Medak

News April 1, 2024

జహీరాబాద్‌లో BRS గెలుపు ఖాయం: హరీశ్‌రావు

image

జహీరాబాద్ పార్లమెంట్ పరిధి ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థాయి BRS కార్యకర్తల సమావేశం లింగంపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేశారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే సురేందర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడుతూ.. జహీరాబాద్‌లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు.

News March 31, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాకు ఆరెంజ్ ALERT

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లలో ఈరోజు మధ్యాహ్నం ఉష్ణోగ్రత వివరాలు.. సదాశివపేట 41.1, కొండాపూర్ 41.0, ధూల్మిట్ట 40.8, నిజాంపేట 40.7,చేగుంట, పటాన్‌చెరు, సిద్దిపేట 40.6, దౌల్తాబాద్ 40.5, పాశమైలారం, పాతూర్, నారాయణఖేడ్ 40.2, దామరంచ 40.1 సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. 

News March 31, 2024

MDK: BRS, కాంగ్రెస్‌ని నమ్మకండి: రఘునందన్‌రావు

image

BRS, కాంగ్రెస్‌ని ప్రజలు నమ్మొద్దని, వాటికి ఓటేసి మోసపోవద్దని BJP మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. BRS, కాంగ్రెస్ పార్టీలు ఒకటే అని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని తెలిపారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

News March 31, 2024

MDK: ‘ఒక్క అవకాశం ఇవ్వండి.. ప్లీజ్’

image

ప్రజలు దయచేసి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, సేవ చేస్తానని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి పి.వెంకట్రామారెడ్డి అన్నారు. ఈరోజు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయిలాపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్‌గా సేవ చేసి, మంచి పేరు తెచ్చుకున్నానని, ప్రజా సేవలో ఒక అవకాశం కల్పించాలని కోరారు. 11 ఏళ్లు మెదక్ జిల్లా గడ్డ మీదనే పనిచేశానని, ఇది తన అదృష్టమన్నారు. ఉమ్మడి జిల్లా పీడీగా, జాయింట్ కలెక్టర్‌గా పనిచేశానని తెలిపారు.

News March 31, 2024

కొమురవెల్లికి పోటెత్తిన జనం 

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న తరుణంలో పదకొండవ ఆదివారం మల్లన్న క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. జానపదుల జాతరకు పెట్టింది పేరు కొమురవెల్లి మల్లన్న జాతర.. పట్నాలు, బోనాలు, డోలు చప్పుళ్లు, ఢమరుక నాథాలు, శివసత్తుల శిగాలు, పోతరాజుల విన్యాసాలు జాతరలో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. పోలీసులు భారీగా బందోబస్తు చేపట్టారు. 

News March 31, 2024

సంగారెడ్డి: అసైన్డ్‌ భూములు.. పట్టాభూములుగా రికార్డుల్లో మార్పులు !

image

పంటలు పండించుకుని జీవనాధారం పొందేందుకు పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములు అవి. క్రయ విక్రయాలు, వ్యవసాయేతర పనులు చేయడానికి వీల్లేనివి. కానీ ధరణి పోర్టల్‌లో ఆ భూముల రికార్డులను తారుమారు చేశారు. అసైన్డ్‌ భూములను పట్టా భూములుగా మార్చేశారు. కంది మండలం పరిధిలోని 11 గ్రామాల్లో 518 ఎకరాల అసైన్డ్‌ భూములను పట్టా భూములుగా రికార్డులను మార్చేశారు.

News March 31, 2024

సిద్దిపేట: కాసుల కోసం అనవసర స్కానింగ్‌లు, టెస్టులు !

image

అన్ని రంగాలతో పాటు వైద్యం కూడా వ్యాపారంగా మారింది. వైద్యులు ఆస్పత్రిని ఏర్పాటు చేసి నిర్వహించేవారు. సిద్దిపేటలో మాత్రం మేనేజ్‌మెంట్‌కు వైద్యం సంబంధం లేకున్నా ఆస్పత్రిని ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల నుంచి వైద్యులను తీసుకొచ్చి కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 158 ఆస్పత్రులు ఉంటే.. అందులో సగం వరకు వైద్యంతో సంబంధంలేని వారే నిర్వాహకులుగా ఉన్నారు. కాసుల కోసం అనవసర టెస్టులు, స్కానింగ్‌లు చేస్తున్నారు.

News March 31, 2024

పటాన్‌చెరు: గృహిణి ఆత్మహత్య.. ఆరుగురిపై కేసు నమోదు

image

అత్తగారింట్లో వేధింపులు భరించలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. అమీన్పూర్ సీఐ నాగరాజు తెలిపిన వివరాలు.. జంగంపేటకు చెందిన నసీమాబేగం(29)కు అమీన్పూర్ వాసి పాషాతో 2017లో వివాహమైంది. ఇటీవల అత్తారింటిలో మానసికంగా వేధింపులు ఎక్కువయ్యాయి. పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. అయినా ఫలితం లేకపోవడంతో నసీమా శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. తల్లి కరీంబి ఫిర్యాదుతో ఆరుగురిపై కేసునమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

News March 31, 2024

MDK: మండుతున్న భానుడు.. నిర్లక్ష్యం చేయొద్దు !

image

ఉమ్మడి జిల్లాలో భానుడు సుర్రుమనిపిస్తున్నాడు. మార్చిలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న నిజాంపేటలో 42.1డిగ్రీలు నమోదైంది. అత్యవసరమయితేనే బయటకెళ్లాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వడదెబ్బకు గురైనా, వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడుతున్నా వెంటనే ఆస్పతులకు వెళ్లాలని నిర్లక్ష్యం చేయొద్దని వైద్యాధికారిణి గాయత్రీదేవి తెలిపారు. ఆస్పత్రుల్లో మందులు, ORSప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

News March 31, 2024

సువిధా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా అనుమతి: కలెక్టర్

image

సువిధా ఆన్‌లైన్ పోర్టల్‌లో ధరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సాధార‌ణ ఎన్నికల నియమావళిలో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్ధులకు కీలక సూచన చేశారు. పబ్లిక్ మీటింగ్‌లు, ర్యాలీలు, వివిధ ప్రచార వాహనాలు, తాత్కాలిక పార్టీ కార్యాలయాలు, మైక్‌లు, లౌడ్ స్పీకర్లు, బారీకేడ్స్ , హెలికాప్టర్ లాండింగ్ తదితర ప్రచార అనుమతులు పొందవచ్చన్నారు. SHARE IT