India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ MP స్థానంపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. మైనంపల్లి హన్మంతరావు, MLA రోహిత్ కీలక నేతలను హస్తం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. బుధవారం BRS కౌన్సిలర్లు రోహిత్‌ను కలవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే రామాయంపేటలోని నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరగా.. తూప్రాన్ మున్సిపాలిటీలోనూ హస్తం పాగా వేసింది. లోక్‌సభ అంతటా పార్టీ బలోపేతం కోసం మైనంపల్లి ప్రత్యేక చొవర తీసుకొంటున్నట్లు టాక్.
మెదక్ ఖిల్లాను కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఖిలా చరిత్రను ప్రముఖ వ్యాఖ్యాత వైద్య శ్రీనివాస్ వివరించారు. కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన మెదక్ దుర్గం ప్రాముఖ్యత తెలిపారు. ఈ ఖిలా మెదక్‌కు తలమానికం అన్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్ ఖిల్లాను కుటుంబసభ్యులతో కలిసి తిరిగారు. అంతకు ముందు ఏడుపాయల వనదుర్గ మాతను కలెక్టర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామానికి చెందిన ఉబిది యేసు(40) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు పెరిగిపోవడంతో కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అప్పుల బాధతో మనస్థాపానికి గురైన యేసు రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పాపన్నపేట పోలీసులు కుర్తివాడకు చేరుకొని విచారణ చేస్తున్నారు.
సదాశివపేట మున్సిపాలిటీలో క్రీడా ప్రాంగణ నిర్వహణ అధ్వానంగా మారింది. బోర్డులు పాతిన మున్సిపల్ అధికారులు నిర్వహణ పట్టించుకోకపోవడంతో కొందరు కబ్జా చేస్తున్నారు. పట్టణంలోని ఓ క్రీడా ప్రాంగణంలో కొందరు గుడిసెలు వేసుకొని నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్రీడా ప్రాంగణాలు కబ్జాకు గురికాకుండా చూడాలని కోరుతున్నారు.
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి-ముత్యంపేట గ్రామాల మధ్య కెనాల్‌లో చేపలు పట్టడానికి వెళ్లి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతులు ఏపీకి చెందిన తిరుపతి రావు(30), సోమయ్య(30)గా గుర్తించారు. మృతులిద్దరు స్థానిక NPS కెనాల్‌లో కూలీలుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పరిధి టోల్ ప్లాజా వద్ద ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన సురేష్ గంగారం(51) మృతి చెందాడు. టోల్ ప్లాజా వద్ద పార్కు చేసిన కంటైనర్ లారీ అకస్మాత్తుగా ముందుకు వెళ్లి రోడ్డుకు అడ్డంగా డివైడర్ పైకెక్కింది. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కామారెడ్డికి చెందిన డ్రైవర్ అనిల్ తీవ్రంగా గాయపడ్డారు.
అధికారులు ఆర్భాటంగా దాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా కొనుగోళ్లను మాత్రం ప్రారంభించలేదు. ప్రస్తుతం వాతావరణ మార్పుల నేపథ్యంలో కల్లాల్లో ధాన్యం పోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లాలో 2,60,933 ఎకరాల్లో వరి సాగవగా.. 3.66 లక్షల మెట్రిక్ టన్నుల పంట సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 200కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా పూర్తిస్థాయిలో కోనుగోళ్లు చేయట్లేదని రైతులు అంటున్నారు.
మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 12తో దరఖాస్తు గడువు ముగుస్తుందని మెదక్ ఆర్సీఓ ప్రభాకర్ అన్నారు. అర్హులైన బాలబాలికలు mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఈ నెల 28న అర్హత పరీక్ష నిర్వహిస్తామన్నారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు పోలీసు చెక్ పోస్టుల్లో ఎలాంటి ఆధారాలు లేని రూ. 21,27,330 సీజ్ చేసినట్లు ఎస్పీ డాక్టర్ బాలస్వామి తెలిపారు. అలాగే రూ. 17,06,600 విలువగల ఫ్రీ బీస్, రూ.9,75,800 విలువైన 2535.800 లీటర్ల అక్రమ మద్యం పట్టుకున్నట్లు వివరించారు. వీటిని ఎన్నికల గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కమిటీకి అప్పగించినట్లు వివరించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మీద కోపంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేశారని BJP మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను చూసి ఓటు వేయలేదన్నారు. హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అయినా కూడా ఇప్పుడు మరోసారి 17 ఎంపీ సీట్లు గెలిపించండి అంటూ ప్రజలకు మాయ మాటలు చెబుతున్నారని ఈటల దుయ్యబట్టారు. దీనిపై మీ కామెంట్?
Sorry, no posts matched your criteria.