Medak

News June 23, 2024

మెదక్: మంత్రి కొండా సురేఖను కలిసిన జిల్లా నేతలు

image

తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ, మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖను నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జీ పిసిసి ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ సమస్యలు, నియోజకవర్గ అభివృద్దికి నిధుల కేటాయింపు గురించి చర్చించారు. వారితో నాయకులు మైనంపల్లి హనుమంతరావు, ఆంజనేయులు గౌడ్, ఎలక్షన్ రెడ్డి ఉన్నారు.

News June 22, 2024

సిద్ధిపేట: సీఎంకు లేఖ రాసిన హరీష్ రావు

image

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకుల డిమాండ్ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు గ్రూప్ -2, గ్రూప్-3 పోస్టులను పెంచి పరీక్షలు నిర్వహించాలని లేఖలో కోరారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై కార్యాచరణ ప్రకటించాలన్నారు.

News June 22, 2024

సిద్దిపేట: ధరణి పేరుతో చేసిన మోసాలు బయటపెడతా: ఎంపీ

image

మొదట కలెక్టర్‌గా చేసి అనంతరం ప్రజాప్రతినిధిగా మారిన వెంకట్రామిరెడ్డి ధరణి పేరుతో చేసిన మోసాలు బయటపెడతానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. ఓ గెస్ట్ హౌస్‌లో ఉండి వివాదాస్పద ల్యాండ్‌ను తన నియంత్రణలోకి తెచ్చుకున్నారని, లావణి పట్టా భూముల్లో నిరుపేదలను బెదిరించి భూములు కొని.. కంపెనీల పేరుతో లాక్కున్నారని చెప్పారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు పెండింగ్ చెక్కులను క్లియర్ చేయించే ప్రయత్నం చేస్తానన్నారు

News June 22, 2024

మెదక్: ఆరుద్ర కార్తె వచ్చినా.. వానల కోసం ఎదురుచూపులాయే!

image

ఆరుద్ర కార్తె వచ్చినా.. వానల కోసం రైతన్నలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆశించినంత మేర వానలు పడకపోవడంతో ఇప్పటి వరకు చాలామంది రైతులు వరినార్లు పోయలేదు. ఈనెల మొదటి వారం నుంచే వరి పంట పండించే రైతులు నార్లు వేసే పనిలో నిమగ్నమయ్యేవారు. కానీ ఇప్పటివరకు ప్రక్రియ మొదలుకాలేదు. దీంతో ఈ యేడు వరి నాట్లు ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

News June 22, 2024

మెదక్: మహిళా కడుపు నుంచి 7.50 కిలోల కణతి తొలగింపు

image

మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అరుదైన చికిత్స నిర్వహించారు. పట్టణానికి చెందిన పుట్టి యశోద అనే మహిళ గత ఆరు నెలలుగా కడుపులో కణతితో బాధపడుతుంది. స్థానికంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేసుకోగా అనస్తీషియా డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ హేమరాజ్ సింగ్ ఆపరేషన్ నిర్వహించి ఆమె కడుపులో నుండి 7.50 కిలోల కణతి తొలగించారు.

News June 22, 2024

రైతు రుణమాఫీ చరిత్రాత్మక ఘట్టం :మంత్రి పొన్నం

image

రైతు రుణమాఫీ చరిత్రాత్మక ఘట్టమని హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి వ్యవసాయాన్ని పండగ చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. రైతు బిడ్డగా, రాష్ట్ర మంత్రిగా రైతన్నకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వ్యవసాయం పండుగలా, రైతే రాజు అనే నినాదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తోందన్నారు.

News June 22, 2024

కొమురవెల్లి మల్లన్న హాల్ట్‌స్టేషన్‌కు మోక్షమెప్పుడో!

image

కొమురవెల్లి మల్లన్న హాల్ట్‌స్టేషన్ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వచ్చే డిసెంబరులో జరిగే మల్లన్న కళ్యాణంలోగా అందుబాటులోకి తెస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పి నాలుగు నెలలు గడుస్తున్నా నేటికి పనులు ప్రారంభం కాలేదు. దీంతో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎన్నో ఒడిదుడుకుల మధ్య స్టేషన్ మంజూరైందని సంతోషించిన ప్రజలకు పనులు ప్రారంభానికి నోచుకోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

News June 22, 2024

మెదక్: ఉమ్మడి జిల్లాలో రుణమాఫీ లబ్ధిదారులు వీరే!

image

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. శుక్రవారం వాటి విధివిధానాలను ప్రకటించింది. ఉమ్మడిజిల్లాలో రైతుల వివరాలిలా ఉన్నాయి. మెదక్‌లో 1,48,218 మంది రైతులు రూ.828 కోట్ల రుణం తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో 1,79,322 మంది రైతులకు రూ. 2505.52 కోట్ల అప్పు మాఫీ కానుంది. సిద్దిపేట జిల్లాలో 1.75లక్షల మంది రైతులకు సుమారు రూ.2,600 కోట్ల బకాయిలు తీరనున్నాయి.

News June 22, 2024

ఓయూ: జులై 6వ తేదీ నుంచి సీపీజీఈటీ పరీక్షలు

image

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో అన్ని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీజీఈటీ – 2024 పరీక్షలను జులై 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి HYDలో తెలిపారు. ఈ పరీక్షలను రోజూ మూడు సెక్షన్లలో నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను జులై మూడో తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. SHARE IT

News June 22, 2024

బస్సు పాస్ కోసం User ID, Password పొందాలి: RM

image

విద్యార్థుల బస్సు పాసుల కోసం యూజర్ ఐడీ, పాస్వర్డ్ పొందాలని ఆర్టీసీ RM ప్రభులత తెలిపారు. ఉమ్మడి జిల్లాలో విద్యాసంస్థలు తెరుచుకున్న సందర్భంగా బస్సు పాసుల కోసం సంగారెడ్డి రీజనల్‌లోని 8 డిపోల్లో అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. బస్సు పాసుల కోసం విద్యార్థులు వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, వాటిని కళాశాలల యాజమాన్యం అప్రూవల్ చేయాలన్నారు. తర్వాత బస్సు పాస్ పొందవచ్చని అన్నారు.

error: Content is protected !!