India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎంపీ ఎన్నికల సందర్భంగా మెదక్ సెగ్మెంట్ కు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. ఎర్రోళ్ల శ్రీనివాస్(సంగారెడ్డి), మాజీ ఎమ్మెల్సీ వి.భూపాల్ రెడ్డి(పటాన్చెరు), MLC-యాదవరెడ్డి(నర్సాపూర్), డీసీసీబీ చైర్మన్
చిట్టి దేవేందర్ రెడ్డి(మెదక్), మనోహార్ రావు(దుబ్బాక), జడ్పీ చైర్మన్ రోజాశర్మ(గజ్వేల్), ఫారుఖ్ హుస్సేన్(సిద్దిపేట)కు నియమించారు.
వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అని ప్రజలు అంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. చౌటకూరు మండలం సుల్తాన్ పూర్ మంగళవారం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. 100 రోజుల్లో 6గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. ప్రచారానికి కాంగ్రెస్ నాయకులు వస్తే చెప్పు, చీపుర్లు పట్టాలని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని కోరారు.
జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని చెప్పారు. కాంగ్రెస్ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. సమావేశంలో అభ్యర్థి సురేష్ షెట్కార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
దుబ్బాక ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం చేసిన రఘునందన్ రావు ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని, మెదక్ గడ్డ మీద గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. చేగుంట మండలం వడియారంలో చేగుంట, నార్సింగి మండలాల పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డితో కలిసి మాట్లాడారు.
సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రానికి చెందిన బుద్ది అఖిల్ యాదవ్ UPSC-2023 ఫలితాల్లో సత్తా చాటారు. ఆలిండియా స్థాయిలో 321 ర్యాంకుతో విజయ ఢంకా మోగించారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అఖిల్.. ఇప్పటికే ఆలిండియా సివిల్ సర్వీసెస్‌కు ఎంపికై IPSగా ఢిల్లీలో పనిచేస్తున్నారు. అఖిల్ తాజాగా IASగా ఎంపికయ్యారు. -CONGRATS
మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతనశెట్టిపల్లి శివారులోని మంజీరా బ్రిడ్జి కింద గుర్తుతెలియని వ్యక్తి మృతిదేహం లభ్యమైంది. మంజీరాలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు ఎవరు..? ఎలా చనిపోయాడు అనేది తెలియాల్సి ఉంది.
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలను చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ఇన్‌ఛార్జీలను ప్రకటించింది. మెదక్ లోక్ సభ ఇన్‌ఛార్జీగా గుర్రం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ ఇన్‌ఛార్జీగా మదిలాల్ విలాస్ రావులను నియమిస్తూ టీపీసీసీ సేవాదళ్ ప్రెసిడెంట్ మద్దెల జితేందర్ నేడు ఉత్తర్వులు విడుదల చేశారు.
త్వరలో టెన్త్, ఇంటర్ వార్షిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో విద్యార్థులకు తల్లిదండ్రులు, సమాజం అండగా నిలవారని నిపుణులు అంటున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని, ఫెయిల్ అయ్యారని కారణంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా వారిని ఓ కంట కనిపెట్టాలన్నారు. వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించాలని ఒకవేళ ఫెయిల్ అయితే వృత్తి నైపుణ్య కోర్సుల వైపు ప్రోత్సహిస్తూ.. సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేస్తూ భరోసా కల్పించాలన్నారు.
మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఈనెల 18న నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ సందర్భంగా మెదక్ పట్టణంలో సుమారు 50 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం సన్నాహాలు చేస్తుంది. మెదక్ పట్టణంలో ఈ ర్యాలీ కోసం ఇప్పటికే ఏఆర్ఓకు దరఖాస్తు చేసినట్లు సమాచారం. నామినేషన్ సందర్భంగా పార్టీ బలం నిరూపించేలా పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. కార్యక్రమానికి మంత్రులు హాజరు కానున్నారు.
సదాశివపేటలో మనస్తాపంతో బాలిక ఆత్మహత్య చేసుకుంది. CI మహేష్‌గౌడ్ తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన బాలిక(17) బీఫార్మసీ చదువుతోంది. ఆమె పలు కారణాలతో 2 నెలలుగా మానసిక వేదనతో ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఊరేసుకుంది. ‘నా చావుకు ఎవరు కారణం కాదు’ అని లేఖలో పేర్కొన్నట్లు సీఐ చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
Sorry, no posts matched your criteria.