Medak

News March 28, 2024

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు

image

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. కొద్ది రోజులుగా మెదక్ పార్లమెంట్ అభ్యర్థి విషయంలో తాత్సారం జరిగిన విషయం తెలిసిందే. జగ్గారెడ్డి, ఆయన సతీమణి నిర్మలతో పాటు నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలని ఆలోచన చేసిన విషయం తెలిసిందే. చివరకు నీలం మధు పేరును ప్రకటించారు.

News March 28, 2024

సిద్దిపేటలో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం: హరీశ్ రావు

image

సిద్దిపేటలో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం ఈనెల 29న మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలోని ఓ గార్డెన్‌లో 3వేల మందితో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ఇందుకు మండల, పట్టణ నాయకత్వం సమన్వయంతో పార్టీ శ్రేణులు సన్నాహక సమావేశానికి తరలివచ్చేలా చూడాలన్నారు.

News March 27, 2024

మెదక్: అత్తను హతమార్చిన అల్లుడు

image

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం తంపులూరులో దుబ్బగళ్ల సంగమ్మ (44)ను వరసకు  అల్లుడు హత్య చేసినట్లు అల్లాదుర్గం CI రేణుక రెడ్డి, SI మురళి తెలిపారు. ఈ నెల 20న సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం మర్వెల్లికి చెందిన మల్లగుల్ల యేసు ఆమె ఇంటికి వచ్చాడు. రాత్రి ఆస్తి కోసం సంగమ్మను యేసు హత్య చేసి, ఆభరణాలు తీసుకొని పారిపోయినట్లు వివరించారు. ఈరోజు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

News March 27, 2024

గుమ్మడిదల: మహిళ హత్య.. దొంగ స్వామీజీ అరెస్టు

image

పూజలు చేస్తామని నమ్మించి మహిళను హత్య చేసిన దొంగ స్వామీజీని అరెస్టు చేసినట్లు జిన్నారం సీఐ సుధీర్ కుమార్ తెలిపారు. గుమ్మడిదల పోలీస్ స్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బొంతపల్లికి చెందిన బుచ్చమ్మ(60)ను పూజలు చేసే మంచి జరుగుతుందని దొంగ స్వామీజీ శివ నమ్మించాడు. ఫిబ్రవరి 13న హత్య చేసి 4.3 తులాల బంగారం దొంగిలించాడు. పోలీసులు విచారణ చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

News March 27, 2024

రూ.100 కోట్లకు ఎంపీ స్థానాన్ని అమ్ముకున్న బీఆర్ఎస్: రఘునందన్ రావు

image

మెదక్ పార్లమెంటు స్థానాన్ని రూ.100 కోట్లకు బీఆర్ఎస్ అమ్ముకుందని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. కందిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లాపై మాజీ మంత్రి హరీశ్ రావు పెత్తనం చేయడం సరికాదని చెప్పారు. దమ్ముంటే సొంత జిల్లా కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.

News March 27, 2024

కరవును రాజకీయం చేయొద్దు: మంత్రి పొన్నం

image

బీఆర్ఎస్ కరవు, వర్షపాతానికి సంబంధించిన అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కరవుకి కాంగ్రెస్, బీఆర్ఎస్ కారణం కాదని, అది ప్రకృతి ప్రభావం అని పేర్కొన్నారు. ప్రకృతిలో ఏర్పడ్డ ఇబ్బందులకు ఎవరూ బాధ్యులు కారన్నారు. వేసవిలో తాగునీరు, సాగునీరు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

News March 27, 2024

ఏడుపాయలలో విషాద ఘటన

image

ఏడుపాయల చెక్‌డ్యామ్‌లో మునిగి వ్యక్తి మృతి చెందాడు. పాపన్నపేట ఎస్సై కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి మండలానికి చెందిన సిద్ధిరాములు(31) వన దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. చెక్ డ్యామ్‌లో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు SI వెల్లడించారు. 

News March 27, 2024

ఓయూలో దరఖాస్తుల ఆహ్వానం

image

ఓయూ క్యాంపస్‌లోని ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్‌లో వివిధ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ఛైర్‌పర్సన్ డాక్టర్ రమాప్రభ తెలిపారు. ఆరు వారాల న్యూస్ రీడింగ్, వాయిస్ ఓవర్, డబ్బింగ్, యాక్టింగ్ తదితర సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 1 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 27, 2024

MDK: విషాదం.. రైతు మృతి

image

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కొత్త కాపు నరేందర్ రెడ్డి(53) చింతచెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. నిన్న సాయంత్రం చింతకాయలు తెంపేందుకు చెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడి మృతిచెందగా.. కుటుంబీకులు రాత్రి గుర్తించారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News March 27, 2024

MDK: KCRకు ఇచ్చే GIFT అదే: MLA

image

మెదక్ ఎంపీ స్థానాన్ని గెలిచి BRS అధినేత KCRకు అసలైన గిఫ్ట్ ఇద్దామని ఆ పార్టీ శ్రేణులకు సంగారెడ్డి MLA చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డిలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో BRS ఓడిపోయినంత మాత్రాన శ్రేణులు నిరాశ చెందొద్దని, ఈసారి గెలుద్దామన్నారు.