Medak

News March 30, 2024

MDK: భార్య మందలింపు.. భర్త సూసైడ్

image

చిలిపిచేడ్ మం. బండపోతుగల్‌లో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన సయ్యద్ ఇస్మాయిల్ మద్యానికి బానిసయ్యాడు. మద్యం మానేసి ఏదైనా పని చేసుకోవాలని భార్య నదియా బేగం మందలించింది. ఈ మనస్థాపంతో‌ ఇస్మాయిల్ ఈ నెల 29న పురుగుల మందు తాగాడు. తీవ్ర అస్వస్థకు గురికాగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 30, 2024

మెదక్: కాంగ్రెస్ పార్టీలో చేరికకు 5న ముహూర్తం

image

నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, తెలంగాణ ఫుడ్స్ మాజీ ఛైర్మన్ గంగుమళ్ల ఎలక్షన్ రెడ్డి ఏప్రిల్ 5న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం ఇరువురు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మరికొంత మంది BRS నేతలు, అనుచరులతో కలిసి 5న గాంధీభవన్‌లో హస్తం కండువా కప్పుకోనున్నట్లు‌ కాంగ్రెస్‌ శ్రేణులు తెలిపాయి. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

News March 30, 2024

మెదక్: రఘునందన్ రావుపై ఈసీకి ఫిర్యాదు

image

బీఆర్ఎస్ నేతలపై మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌కు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. హైదరబాద్‌లోని ఈసీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రఘునందన్ రావు పై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. పరుష పదజాలంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలిపారు. కార్యక్రమంలో కాసాల బుచ్చిరెడ్డి ఉన్నారు.

News March 30, 2024

కత్తిమీద సాములా మెదక్ MP స్థానం..!

image

మెదక్ పార్లమెంట్ బరిలో BRS తరఫున వెంకట్రామిరెడ్డి, BJP నుంచి రఘునందన్రావు, కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు తలపడనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా కావడంతో గులాబీ శ్రేణులు, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో హస్తం నేతలు, ఈసారైనా దక్కించుకోవాలని బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు. కామెంట్ చేయండి

News March 30, 2024

సిద్ధిపేట: ఐదు నెలల గర్భిణీ మృతి

image

అక్కన్నపేట మండలం పంతులు తండాలో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఐదు నెలల గర్భిణీ లావణ్య(అనిత) తీవ్ర అనారోగ్యంతో హైదరాబాదులోని గాంధీ ఆసుత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అనారోగ్య పరిస్థితిలో ముందస్తుగా ప్రసవించిన లావణ్యతో పాటు నెలలు నిండకుండా జన్మించిన ఇద్దరు నవజాత శిశువులు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

News March 30, 2024

పటాన్ చెరు: తల్లికి మాత్రలు తెచ్చేందుకు వెళ్లి విద్యార్థి మృతి

image

తల్లికి మాత్రలు తెచ్చేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన పటాన్ చెరులో జరిగింది. సీతారామపురం కాలనీలో ఉంటున్న సుదీప్ పట్నాయక్(15) పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి బాలుడి తల్లికి మాత్రలు తెచ్చేందుకు బైక్‌పై వెళ్లాడు. పెట్రోల్ బంకు వెళ్లి పెట్రోల్ పోయించుకుని తిరిగి వస్తుండగా ముందు వెళ్తున్న వాహనాన్ని బైక్ ఢీకొన్నాడు దీంతో బాలుడు మృతి చెందాడు.

News March 30, 2024

మెదక్: గతం ఏకపక్షం.. ఈసారి త్రిముఖ పోరు..!

image

BRS, కాంగ్రెస్, BJP మెదక్ ఎంపీ అభ్యర్థుల ప్రకటనతో ఉమ్మడి జిల్లాలలో ఒక్కసారి రాజకీయం వేడెక్కింది. ఇక్కడ గతంలో 3సార్లు జరిగిన ఎన్నికల్లో ఫలితాలన్ని ఏకపక్షమని చెప్పొచ్చు. ఇక్కడ జాతీయ పార్టీలు ఎన్ని వ్యూహాలు పన్నినా.. ప్రాంతీయ పార్టీ హవానే సాగింది. అయితే ప్రస్తుత ఎంపీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వేళ ఏకపక్ష పోరు అసాధ్యమే అని త్రిముఖ పోరు తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. 

News March 30, 2024

మెదక్: ‘ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి ముద్దాయి హరీశ్ రావు’

image

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి ముద్దాయి మాజీ మంత్రి హరీశ్ రావు అని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. శుక్రవారం మెదక్‌లో మాట్లాడుతూ.. దుబ్బాక ఉపఎన్నికల సమయంలో తనతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసి ఇబ్బందుకు గురి చేశారని మండిపడ్డారు. అబద్దాలు ఆడటంలో మామను మించిన వ్యక్తి హరీశ్ రావు అని.. ఆయన నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే సిద్దిపేట ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

News March 30, 2024

‘మెదక్ ప్రజల ఆశ, శ్వాసగా పనిచేస్తా.. గెలిపించండి’

image

మెదక్ ప్రజల ఆశ, శ్వాసగా పనిచేస్తామని రఘునందన్ రావు తెలిపారు. ఇందిరా గాంధీ హామీ ఇచ్చి నాలుగు దశాబ్దాలుగా కానీ పనులు ఐదేండ్లలో మోదీ నేతృత్వంలో చేసి చూపించామన్నారు. పార్టీ ఎమ్మెల్యే, ఎంపిలు లేకున్నా మెదక్ రైలు, మెదక్ మీదుగా జాతీయ రహదారులు, అనేక పనులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మెదక్ ఆత్మగౌరవాన్ని కాపాడేలా పనిచేస్తా అన్నారు. మెదక్ ఎన్నిక ఏకపక్షమని రఘునందన్ రావు పేర్కొన్నారు.

News March 29, 2024

మెదక్ సీటును సోనియా గాంధీకి బహుమతిగా ఇస్తాం: నీలం మధు

image

మెదక్ ఎంపీ సీటు గెలిచి సోనియా గాంధీకి బహుమతిగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీని నీలం మధు మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలిశారు. ఇందిరాగాంధీ లాంటి మహోన్నత నేత ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానాన్ని తనకు కేటాయించడం పట్ల కాంగ్రెస్ అధిష్ఠానానికి రుణపడి ఉంటానని చెప్పారు.