India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జహీరాబాద్ మం. తూముకుంట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని అస్థిపంజరం లభ్యమైనట్లు రూరల్ SI ప్రసాద్ రావు తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఫారెస్ట్ అధికారులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లినట్లు పేర్కొన్నారు. 60 నుంచి 65 సంవత్సరాల మధ్యగల వృద్ధుడి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి, ఎముకల మాత్రమే మిగిలినట్లు గుర్తించామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు SI వివరణ ఇచ్చారు.
షాంపూ కోసం కన్నతల్లిని ఇటుకతో కొట్టి హత్య చేసిన సంఘటన మెదక్ మండలం రాజ్‌పల్లిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దేవమ్మ(58)తో తన కుమరుడు నారాయణ షాంపూ విషయంలో గొడవపడ్డాడు. క్షణికావేశంలో తల్లిని ఇటుకతో తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మెదక్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న కామారెడ్డి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడు మెదక్ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన మహేశ్ అనే వ్యక్తిగా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.
మాజీ సీఎం KCR సన్నిహితుడు, నర్సాపూర్ మాజీ MLA మదన్ రెడ్డి BRS పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం, ఆ తర్వాత ఎంపీ టికెట్ ఇస్తారని ఇవ్వకపోవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక నేతలు తెలిపారు. కాంగ్రెస్ నేత, మాజీ MLA మైనంపల్లి హనుమంతరావుతో మదన్ రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారని టాక్. కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఇస్తే చేరుతా అన్నారని సమాచారం.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరన్న చెరువులో పడి ఇద్దరి యువకులు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాలు.. హోలీ సంబరాల్లో భాగంగా సూరారం గ్రామానికి చెందిన శ్రావణ్ (17), శంకర్ (22) తమ మిత్రులతో కలిసి వీరన్నగూడెం చెరువులో స్నానానికి వెళ్లి నీట మునిగి చనిపోయారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.
సంగారెడ్డి జిల్లాలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పటాన్‌చెరు పరిధి బీరంగూడకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. లండన్ నుంచి HYD వస్తున్నానని నమ్మించి పలు దఫాలుగా రూ.8.57 లక్షలు అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది. అనంతరం రెస్పాన్స్ రాకపోవడంతో మోసపోయిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో పదో వారం పురస్కరించుకుని రూ.43.76 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో బాలాజీ ప్రకటించారు. అన్ని రకాల ఆర్జిత సేవలు, దర్శనం, ప్రసాదాల విక్రయాల ద్వారా శనివారం రూ.4,77,648, ఆదివారం రూ.34,98,777, సోమవారం రూ.4,00,020 ఆదాయం సమకూరినట్లు వారు తెలిపారు.
ఒంటరిగా వెళుతున్న వారే లక్ష్యంగా దారి దోపిడీలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీసులు అరెస్టు చేశారు. CI ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాలు.. పటాన్‌చెరులో ఉంటున్న ఏడుగురు సభ్యుల ముఠా ఒంటరి మహిళలనే లక్ష్యంగా చేసుకొని దారి దోపిడీలకు పాల్పడుతోంది. సోమవారం ఇంద్రేశం వద్ద ORR సర్వీస్ రహదారిలో వాహనాలను తనిఖీ చేస్తుండగా పారిపోతున్న వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫాంల కోసం కుట్టుకూలి ఛార్జీలను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి సంవత్సరం ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ముడి సరకును దర్జీలతో కుట్టిస్తుండగా 2023 -24 విద్యాసంవత్సరానికి కుట్టు కూలిని ఇటీవల మంజూరు చేసింది. సర్వ శిక్ష అభియాన్ నుంచి మొత్తంగా రూ.2.82 కోట్లు మంజూరయ్యాయి.
BRS కంచుకోట, హరీశ్‌రావు ఇలాకా సిద్దిపేటలో రాజకీయాలు అంతుపట్టడం లేదు. BRSకి చెందిన కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌లో చేరదామనుకునేవారు గోవా టూర్ వెళ్లి అక్కడ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. సిద్దిపేట మున్సిపల్ ఛైర్మన్, భర్తపై అసంతృప్తిగా ఉండి అవిశ్వాస తీర్మానానికి BRS కౌన్సిలర్లు మొగ్గుచూపుతున్నారని, గోవా నుంచి రాగానే పార్టీ మారుతారని చర్చ సాగుతోంది.
Sorry, no posts matched your criteria.