. ఈ మేరకు మెదక్ జిల్లా వ్యాప్తంగా కొనసాగే గ్రామీణ ప్రాంత సంతలో టమాటా కిలో రూ.50 – 80, బీరకాయలు 60 -70, బెండకాయలు 50 – 80, పచ్చి మిర్చి 80 – 100 వరకు ఉంది.

HYD ప్రజల క్షేమం, భద్రత కోసమే హైడ్రా, మూసీ ఆపరేషన్లు స్టార్ట్ చేశామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. తమ ప్రభుత్వం రూ.కోట్లు కొల్లగొడుతోందని KTR, హరీశ్ రావు ఆరోపణలు అర్థరాహిత్యమని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తే HYD అభివృద్ధిని అడ్డుకున్నట్టే అని వ్యాఖ్యానించారు. ఇష్టానుసారం మాట్లాడుతున్న KTR, హరీశ్ రావును KCR కంట్రోల్ చేయాలని, రాష్ట్ర భవిష్యత్తును వీళ్లు అడ్డుకుంటున్నారన్నారు.

మహిళలు, విద్యార్థినులు, బాలికలు మౌనం వీడి వేధింపులపై షీ టీంకు సమాచారం ఇచ్చి రక్షణ పొందాలని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతి నెల జిల్లాలోని ప్రతి పాఠశాలలు, కళాశాలలలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. షీ టీం వాట్సాప్ నెంబర్ 87126 57963, 63039 23823, పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 87126 57888లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమావాస్య నుంచి తొమ్మిది రోజులు ఆడపడుచులు కలిసి ఆడే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. దేశంలోనే పూల ను పూజించి ప్రకృతిని ప్రేమించే పండుగ అన్నారు. అలాంటి సంస్కృతి తెలంగాణలో ఉందన్నారు.

సంగారెడ్డి పట్టణంలోని నాల్ సాబ్ గుడ్డలో మంగళవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ భాస్కర్ రెడ్డి కథనం ప్రకారం.. మద్యం మత్తులో అన్నషాహిద్(46)ను తమ్ముడు రఫిక్ (40) కల్లు సీసాతో కొట్టి హత్య చేశాడు. తనను, తన భార్యను అన్న సూటిపోటి మాటలతో బాధించేవాడని హంతకుడు రఫిక్ తెలిపారు. పోలీసులు రఫిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

బుధవారం పెత్రమాస అవడంతో ప్రజలు కౌసుపై మక్కువ చూపుతారు. కానీ ఈ సంవత్సరం పెత్రమాసతో పాటు గాంధీ జయంతి రావడంతో అధికారులు జీవహింస చేయరాదని సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొన్ని పట్టణాల్లో ఉ.4 గంటలకు మటన్ షాపులు ఓపెన్ చేసి మటన్ అమ్మారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉ.3 గంటలకె మేకలు, గొర్రెలను కోశారు. పెద్దలకు నైవేద్యంగా పెట్టే మాంసాన్ని ఆచార సంప్రదాయాన్ని మరువలేమని పలువురు అన్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో బతుకమ్మ, దసరా పండుగ సందడి మొదలైంది. రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఈరోజు పాఠశాలల్లో బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులు హాస్టల్ నుంచి స్వగ్రామాలకు వెళ్తుండడంతో రద్దీగా ఏర్పడింది. గ్రామాల్లో బతుకమ్మ పండుగ పురస్కరించుకొని తంగేడు, గునుగు, వివిధ రకాల పూల సేకరణలో నిమగ్నమయ్యారు.
Sorry, no posts matched your criteria.