India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లా కలెక్టరేట్లో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రేపు నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీగా వెళ్లనున్నారని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ ర్యాలీలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. కావున బీజేపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు మెదక్‌కు తరలి రావాలని రఘునందన్ రావు కోరారు.
గద్వాల్ పట్టణానికి చెందిన శ్రీ రామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో 25 కోట్ల లిఖిత శ్రీరామ నామాలతో సీతారాములకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు రామకోటి రామారాజు అద్దాల మందిరం వద్ద రామనామస్మరణతో ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా రామనామ స్మరణ చేస్తే ఆనందం లభిస్తుందని రామకోటి రామరాజు పేర్కొన్నారు.
వ్యవసాయ కుటుంబం నుంచి IASగా నిలిచి తల్లిదండ్రుల కష్టాన్ని సగర్వంగా నిలిచేలా చేశాడు. వైఫల్యాలు వెక్కిరించినా ఐదో ప్రయత్నంలో IAS సాధించాడు కొండపాకకు చెందిన అఖిల్. తండ్రి నరేష్ వ్యవసాయం చేస్తూ పెద్ద కొడుకు అఖిల్‌ను ఉన్నత చదువులు చదివించాడు. 2018లో ఇంజనీరింగ్ అయిపోగానే ఇంటి నుంచే సివిల్స్‌కు ప్రిపేర్ అయి 2019,20, 22లో నిరాశ ఎదురైనా 2021లో IPS సాధించాడు. 2023లో IAS సాధించి లక్ష్యాన్ని ముద్దాడాడు.
మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడింది. పోలీసుల వివరాలు.. సంగారెడ్డి జిల్లా ఆరుట్లకు చెందిన రాములు 2019లో చేవెళ్ల బస్టాండులో ఉన్న గండీడ్ మండలం నంచర్లకు చెందిన అంజులమ్మను బైక్ పై ఎక్కించుకున్నాడు. పటాన్చెరు మండలం లక్డారం శివారులో ఆమెను హత్య చేసి నగలు ఎత్తుకెళ్లాడు. ఈఘటనపై తాజాగా సంగారెడ్డి కోర్టు నిందితుడికి శిక్ష విధించింది. నిందితుడు 2003-19లో 10 హత్యలు, చోరీలు చేసినట్లు విచారణలో తేలింది.
సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు మెదక్ లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈనెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 25 వరకు స్వీకరిస్తామన్నారు. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు.
మెదక్ జిల్లాకు CM రేవంత్ రెడ్డి రానున్నారు. శామీర్‌పేటలో మంగళవారం రాత్రి PCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మల్కాజిగిరి మాజీ MLA మైనంపల్లి, ఎంపీ అభ్యర్థి నీలం మధు, డీసీసీ ప్రెసిడెంట్లు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మండల, బ్లాక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులతో మంత్రి కొండా సురేఖ సమావేశమయ్యారు. నీలం మధు ఏప్రిల్ 20న నామినేషన్ వేస్తారని.. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు.
డబ్బుల కోసం భార్యతో గొడవపడి సొంతింటికి భర్త నిప్పు అంటించి దహనం చేశాడు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. సిద్దిపేట గ్రామీణ ఠాణా ఎస్సై అపూర్వరెడ్డి వివరాలు.. నారాయణరావుపేటకు చెందిన నర్సింలు, రేణుక భార్యాభర్తలు. నర్సింలు కుటుంబ సభ్యుల బాగోగులు పట్టించుకోవడంలేదని గొడవలు రావడంతో రేణుక పిల్లలను తీసుకొని వెళ్లిపోయింది. దీంతో కోపోద్రిక్తుడైన నర్సింలు సొంతింటికి నిప్పు అంటించాడు.
సిద్దిపేట శివారు నాగులబండ వద్ద ఓ హోటల్ వినియోగదారుడు భోజనం చేస్తుండగా అన్నంలో గాజు ముక్క వచ్చింది. ఈ విషయం నిర్వాహకులకు చెప్పగా వాళ్ళు బుకాయించే ప్రయత్నం చేశారు. దీంతో ఆహార భద్రత అధికారులకు వినియోగదారుడు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి తనిఖీ చేశారు. గాజు ముక్క, బియ్యం నమూనాలను స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆహార భద్రత అధికారి అనూష వెల్లడించారు.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లికి చెందిన కె. అర్పిత నిన్న విడుదలైన సివిల్ సర్వీస్ ఫలితాల్లో 639 ర్యాంకు సాధించారు. తండ్రి అమర్ సింగ్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో సీనియర్ మేనేజర్ గా పని చేస్తుండగా.. తల్లి రేణుక సదాశివపేట రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ర్యాంకు సాధించడం పట్ల నర్సంపల్లి వాసులు హర్షం వ్యక్తం చేశారు.
మెదక్ ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే పోరాడి తెలంగాణను సాధించానని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఎన్ని జన్మలెత్తినా మెదక్ ప్రజల రుణం తీర్చుకోలేనన్నారు. ఈ గడ్డలో పుట్టిన తాను మెదక్ ప్రజల ఆశీర్వాదం వల్ల కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి అయ్యాయని గుర్తు చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.