India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రాత్రి భారీ వర్షం కురిసింది. గడచిన 24 గంటల్లో(ఉ. 8:30 గంటల వరకు) నమోదైన వర్షపాతం.. అత్యధికంగా కంగ్టిలో 68.8 మి.మీ., మనూర్ 41.8, ముక్తాపూర్ 39.3, పెద్ద శంకరంపేట 33.5, నాగల్ గిద్ద 28.8, రేగోడు 26.0, కోహిర్ 11.5, బోడగాట్, మునిపల్లి 11.0, సిర్గాపూర్ 9.8, అల్లాదుర్గం 8.0, మొగుడంపల్లి 7.8, లింగాయపల్లి 7.3, చికోడ్ 4.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.
కొండపాక మండలం దుద్దెడ నల్లచెరువు ప్రాంతంలో ఏడు నెమళ్లు మృతిచెందాయి. ఓ రైతు పశువులకు నీళ్లు పెట్టడానికి వెళ్తే నెమళ్లు అక్కడ పడి ఉన్నాయి. ఫారెస్ట్ అధికారులకు రైతు సమాచారాన్ని అందజేశారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చందు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 7 చనిపోగా వాటిళ్లో ఓ నెమలి బతికి ఉందని గుర్తించి వెంటనే దుద్దెడ వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. విషపు గుళికల వల్లే చనిపోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఎన్నికల సంఘం తీసుకున్న కీలక నిర్ణయం ద్వారా ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసే పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేసే వెసులుబాటు కల్పించింది. ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్(EDC)తో ఎన్నికల విధులు నిర్వర్తించే పోలింగ్ కేంద్రం నుంచే ఓటు వేసే అవకాశం రావడంతో పోస్టల్ బ్యాలెట్ తిప్పలు తప్పనున్నాయి. జహీరాబాద్ సెగ్మెంట్‌లో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడ డ్యూటీ చేసిన ఈడీసీతో ఓటు వేయవచ్చు.
ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నోట్ల కట్టలతో మన ముందుకు వస్తోందని, మాజీ మంత్రి హరీశ్‌రావు నంగనాచి మాటలను ప్రజలు నమ్మొద్దని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు విమర్శించారు. రామాయంపేటలో ఎన్నికల ప్రచార ర్యాలీని ప్రారంభించారు. నామ్‌కేవాస్తేగా అసెంబ్లీ ఎన్నికల ముందు రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశారని విమర్శించారు. ఇప్పటికీ సిబ్బంది నియామకం లేదని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ మోసాలనే ప్రచార హస్త్రాలుగా వాడుకొని ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలని కార్యకర్తలకు మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ను ఎండగట్టారు. ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఎల్ఈడీ స్కిన్ పై పార్టీ శ్రేణులకు చూపించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై నిలదీయాలన్నారు.
కౌడిపల్లిలో జరిగిన కౌడిపల్లి, చిలిపిచెడ్, కుల్చారం మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సునీత లక్ష్మారెడ్డి మాట్లాడారు. మెదక్ గడ్డ కేసీఆర్ అడ్డా అని, ఎవరు అడ్డొచ్చినా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నారు. అలాంటి వారికి ఓటుతో బుద్ది చెప్పాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఐనవోలు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు మహేశ్, శ్రీనుగా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లోక్‌సభ బరిలో నిలిచే అభ్యర్థులు ప్రచార సమరానికి సమాయత్తమవుతున్నారు. మెదక్ సెగ్మెంట్‌లో BRS నుంచి MLC వెంకట్రామ్‌రెడ్డి, మాజీ MLA రఘునందన్ రావు (BJP), నీలం మధు (కాంగ్రెస్) బరిలో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓట్లను రాబట్టుకునే పనిలో అభ్యర్థులు బిజీగా ఉన్నారు. ఈనెల 18 తర్వాత ప్రచారం హోరెత్తనుంది .
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలును పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా హవేలీ ఘన్పూర్ మండల్ బూరుగుపల్లి, వాడి, రాజుపేట, కొత్తపల్లి, గాజిరెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించారు. ముందుగా గ్రామాల్లో తాగునీటి సమస్యపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. డిఎస్ఓ బ్రహ్మారావు, ఫ్యాక్స్ సీఈవో సాయి తదితరులున్నారు.
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై బాలిక మృతి చెందిన ఘటనా కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో జరిగింది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన చందన కోహిర్‌లో ఇంటర్ చదువుతోంది. ఇంటి వద్ద పనులు చేసుకుంటుండగా ఇంటికి ఆనుకొని ఉన్న కరెంటు తీగలు చేతికి తగలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.