India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నామినేషన్ల ప్రక్రియ గడువు గురువారంతో ముగిసింది. నేటితో 23 మంది అభ్యర్థులు 36 నామినేషన్లను దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం వరకు 54 మంది అభ్యర్థులు 90 నామినేషన్లను దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి తెలిపారు. శుక్రవారం నామినేషన్లను పరిశీలించనున్నారు.
KCR రాష్ట్రానికి ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అడిగావు కదా.? నిన్న మెదక్‌లో మీ అభ్యర్థి తరఫున నామినేషన్ వేశావంటే దానికి కారణం కేసీఆరే అని హరీశ్‌రావు అన్నారు. BRS ఎంపీ అభ్యర్థికి మద్దతుగా నామినేషన్ వేసేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. పేరుకే మెదక్ జిల్లా ఉండేదని కానీ గతంలో నామినేషన్ వేయడానికి సంగారెడ్డి వెళ్లేవారని అన్నారు. KCR మెదక్‌లో కలెక్టరేట్ కట్టడం వల్ల నామినేషన్ వేశావని గుర్తు చేశారు.
మెదక్, సంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురి హత్యలు జిల్లాల్లో కలకలం రేపుతున్నాయి. కోహిర్ వద్ద ఆటో అద్దె డబ్బులు విషయంలో గొడవ జరిగి జగద్గిరిగుట్టకు చెందిన షేక్ అన్వర్ అలీ(30)ని మిత్రులు దాడి చేసి హతమార్చారు. నర్సాపూర్ ఎర్రగుంట తండాకు చెందిన సక్కుబాయి(48) ప్రవర్తన నచ్చక కొడుకు హంజా హత్య చేశాడు. శెట్‌పల్లి కలాన్‌లో భార్యను కాపురానికి పంపడం లేదని అల్లుడు దశరథ అత్త కౌసమ్మ(50)ను హత్య చేశాడు.
ఇంటర్ ఫలితాల్లో కొండాపూర్ మండలంలోని గిర్మాపూర్ సాంఘిక సంక్షేమ కళాశాలలో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ సుదర్శనం తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 82 మందికి 82, ద్వితీయ సంవత్సరంలో 59కి 59 మంది ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
BRS పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తన పేరిట రూ. 62,84,43,006 ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. అందులో 3 కిలోల పైగా బంగారం, రెండు కిలోల పైగా వెండి ఆభరణాలు ఉన్నాయి. ఇందుర్తిలో రూ. 7.88 లక్షల విలువైన 1.30 ఎకరాల భూమి, ప్లాట్లు ఉన్నాయి. ప్రణీత రెడ్డి పేరిట రూ. 4.48 కోట్ల విలువైన రాజ్‌పుష్ప ఫామ్స్, 3.33 కిలోల బంగారం, 2 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి.
మెదక్ జిల్లా మాసాయిపేటలోని చెట్ల తిమ్మాయపల్లి చౌరస్తా వద్ద రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ రాజ బొల్లారానికి చెందిన బిక్ని(36) మృతి చెందింది. మాసాయిపేట 44వ జాతీయ రహదారిపై చెట్ల తిమ్మాయపల్లి చౌరస్తా వద్ద రోడ్డు దాటుతున్న బిక్నిని హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన ఉద్యోగానుభవాలతో రాసిన పుస్తకాన్ని కౌటిల్య విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించారు. పటాన్‌చెరు మండలం రుద్రారంలో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో డా. దువ్వూరి సుబ్బారావు జస్ట్ ఏ మెర్సెనరీ.? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ పేరుతో ప్రచురించిన ఆంగ్ల పుస్తకావిష్కరణ నిర్వహించారు.
టెక్స్ టైల్స్ డిప్లమా కోర్సుల్లో శిక్షణ పొందడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకుడు సతీష్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రానికి 9 సీట్లు కేటాయించగా అందులో ఒక్క స్థానం ఈ డబ్ల్యూ ఎస్ కేటగిరి వారికి రిజర్వ్ చేశారన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్ లోని జిల్లా చేనేత, జౌళి శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
మచ్చ లేకుండా ఉత్తమ కలెక్టర్‌గా పనిచేశానని BRS MP అభ్యర్థి వెంకటరామిరెడ్డి అన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. 2 సెట్ల నామినేషన్ వేశానని, రేపు మాజీ మంత్రి హరీష్ రావు, BRS అభిమానుల మధ్య రేపు మరో 2 సెట్లు దాఖలు చేస్తానని తెలిపారు. మంచి కలెక్టర్‌గా పని చేసిన నేను మరింత సేవ చేయడానికి ఎంపీగా పోటీ చేస్తున్నానని తనను ప్రజలు ఆశీర్వదించాలన్నారు.
ఇంటర్ ఫలితాల్లో కంగ్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నలుగురు బాలికలు టాపర్‌గా నిలిచారని ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఇందులో సెకండియర్‌కు చెందిన జ్యోతి (BPC)-919/1000, దీపిక (BPC)-876/1000 మార్కులు సాధించారని తెలిపారు. అదేవిధంగా ఫస్టీయర్‌లో ప్రియదర్శిని (BPC) 366/440, సువర్ణ (BPC) 301/440 మార్కులు సాధించినట్లు తెలిపారు. వీరిని ప్రిన్సిపల్ అభినందించారు.
Sorry, no posts matched your criteria.