Medak

News April 20, 2024

మెదక్: తప్పుడు పత్రాలతో ఫ్లాట్ రిజిస్ట్రేషన్.. మరో ఇద్దరు అరెస్టు

image

మనోహరాబాద్ మండలం కూచారం శివారులో తప్పుడు ధ్రువపత్రాలతో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసిన కూకట్‌పల్లికి చెందిన వీరపనేని మధుసూదన్ రావు(50), హైదరాబాద్ కు చెందిన వెంకటేశ్వర్లు(48)ను అరెస్టు చేసినట్లు ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 13న సత్యనారాయణమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. ఈనెల 7న ఇదే కేసులో కందవల్లి రాజేష్(34)ను అరెస్టు చేసినట్లు ఎస్సై చెప్పారు.

News April 20, 2024

సిద్దిపేట: ‘అభ్యర్థుల ఎన్నికల వ్యయాలను పగడ్బందీగా లెక్కించాలి’

image

లోకసభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయాలను పగడ్బందీగా లెక్కించాలని మెదక్ పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు సునీల్ కుమార్ రాజ్వన్సీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం లోక్సభ ఎన్నికల వ్యయ పరిశీలకులు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం సందర్శించి ఎక్సైజ్ , ఇన్కమ్ టాక్స్ అధికారులు ఎన్నికల అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లతో సమావేశం నిర్వహించారు.

News April 20, 2024

24న జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్

image

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఈనెల 24న నామినేషన్ వేస్తున్నట్లు శుక్రవారం తెలిపారు. కావున జహీరాబాద్, నారాయణఖేడ్, జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

News April 19, 2024

మెదక్ లోక్ సభ.. 4 సార్లు MPగా బాగారెడ్డి !

image

మెదక్ లోక్ సభ 1952లో ఏర్పడగా.. కాంగ్రెస్ పార్టీ అత్యధిక సార్లు గెలుపొందింది. ఇక్కడ 18సార్లు ఎన్నికలు జరగ్గా.. PDF, TPS, BJP, TDPలకు ఒకే ఒకసారి అవకాశం దక్కింది. కాంగ్రెస్ అభ్యర్థులు 9 సార్లు ఎంపీగా గెలుపొందారు. వీరిలో బాగారెడ్డి అత్యధిక సార్లు ఎన్నికవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి చెందిన బాగారెడ్డి 1989లో గెలుపొంది వరుసగా 4 సార్లు విజయం సాధించారు. 2004 నుంచి BRS వరుసగా గెలిచింది.

News April 19, 2024

రాజకీయ కుట్రదారులకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు: వెంకట్రామారెడ్డి

image

సిద్దిపేట జిల్లాలోని 106 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడం శుభ పరిణామమని మెదక్ BRS ఎంపీ అభ్యర్థి వెంకట్రామారెడ్డి అన్నారు. రాజకీయ కుట్రదారులకు హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చిందని అన్నారు.వాస్తవాలు ఎప్పటికైనా తెలుస్తాయని, స్వార్థ బుద్ధితో 106 కుటుంబాల్లో దుఃఖం నింపినప్పటికీ ధర్మమే గెలిచిందని అభిప్రాయపడ్డారు.

News April 19, 2024

MDK: బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

image

మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని ఒక గ్రామంలో బాల్య వివాహాన్ని పోలీసులు అధికారులు అడ్డుకున్నారు. ఒక గ్రామంలో బాలికకు వివాహం చేస్తున్నారంటూ టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం వచ్చింది. వెంటనే గ్రామానికి చేరుకున్న ఎస్సై మహమ్మద్ గౌస్.. బాలికను పోలీస్ స్టేషన్ తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. బాలికకు వివాహం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 19, 2024

మెదక్‌లో సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి సురేఖ

image

మెదక్ పట్టణంలో ఈనెల 20న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి కొండా సురేఖ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. సీఎస్ఐ గ్రౌండ్ లో హెలిపాడ్ పరిశీలించారు. గ్రౌండ్ నుండి కలెక్టరేట్ అక్కడి నుండి రాందాస్ చౌరస్తా వరకు నిర్వహించే రోడ్ షో, మీటింగ్ గురించి స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు. వెంట మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సుప్రభాతారావు, రమేశ్ రెడ్డి, జీవన్ రావు ఉన్నారు.

News April 19, 2024

కొండపాక: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

image

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారం మేరకు.. హైవే పై స్కూటీని టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జనగామ జిల్లా బచ్చన్నపేట వాసి ఆశోక్(70) స్పాట్లోనే చనిపోయాడు. సమాచారం అందుకున్న కుకునూర్‌పల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు.

News April 19, 2024

గజ్వేల్: కేసీఆర్ ఇలాకాపై పార్టీల ఫోకస్

image

మెదక్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల దృష్టి గజ్వేల్ అసెంబ్లీ స్థానంపైనే కేంద్రీకృతమైంది. కేసీఆర్ సొంత ఇలాకా కావడంతో పట్టు నిలుపేందుకు బీఆర్ఎస్ ఎక్కువ ఓట్లు కొల్లగొట్టి కేసీఆర్‌ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మెజార్టీ సాధించి గెలుపునకు బాటలు వేసుకోవాలనే అభ్యర్థులు ఆరాటపడుతున్నారు. పార్టీల ముఖ్య నేతలు ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు.

News April 19, 2024

BJP అభ్యర్థి రఘునందన్‌రావు ఆస్తుల వివరాలు

image

మెదక్ ఎంపీ BJPఅభ్యర్థి రఘునందర్ రావు‌కు రూ.21.07కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. చరాస్తులు రూ.9.13కోట్లు, స్థిరాస్తులు రూ.12.94కోట్లుగా చూపించారు. రూ.12.11కోట్లు రుణాలు. 28 కేసులు ఉన్నాయన్నారు. చేతిలో రూ.2.5లక్షల నగదు, బ్యాంకులో రూ.5.2కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత అడ్వాన్సు రూ.3.14కోట్లు ఇచ్చారన్నారు. 14తులాల బంగారం, ఓ నెక్లస్. 46.25ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లండిచారు.