India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెరువు శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై దాన్యం అరబోయడంతో కోళ్ల లోడుతో వెళ్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న కోళ్లు మృత్యువాత పడగా డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దని అధికారులు అవగాహన కల్పించినప్పటికీ రైతులు ధాన్యం ఆరబోయడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరోవైపు సోమవారం వరకు కొత్త ఓటర్ నమోదుకు అవకాశం కల్పించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వందలాది మంది యువత ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే ఓటర్ జాబితాను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఓటర్లకు ఎలాంటి సందేహం ఉన్నా నివృత్తి చేసుకునేలా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట చేతికొచ్చే సమయంలో రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సకాలంలో పంటను కోసి సరైన నాణ్యత ప్రమాణాలు పాటిస్తే విపణిలో మంచి ధర పలుకుతుందని సిద్దిపేట తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రం కోఆర్డినేటర్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జక్కుల విజయ్ సూచిస్తున్నారు. ప్రస్తుతం కూలీల కొరత వేధిస్తున్న నేపథ్యంలో యంత్రాలు వినియోగిస్తే తక్కువ సమయంలో కోత చేసుకోవచ్చని అన్నారు.
మెదక్ జిల్లా నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గన్ని సంచులకు గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. సోమవారం మధ్యాహ్నం దాన్యం కొనుగోలు కేంద్రాలు వద్ద గన్ని సంచులను నిల్వ చేశారు. మధ్యాహ్న సమయంలో గుర్తు తెలియని దుండగులు గన్ని బ్యాగులకు నిప్పు పెట్టడంతో దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న సొసైటీ చైర్మన్ బాదే చంద్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
HYD కూకట్‌పల్లి PS పరిధి ప్రకాశ్‌నగర్‌లో మెదక్ వాసి సూసైడ్ చేసుకొన్నాడు. సోమవారం రమేశ్(20) అనే డెలివరీ బాయ్ ఆత్మహత్య చేసుకొన్నాడు. SI రామకృష్ణ వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా సీతారాంనగర్‌కి చెందిన రమేశ్ ప్రకాశ్‌నగర్‌లో నివాసం ఉంటూ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఇంట్లో పరిస్థితులు, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
గుండెపోటుతో ఆర్టీసీ కంట్రోలర్ మరణించిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. మెదక్ డిపోలో కంట్రోలర్‌గా పనిచేస్తున్న ఎండి. ఆరిఫ్ (55)కు ఆదివారం గుండెపోటు రాగా తార్నాక ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్టంట్ వేశాక చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య సుల్తానా, ముగ్గురు కుమారులున్నారు. ఆరిఫ్ స్వగ్రామం పాపన్నపేట మండలం కుర్తివాడ. ప్రస్తుతం మెదక్ పట్టణంలో నివాసం ఉంటున్నాడు.
ఎన్నికల కోడ్ వేళ మాజీ MLA కారులో డబ్బులు పట్టుబడ్డాయి. హవేలీ ఘనపూర్ మండల శివారులో సోమవారం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ వాహనంలో రూ. 1,80,000 పట్టుబడినట్లు SI ఆనంద్ గౌడ్ తెలిపారు. ఎటువంటి ఆధారాలు చూపనందున సీజ్ చేసి కలెక్టర్ కార్యాలయంలో డిపాజిట్ చేసినట్లు పేర్కొన్నారు. కారులో ఉన్న నితిన్ రెడ్డి, మనోజ్‌లను అదుపులోకి తీసుకున్నామన్నారు.
ఆదిభట్ల PS పరిధి తుర్కయంజాల్ శ్రీ సాయిపంచవతి హోమ్స్‌లోని DSP రంగా నాయక్ ఇంటి ముందు ఆయన భార్య ఆందోళనకు దిగారు. వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను పట్టించుకోవడం లేదని జ్యోతి ఆరోపిస్తున్నారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తున్నారు. కాగా, రంగా నాయక్ ప్రస్తుతం మెదక్ ఏఆర్ డీఎస్పీగా పని చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికలు ప్రధాన పార్టీల నేతలకు అగ్ని పరీక్షలా మారాయి. ఆయా BRS, కాంగ్రెస్, BJP అభ్యర్థుల గెలుపు బాధ్యతలు అప్పగించడంతో ప్రచారంలో తలమునకలై ఉన్నారు. మెదక్ లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో BRS-6 చోట్ల, కాంగ్రెస్ ఒక చోట గెలుపొందాయి. మెదక్ ఎంపీ స్థానాన్ని ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రాజకీయాలు రంజుగా మారాయి. దీంతో ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు కత్తి మీద సాములా మారాయి.
రోడ్డు ప్రమాదంలో కూరుతు కళ్లేదుటే తండ్రి మృతిచెందాడు. మేడ్చల్ పోలీసుల సమాచారం.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌కు చెందిన రామ్ మురాట్ తన కుమార్తె(6)తో కలిసి ఆదివారం రాత్రి బైక్‌పై మేడ్చల్ నుంచి వస్తుండగా హైవేపై ఐసీఐసీఐ బ్యాంక్ సమీపంలో లారీ తగిలింది. దీంతో కిందపడ్డ రామ్ పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. చిన్నారి స్వల్పగాయాలతో బయటపడింది. ఘటనపై కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.