India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అండర్-17 జూనియర్ నేషనల్ ఫుట్‌బాల్ తెలంగాణ టీంకు కెప్టెన్‌గా చిన్నకోడూరు జూనియర్ కాలేజీకి చెందిన విద్యార్థిని వడ్లకొండ చైతన్య శ్రీ ఎంపికైనట్లు రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో జరిగే పోటీల్లో తెలంగాణ టీంకు కెప్టెన్‌గా చైతన్యశ్రీ ఎంపిక కావడం పట్ల ప్రిన్సిపల్ భూపాల్ రాజు, అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యమని సిద్దిపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేటలో ఆయన అధ్యక్షతన జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న వైద్య అధికారులకు, RBSK వైద్య అధికారులకు, MLHPలకు, వాతావరణ మార్పుల వల్ల వచ్చే సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. వ్యాధుల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సిబ్బందికి సూచించారు.
పెద్దశంకరంపేట మండల కేంద్రానికి చెందిన వడ్ల విజయ్ కుమార్(32) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక ప్రియాంక కాలనీకి చెందిన విజయ్ మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు వివరించారు. దీంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
ఇన్వెస్టిగేషన్‌లో లోపాలు ఉంటే సహించేది లేదని ఎస్పీ రూపేశ్ హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో అర్ధ వార్షిక సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. సైబర్ క్రైమ్ ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. నగదు రికవరీ చేసేలా చూడాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు, డీఎస్పీలు పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని మాత ఆలయం హుండీని మంగళవారం లెక్కించారు. భక్తులు అమ్మవారికి సమర్పించుకున్న హుండీ ఆదాయం రూ.50,28,595 వచ్చినట్లు ఆలయ ఛైర్మన్ సాతెల్లి బాలాగౌడ్, ఈవో డి.కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, రాజరాజేశ్వరీ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
రైతును రాజు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం మెదక్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రెండవ విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతును రాజు చేయాలనే సదుద్దేశంతో ప్రభుత్వం సరైన సమయంలో రుణమాఫీ చేస్తుందన్నారు. రూ. 2లక్షల లోపు రుణాలున్న రైతులకు కూడా త్వరలోనే నిధులు వస్తాయన్నారు. ఆయా శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామానికి చెందిన మహిళ, ముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారు. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామానికి చెందిన చిన్న కటికే యాదుల్ మియా భార్య చిన్న కటికే షకీరా(30).. షిఫా మహిన్(8), ఆప్షన్, మరోక చిన్నారితో కలిసి శనివారం మధ్యాహ్నం బయటకెళ్లింది. అప్పటి నుంచి వెతికినా ఆచూకీ లేకపోవడంతో రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్ జిల్లా శివంపేట మండలం రెడ్యా తండా గ్రామపంచాయతీ పరిధిలోని వెంక్యా తండాలో కుమార్ అనే ట్రాక్టర్ డ్రైవర్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు.. గత రాత్రి ఒక ట్రాక్టర్ బ్యాటరీ చోరీ చేస్తున్న సమయంలో స్థానికులు గుర్తించి కుమార్‌ను చితకబాది బంధువులకు అప్పగించారు.
ఈక్రమంలో రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ డిపోలకు కొత్తగా 87 బస్సులు వచ్చినట్లు మేనేజర్ ప్రభులత ఓ ప్రకటనలో తెలిపారు. మెదక్ రీజియన్ పరిధిలో ఇప్పటి మహలక్ష్మి పథకం కింద 3.80 కోట్ల మంది మహిళలు ప్రయాణించారని, ఈ పథకం తర్వాత 70% ఉన్న ఓఆర్ 98 శాతానికి చేరిందని ప్రకటనలో పేర్కొన్నారు. రీజియన్ పరిధిలో 10 డీలక్సు, 35 పల్లెవెలుగు, 42 ఎక్స్‌ప్రెస్ బస్సులు కొత్తగా వచ్చాయన్నారు.
గిఫ్ట్ వోచర్ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రూ.లక్షలు పోగొట్టుకున్నాడు. అమీన్‌పూర్ పోలీసుల వివరాలు.. సాయి భగవాన్ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి జులై 17న యాపిల్ ప్లే స్టోర్‌లో గిఫ్ట్ వోచర్లు కొనుగోలు చేస్తే నగదు రెట్టింపొస్తాయని మెసేజ్ వచ్చింది. నమ్మిన బాధితుడు రూ.2.50లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. అసలు, రెట్టింపు డబ్బు ఇవ్వాలని అడగ్గా అపరిచిత వ్యక్తి స్పందించ లేదు. పోలీసులను ఆశ్రయించాడు.
Sorry, no posts matched your criteria.