India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రామయంపేట 44వ జాతీయ రహదారిపై సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు సమాచారంతో రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి గుజరాత్ వెళ్తున్న ఒక లారీలో 304 క్వింటాల్ రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. లారీ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
9 ఏళ్లుగా పోని కరెంట్.. నేడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎందుకు పోతోందని BRS మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, MLC వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం సిద్ధన్నపేటలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పోతోందని, చెరువులు ఎండిపోయి.. కరవు వచ్చిందన్నారు. మళ్లీ KCR పాలన కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
దేశమంతా నరేంద్ర మోదీ గాలి వీస్తుందని, మూడోసారి ఆయనే ప్రధాని కావడం ఖాయమని బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే, ఆ పార్టీ జహీరాబాద్ ఎన్నికల ఇన్‌ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జహీరాబాద్‌లో కార్యకర్తల సమావేశం నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరని విమర్శించారు. బీబీ పాటిల్‌ను గెలిపించాలని కోరారు. దీనిపై మీ కామెంట్?
జిన్నారం మండల పరిధిలోని మాదారం, కొడకంచి, శివనగర్, ఊట్ల, రాళ్లకత్వ, గడ్డపోతారం, వావిలాల తదితర గ్రామాలలో రోజురోజుకీ కోతుల బెడద ఎక్కువైంది. ముఖ్యంగా కోతుల గుంపు రోడ్లపై తిష్ట వేసి వాహనదారులకు ఇబ్బందులు గురిచేస్తున్నాయి. కోతులు ఇళ్లల్లోకి చొరబడి చాలా మందిపై కోతులు దాడులు చేసి గాయపరిచాయి. గ్రామపంచాయతీ పాలకులు సమస్యను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వాపోతున్నారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జుజల్పూర్ శివారులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. 50-60 మధ్య వయస్సు గల మహిళగా పోలీసులు గుర్తించారు. గత వారం రోజుల నుంచి ఆ ప్రాంతంలో మతి స్థిమితం కోల్పోయి తిరుగుతుండగా స్థానికులు చూసినట్లు తెలిపారు. వివరాలు ఎవరికైనా తెలిస్తే ఖేడ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ విద్యా చరణ్ రెడ్డి చెప్పారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో కరవు రోజురోజుకు కోరలు చాస్తోంది. ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు అడుగంటాయి. బోరు బావుల్లో నీళ్లు లేవు. 365 రోజులు నీరుండే వ్యవసాయ బావుల్లో కూడా ఇదే పరిస్థితి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ యాసంగిలో మొత్తం 8.49 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుండగా.. ఇందులో 20% పంటలు కరువు కారణంగా ఎండిపోయాయి. తాగునీటి ఎద్దడి తీవ్రమవుతోంది. పల్లెలు, పట్టణాలు సమస్య నెలకొంది.
ఆన్‌లైన్ ఉద్యోగం అంటూ వచ్చిన ప్రకటనకు స్పందించిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మోసపోయింది. అమీన్ పూర్ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రీన్ మెడోస్ కాలనీలో నివాసం ఉంటున్న ఉద్యోగిని ఫోన్‌కు గతనెల 13న ఆన్‌లైన్ జాబ్ అంటూ లింకు వచ్చింది. టాస్కులు పూర్తి చేస్తే కమీషన్ ఇస్తామనడంతో రూ.2.92 లక్షలు వేసింది. తర్వాత అవతలి వ్యక్తులు స్పందించలేదు. దీంతో ఆమె శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్‌లో ఇంటర్, పాఠశాల విద్యార్థులకు వేసవి ప్రత్యేక శిక్షణ తరగతులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్ మెంట్ కోర్సుల్లో నెల రోజుల శిక్షణకు ఈ నెల 15 నుంచి తరగతులు ప్రారంభంకానున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తూప్రాన్ పట్టణంలో హరితహారంలో నాటిన చెట్టు నరికిన కేతారంకు రూ.5 వేల జరిమానా విధించినట్లు మున్సిపల్ కమిషనర్ కాజా మోహిజుద్దీన్ తెలిపారు. తూప్రాన్ పట్టణంలోని పాత సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద హరితహారంలో నాటిన చెట్టును నరికినట్లు వివరించారు. మున్సిపల్ మేనేజర్ రఘువరన్, టౌన్ ప్లానింగ్ జూనియర్ అసిస్టెంట్ దుర్గయ్య పరిశీలన చేసి జరిమానా విధించారు.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. సిద్దిపేట 43.9, లకుడారం 43.7, రేగోడు 43.2, చిట్యాల 43.0, దూల్మిట్ట 42.9, తుక్కాపూర్ 42.6, రాఘవపూర్ 42.4, రాంపూర్ 42.2, దామరంచ, బెజ్జంకి 42.0, రేబర్తి, కట్కూర్ 41.9, కొమురవెల్లి 41.8, సదాశివపేట, మల్చల్మ 41.6, నారాయణరావుపేట, జిన్నారం 41.5, సముద్రాల, పోడ్చన్ పల్లి 41.4, చౌటకూరు, అంగడికిష్టాపూర్ 41.2 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి
Sorry, no posts matched your criteria.