Medak

News March 21, 2024

మెదక్-ఎల్కతుర్తి జాతీయ రహదారిపై 14 మంది దుర్మరణం

image

మెదక్-ఎల్కతుర్తి జాతీయ రహదారి పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏడాదిన్నర వ్యవధిలో 14 మంది దుర్మరణం చెందారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించాలని రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండు ప్యాకేజీలుగా పనులు చేస్తున్నా, పనులు నెమ్మదిగా సాగడంతో పలు సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

News March 21, 2024

సిద్దిపేట: మద్యం మత్తు జీవితాలు చిత్తు

image

మద్యం మత్తు వాహన చోదకుల జీవితాలను చిత్తు చేస్తోంది. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ డివిజన్ వ్యాప్తంగా గత ఏడాది 9,645 మంది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ.. పోలీసులకు పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా పలువురికి జైలు శిక్షలతో పాటు రూ.93.73 లక్షల జరిమానా విధించారు. 34 మంది జైలు శిక్ష విధించారు.

News March 21, 2024

హుస్నాబాద్‌: యువకుడి సూసైడ్

image

హుస్నాబాద్‌కి చెందిన రుద్రయ్య(20) కరీంనగర్ జిల్లా‌లో పనికి వెళ్లాడు. ఈక్రమంలో ఓ యువతిని గత నెల 2న పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు రుద్రయ్య ఇంటికి వెళ్లి మేజర్ అయ్యే వరకు దూరంగా ఉండాలంటూ యువతిని తీసుకువెళ్లారు. అనంతరం ఫొటోలను డిలీట్ చేయాలంటూ బెదిరించడంతో మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News March 21, 2024

సంగారెడ్డి: ‘ధరణి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి’

image

ధరణి పెండింగ్ దరఖాస్తులను అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం ప్రకటనలో తెలిపారు. తహసిల్దార్ క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలించిన తర్వాత వెంటనే ఆర్డీవో, కలెక్టరేట్ పంపించాలని చెప్పారు. దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని దరఖాస్తులను పరిశీలించాలని సూచించారు.

News March 20, 2024

ఆరోగ్య బీమా పథకం అమలు చేయాలని మంత్రికి వినతి

image

విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య భీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ వినతి చేశారు. సంగారెడ్డిలో మంత్రిని కలిసి అత్యధిక విశ్రాంత ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న తమ సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు హెల్త్ ట్రస్ట్ బోర్డులో సభ్యత్వం కల్పించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

News March 20, 2024

టేక్మాల్: చెరువులో దూకి వృద్ధ మహిళ ఆత్మహత్య

image

టేక్మాల్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన నీరుడి కిష్టమ్మ(70) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గొల్లగూడెం గ్రామానికి చెందిన కిష్టమ్మ కుడి చెంపపై కంతి ఏర్పడి దుర్వాసన వస్తుంది. దాని కారణంగా ఆమె వద్దకు ఎవరు రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈరోజు మధ్యాహ్నం టేక్మాల్ పంతులు చెరువులో దూకి కిష్టమ్మ ఆత్మహత్య చేసుకుందని చెప్పారు.

News March 20, 2024

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి: కలెక్టర్

image

జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా సంబంధిత అధికారులు చూడాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మైనింగ్ అనుమతులకు రెవెన్యూ అధికారుల ఎల్ఓసి తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

News March 20, 2024

సంగారెడ్డి: ‘మార్చి 28 లోగా ఆ నిధులు ఖర్చు చేయాలి’

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, కేజీబీవీ పాఠశాలలకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులన్నీ మార్చి 28వ తేదీ లోపల డ్రా చేసి ఖర్చు చేయాలని లేనిచో నిధులన్నీ వెనక్కి వెళ్తాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలిపారు. అదేవిధంగా దీనికి సంబందించిన యూసీలను సిద్దం చేసుకోవాలని సూచించారు.

News March 20, 2024

25 నుంచి ఓయూలో సెల్ట్ తరగతులు

image

ఓయూలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో మార్చి 25వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు ప్రొఫెసర్ సవీన్ సౌడ తెలిపారు. ‘ఏ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్’ పేరుతో ఆఫ్‌లైన్‌లో నిర్వహించే 2 నెలల కోర్సుకు సాయంత్రం 5.30 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక బ్యాచ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలకు 7989903001లో సంప్రదించాలని సూచించారు.

News March 20, 2024

మెదక్, జహీరాబాద్‌లో మొదలైన సందడి..!

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో MP ఎన్నికల సందడి మొదలైంది. నేడే సార్వత్రిక ఎన్నికల తొలి నోటిఫికేషన్‌ విడుదలైంది. కాగా మెదక్, జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో BRS-8, కాంగ్రెస్- 5, BJP- 1 చోట విజయం సాధించాయి. కామారెడ్డిలో గెలిచిన బీజేపీ బలంగానే కనిపిస్తోంది. మరి లోక్‌సభ పోరులో ఓటరు నాడి ఎటువైపనేది ఆసక్తిగా మారింది.