Medak

News April 25, 2024

నేడు 12 మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలు

image

పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పక్రియలో భాగంగా బుధవారం 12 మంది అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్థులు పి.వెంకట్రామ్ రెడ్డి, ఎ.లక్ష్మణ్, ఊరెళ్ళి ఎల్లయ్య, కమ్మరి లక్ష్మీనారాయణ, చిక్కులపల్లి నవీన్, ఉట్ల రమేష్ , నీలం మధు, జి.ప్రదీప్ కుమార్, ఎటి ఆంజనేయులు, ధర్మారం నరహరి, అనిల్ మొగిలి, దాసరి భాను చందర్‌‌లు నామినేషన్ వేశారని రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు.

News April 25, 2024

మెదక్ ఎంపీ అభ్యర్థిగా దుబ్బాక కౌన్సిలర్ నామినేషన్

image

మెదక్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా దుబ్బాక మున్సిపాలిటీ కౌన్సిలర్ కూరపాటి బంగారయ్య నామినేషన్ దాఖలు చేశారు. దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికలల్లో ఏఐఎఫ్‌బీ పార్టీ తరుపున పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలుపొందారు. గెలిచిన కొన్ని రోజులకే బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ మెదక్ ఎంపీగా నామినేషన్ వేయడం పట్ల పార్టీలో చర్చనీయాంశమైంది.

News April 25, 2024

మెదక్: నామినేషన్ దాఖలు చేసిన వెంకటరామిరెడ్డి

image

మెదక్ లోక్ సభ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి నామినేషన్ మెదక్ కలెక్టరేట్‌లో బుధవారం దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, బట్టి జగపతి, నగేష్ పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News April 25, 2024

ఇంటర్ ఫలితాలు.. మెదక్ విద్యార్థికి 470కి 468 మార్కులు

image

మెదక్ జిల్లా కౌడిపల్లి గ్రామానికి చెందిన గౌడిచర్ల ప్రియాన్ష్ కుమార్ రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాడు. తాజాగా విడుదల చేసిన ఇంటర్మీడియట్ ప్రథమ పరీక్ష ఫలితాల్లో ప్రియాన్ష్ ఎంపీసీలో 470కి గానూ 468 మార్కులు సాధించాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువుల నుంచి అభినందనలు తెలిపారు.

News April 25, 2024

సంగారెడ్డి: రేపటి నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

image

సంగారెడ్డి జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియేట్ పరీక్షలు ఈనెల 25 నుంచి మే 2 వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేయగా, జిల్లావ్యాప్తంగా 6685 మంది హాజరుకానున్నారు. టెన్త్ పరీక్ష కేంద్రాల్లో, ఇంటర్మీడియేట్ 15 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. పదవ తరగతి 2388, ఇంటర్ 4297 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

News April 25, 2024

నామినేషన్ దాఖలు చేసిన వెంకట్రామిరెడ్డి

image

మెదక్ బీఅర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి బుధవారం మొదటి సెట్ నామినేషన్ ను దాఖలు చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, బీఅర్ఎస్ నాయకుడు నగేష్ తో కలసి మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

News April 25, 2024

మెదక్: పెరుగుతున్న ప్రచార వేడి

image

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజాపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరపున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. బుధవారం నుంచి మిగతా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఓవైపు అన్ని పార్టీల ముఖ్య నేతలు ప్రచారం చేస్తూ, మరోవైపు నియోజకవర్గం, మండలాలు, పట్టణాల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు.

News April 25, 2024

ఇంటర్ సెకండియర్.. మెదక్‌కు 33వ స్థానం

image

ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా 65.57 శాతంతో రాష్ట్రంలో 15వ స్థానంలో నిలిచింది. 15,273 మందికి గానూ 10014 మంది పాసయ్యారు. సిద్దిపేట జిల్లా 61.08 శాతంతో 28వ స్థానంలో నిలిచింది. 7361 మందికి 4496 మంది పాసయ్యారు.
మెదక్ జిల్లా 57.49 శాతంతో 33వ స్థానంలో నిలిచింది. 5295 మందికి 3044 మంది ఉత్తీర్ణ సాధించారు.

News April 25, 2024

ఫస్టియర్‌లో సంగారెడ్డికి 18, సిద్దిపేటకు 29వ స్థానం

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా 55.29 శాతం ఉత్తీర్ణతో రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది. 15,989 మందికి గానూ 8840 మంది పాసయ్యారు. సిద్దిపేట జిల్లా 48.77 శాతంతో 29వ స్థానంలో నిలిచింది. 7541 మందికి 3678 మంది పాసయ్యారు. మెదక్ జిల్లా 47.18 శాతంతో 30వ స్థానంలో నిలిచింది. 5905 మందికి 2786 మంది ఉత్తీర్ణత సాధించారు.

News April 25, 2024

సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీలోకి కేసీఆర్ సన్నిహితుడు…?

image

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ సన్నిహితుడు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మడుపు భూంరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా పార్టీపై అలకగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలానికి చెందిన భూంరెడ్డి గతంలో హౌజింగ్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. నేడో, రేపో చేరే అవకాశం ఉందని టాక్.