India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2025-26 విద్యాసంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. సెప్టెంబర్ 16లోగా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.navodaya.gov.in వెబ్ సైట్ చూడాలన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకానికి సంభందించిన ఆయా విభాగాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్లో ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకంపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం అప్లికేషన్లు 5479 వచ్చాయని, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ గణేష్ రాం కలెక్టర్‌కు తెలిపారు.
సంగారెడ్డిలోని జిల్లా కోర్టులో న్యాయవాదుల క్రీడలను జిల్లా జడ్జి భవాని చంద్ర గురువారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. క్రీడల వల్ల మానసిక ప్రశాంతత వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల కార్యదర్శి అశోక్, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని ప్రొఫెసర్ కాసీం అన్నారు. భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపర్చిన ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు, మాదిగ ఉప కులాలు అందుకోవడంలో నష్టపోయారని, సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు అన్నారు. ఎంఎస్‌పీ రాష్ట్ర నాయకులు మైస రాములు మాదిగ, ఎంఆర్‌పీఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ముండ్రాతి కృష్ణ ఉన్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిపోయిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం సీఎం ఛాంబర్ ముందు నిరసన తెలుపుతున్న హరీశ్ రావుతోపాటు పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీలో ఒక మహిళకు అన్యాయం జరిగితే మైక్ ఇవ్వకుండా ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారని హరీశ్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఇన్ని ఆంక్షలు లేవని, రాష్ట్రం మొత్తం పోలీస్ రాజ్యంగా మారిపోయిందని మండిపడ్డారు.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానన్నారు. అణగారిన వర్గాల దశాబ్దాల పోరాటానికి న్యాయం జరిగిందని, అలుపెరుగని పోరాటయోధుడు మంద కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సుప్రీం తీర్పుతో న్యాయం, ధర్మం గెలిచిందని పేర్కొన్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించిందని చెప్పారు. అనగారిన వర్గాలకు న్యాయం తిరుగుతుందని వివరించారు. ఉద్యమంలో ఎంతోమంది అమరులయ్యారని తెలిపారు.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో నకిలీ బంగారం రమణమ్మ లీలలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం అమీన్పూర్‌లో మోసం చేసిన రమణమ్మ తూప్రాన్ మండలంలోని ఇమాంపూర్‌లో సైతం మోసం చేసినట్లు బాధితులు తెలిపారు. గ్రామానికి చెందిన ఒక వ్యాపారికి నకిలీ బంగారం అంటగట్టి రూ.4లక్షల ఎత్తుకెళ్లారని తెలిపారు. అయితే ఎవరికీ చెప్పుకోలేకపోయామని వాపోయారు. పోలీసులకు సైతం ఫిర్యాదు చేయలేదని చెప్పారు.
సభ్య సమాజం తలదించుకునే ఘటన మెదక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాసాయిపేట మండలంలో తల్లి పైనే కుమారుడు అఘాయిత్యానికి పాల్పడినట్లు చేగుంట ఎస్సై తెలిపారు. భార్యా పిల్లలు మహంకాళి జాతరకు వెళ్లగా.. తల్లితో ఇంటి వద్ద ఉన్న యువకుడు మద్యం మత్తులో 29న రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా నిన్న వృద్ధురాలైన తల్లి పోలీసులను ఆశ్రయించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పటాన్‌చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో జరిగిన భేటీలో పాల్గొన్నారు. వారితో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఉన్నారు.
Sorry, no posts matched your criteria.